బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 విడుదల: ప్రారంభ ధర రూ. 82,400 లు

Written By:

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త పల్సర్ ఎన్ఎస్160 మోటార్ సైకిల్ విడుదల చేసింది. బజాజ్ ఆటో ఎలాంటి ఆడంబరాలు లేకుండా నిశ్శబ్దంగా దీనిని విడుదల చేసినట్లు ఆటోకార్ ఇండియా పేర్కొంది. రూ. 82,400 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైన పల్సర్ ఎన్ఎస్160 బైకు పూనే మరియు ముంబాయ్ డీలర్ల వద్ద విక్రయాలకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 విడుదల

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 లో 160.3సీసీ సామర్థ్యం ఉన్న ఆయిల్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఇది 15.5బిహెచ్‌పి పవర్ మరియు 14.6ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 విడుదల

ఎన్ఎస్200 బైకులోని స్టీల్ పెరీమీటర్ ఫ్రేమ్ ఆధారంతో ఎన్ఎస్160ను అభివృద్ది చేశారు. డిజైన్ పరంగా అచ్చం ఎన్ఎస్200 రూపంలోనే ఉన్నప్పటికీ, అందులోని స్వింగ్ కాస్త పలుచగా ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 విడుదల

సరికొత్త పల్సర్ 160సీసీ బైకులో స్ల్పిట్ సీట్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్, ముందువైపు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు. ఎన్ఎస్200 బైకు బరువు 142కిలోలుగా ఉంది. ఎన్ఎస్200తో పోల్చుకుంటే దీని బరువు 10కిలోలు తక్కువగా ఉంది.

బజాజ్ పల్సర్ ఎన్ఎస్160 విడుదల

బెంగళూరు మరియు హైదరాబాద్ లోని బజాజ్ డీలర్లను సంప్రదించగా, మరో రెండు, మూడు వారాల్లో బైకులు డీలర్ల వద్దకు రానున్నాయి. అయితే జూలై 1, 2017 తరువాత జిఎస్‌టి అమలుతో ధరలను నిర్ణయించి వెల్లడించనున్నట్లు తెలిపాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోని 150సీసీ సెగ్మెంట్లో పోటీని ఎదుర్కునేందుకు అనేక ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో ఎన్ఎస్160 బైకును విడుదల చేసింది. జపాన్‌కు చెందిన సుజుకి జిక్సక్, హోండా హార్నెట్ 160ఆర్ మరియు యమహా ఎఫ్‌జడ్ లకు గట్టిపోటీనివ్వనుంది.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu: Bajaj Pulsar NS160 Launched In India — Priced At Rs 82,400
Story first published: Wednesday, June 28, 2017, 18:55 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark