బజాజ్ చేతక్ రీలాంచ్ ఈ ఏడాదిలోనే....!!

Written By:

బజాజ్ ఆటో తమ లెజండరీ స్కూటర్‌ను మళ్లీ మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు గత ఏడాది ఆధారంలేని వార్తలొచ్చాయి. అయితే మరో ఆటోమొబైల్ వేదిక 2017 లో బజాజ్ తమ చేతక్ స్కూటర్ ను ఈ ఏడాదిలోనే విడుదల చేయనున్నట్లు ఇంటర్నెట్లో వార్తలు వెలువడుతున్నాయి.

ప్రస్తుతం లభించిన బజాజ్ చేతక్ స్కూటర్ విడుదల వివరాలు....

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బజాజ్ చేతక్

ఇంజన్, సౌకర్యం మరియు స్టోరేజీ పరంగా భారీ విజయాన్ని సాధించిన చేతక్ స్కూటర్‌ విడుదల 2017లోనే ఉండనున్నట్లు ఆధారం లేని వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అయితే బజాజ్ చేతక్ విడుదల ద్వారానే గుర్తింపు పొందిందనేది జగమెరిగిన సత్యం.

బజాజ్ చేతక్

ఎక్కువ సామర్థ్యం ఉన్న ఉత్పత్తుల మీద దృష్టి సారిచడంతో చేతకు బజాజ్ లైనప్‌ నుండి వెనుతిరిగింది. సరసమైన ధరలలో శక్తివంతమైన ఉత్పత్తులను పల్సర్ శ్రేణిలో ప్రవేశపెట్టింది. కెటిఎమ్‌తో జత కట్టిన తరువాత మార్కెట్ వర్గాలు ఊహించని విధంగా వి 15 మరియు డామినర్ 400 మోటార్ సైకిళ్లను విడుదల చేసింది.

బజాజ్ చేతక్

దేశీయంగా స్కూటర్ల అమ్మకాలు బైకులతో పోటీపడుతుండటం, ప్రతి సారి కూడా టాప్ 10 టూ వీలర్ల జాబితాలో హోండా ఆక్టివా స్కూటర్ నిలవడం ద్వారా బజాజ్ కూడా స్కూటర్ల సెగ్మెంట్లోకి రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తోందనే విషయం కూడా స్పష్టం అవుతోంది.

బజాజ్ చేతక్

అప్రిలియా ఎస్ఆర్ 150 దేశీయంగా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది, ఒకానొక దశలో వెస్పా అమ్మకాలను కూడా దాటిపోయింది. కాబట్టి చేతక్ బ్రాండ్ పేరుతో ప్రీమియ్ స్కూటర్ సెగ్మెంట్లోకి బజాజ్ కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది.

బజాజ్ చేతక్

ప్రస్తుత యువతకేమో గానీ ఒకానొకప్పుడు చేతక్ స్కూటర్లను నడిపి ఇప్పుడు వయసైపోయిన వారు మాత్రం, ఇది ఎలా ఉండనుంది అనే ఉత్సుకతతో దీని కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆధారం లేని వార్తల ప్రకారం 2017 మలి సగంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

బజాజ్ చేతక్

అప్రిలియా ఎస్ఆర్ 150 స్కూటర్‌కు పోటీగా విడుదలయితే దీని ధర రూ. 60,000 నుండి 65,000 ల మధ్య ఎక్స్ షోరూమ్ గా ఉండే అవకాశం ఉంది.

బజాజ్ చేతక్

బజాజ్ ఆటో సరికొత్త చేతక్ స్కూటర్ కోసం 125సీసీ సామర్థ్యం గల 9 నుండి 11బిహెచ్‌పి మధ్య పవర్ ఉత్పత్తి చేయగల ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ డిటిఎస్-ఐ ఇంజన్ ను అందివ్వనుంది.

బజాజ్ చేతక్

ఎక్ట్సీరియర్ పరంగా ఆధునిక బాడీ డీకాల్స్ మరియు ఆకర్షణీయమైన రంగుల్లో విడుదల కానున్న ఇందులో మునుపటిలా సౌకర్యానికి అధిక ప్రాధాన్యతనివ్వనుంది.

బజాజ్ చేతక్

బజాజ్ ఆటో ఈ చేతక్ ను ఈ ఏడాదిలో విడుదల చేస్తే ప్రస్తుతం ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లో ఉన్న అప్రిలియా ఎస్ఆర్150 మరియు పియాజియో వెస్పాలకు బలమైన పోటీనివ్వనుంది.

బజాజ్ చేతక్

బజాజ్ ఆటో ఈ చేతక్ స్కూటర్ డిజైన్, ఇంజన్ మరియు సాంకేతిక అంశాల పరంగా పేటెంట్ హక్కుల కోసం ధరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే రహస్యంగా బజాజ్ డిజైన్ బృందం దీనిని అభివృద్ది చేస్తోందనే సమచారం కూడా ఉంది.

బజాజ్ చేతక్

మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్. మీ నగరంలో కార్ల ధరల కోసం మరియు విభిన్న కార్లు మరియు బైకుల ఫోటో గ్యాలరీ కోసం....

 
Read more on: #బజాజ్ #bajaj
English summary
Bajaj Relaunch New Chetak Scooter 2017
Story first published: Wednesday, January 25, 2017, 18:37 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark