రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీగా కొత్త బైకులను అభివృద్ది చేస్తున్న బజాజ్-ట్రయంప్ భాగస్వామ్యం

Written By:

బజాజ్ ఆటో మరియు ట్రయంప్ మోటార్‌సైకిల్స్ గత వారంలో అంతర్జాతీయ భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా నూతన శ్రేణి మిడిల్ వెయిట్ బైకులను ఉత్పత్తి చేస్తున్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బజాజ్-ట్రయంప్ భాగస్వామ్యం

ట్రయంప్ మోటార్ సైకిల్స్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నిక్ బ్లూర్ బిజినెస్ స్టాండర్డ్ పత్రికతో మాట్లాడుతూ, మిడిల్ వెయిట్ కెపాసిటితో ఉన్న బైకులను ఇరు సంస్థలు సంయుక్తంగా కలిసి అభివృద్ది చేయనున్నట్లు ప్రకటించాడు.

Recommended Video - Watch Now!
2017 Triumph Tiger Explorer XCx Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బజాజ్-ట్రయంప్ భాగస్వామ్యం

బజాజ్ మరియు ట్రయంప్ మోటార్‌సైకిల్ సంస్థలు భాగస్వామ్యంతో నూతన శ్రేణిలో కొత్త ఉత్పత్తుల అభివృద్ది మీద దృష్టిసారించాయి. భవిష్యత్తులో దీనికి సంభందించిన సమాచారాన్ని వెల్లడిస్తామని నిక్ బ్లూర్ చెప్పుకొచ్చాడు.

బజాజ్-ట్రయంప్ భాగస్వామ్యం

ట్రయంప్ మరియు బజాజ్ ఆటో రూపొందించే కొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయంగా బజాజ్ మరియు ట్రయంప్ విస్తరించిన మార్కెట్లకు ఎగుమతి చేయనున్నారు.

బజాజ్-ట్రయంప్ భాగస్వామ్యం

రానున్న మూడు నాలుగేళ్లలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ సెగ్మెంట్ మొత్తానికి పోటీగా 400 నుండి 800సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న మిడిల్ వెయిట్ మోటార్స్ సైకిళ్లను అభివృద్ది చేసి, విక్రయించే ఆలోచనలో బజాజ్ ఆటో ఉంది.

బజాజ్-ట్రయంప్ భాగస్వామ్యం

మానేసర్‌లో ఉన్న అసెంబుల్ యూనిట్‌లో ట్రయంప్ తమ కంప్లీట్లి నేక్డ్ డౌన్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. హర్యాణాలో ఉన్న ఇదే ప్లాంటులో ప్రొడక్షన్‌ను యధావిథిగా కొనసాగించనుంది. మరియు బజాజ్ ఇప్పటికే కెటిఎమ్ మరియు హస్కవర్నాలతో భాగస్వామిగా ఉంది, కాబట్టి దేశీయ మరియు అంతర్జాతీయంగా ప్రొడక్షన్ విషయంలో బజాజ్ మీద ఆధారపడే అవకాశం లేదని నిక్ బ్లూర్ స్పష్టం చేశాడు.

బజాజ్-ట్రయంప్ భాగస్వామ్యం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ప్రీమియమ్ మోటార్ సైకిళ్ల(ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న ఖరీదైన బైకుల) సెగ్మెంట్‌లో మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మార్కెట్ విసృతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దిగ్గజ ఖరీదైన బైకుల సంస్థలు ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించాయి. ఈ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి బజాజ్-ట్రయంప్ మోటార్‌సైకిల్స్ ఒప్పందం ఇరు సంస్థలు మంచి లాభాలను తెచ్చిపెట్టనుంది.

English summary
Read In Telugu; Bajaj-Triumph Begins Developing New Middleweight Motorcycle
Story first published: Saturday, August 19, 2017, 17:36 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark