డుకాటి కోసం ప్లాన్ చేసి, ట్రయంప్‌తో చేతులు కలిపిన బజాజ్ ఆటో

Written By:

ఇటాలియన్ ఖరీదైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ డుకాటిని బజాజ్ ఆటో కొనుగోలు చేస్తుందనే ఆలోచనలో యావత్ భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ ఎదురు చూసింది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా బజాజ్ ఆటో ట్రయంప్‌తో అంతర్జాతీయ భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.

ట్రయంప్ మరియు బజాజ్ ఆటో ఉమ్మడి భాగస్వామ్యం

ప్రపంచ వ్యాప్తంగా విసృత శ్రేణి కస్టమర్లను, విభిన్న ఉత్పత్తుల ద్వారా చేరేందుకు ఈ ఒప్పందం ఇటు బజాజ్ ఆటో మరియు ట్రయంప్ ఇంటర్నేషనల్‌కు బాగా కలిసి రానుంది. నూతన బాగస్వామ్యంతో ట్రయంప్ కొత్త మార్కెట్లో తన ఉనికిని చాటుకోనుంది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ట్రయంప్ మరియు బజాజ్ ఆటో ఉమ్మడి భాగస్వామ్యం

బజాజ్ ట్రయంప్ భాగస్వామ్యంతో నూతన ఉత్పత్తుల అభివృద్ది మరియు తయారీ మీద దృష్టిసారించనుంది. దీంతో బజాజ్ కూడా విసృతమైన ఉత్పత్తులతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త మార్కెట్లకు తమ కార్యకలాపాలును విస్తరించనుంది.

ట్రయంప్ మరియు బజాజ్ ఆటో ఉమ్మడి భాగస్వామ్యం

ఇరు సంస్థల మధ్య జరిగిన ఒప్పందం అంతర్జాతీయ భాగస్వామ్యపు ఒప్పందం కాబట్టి, కొన్ని మార్కెట్లకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని మార్కెట్లలో తమ భాగస్వామ్యాన్ని వినియోగించుకోనున్నాయి.

ట్రయంప్ మరియు బజాజ్ ఆటో ఉమ్మడి భాగస్వామ్యం

ట్రయంప్ తమ ఉత్పత్తులను దేశీయంగా బజాజ్ సహకారంతో ఉత్పత్తి చేయనుంది. ఇదే కనుక జరిగితే ట్రయంప్ ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గనున్నాయి.

ట్రయంప్ మరియు బజాజ్ ఆటో ఉమ్మడి భాగస్వామ్యం

ప్రస్తుతం ఇండియన్ టూ వీలర్ల విపణిలో ఖరీదైన బైకుల మధ్య పోటీ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ట్రయంప్ బజాజ్ ఆటో ఒప్పందం దేశీయంగా ఉన్న దిగ్గజ టూ వీలర్ల సంస్థకు విపరీతమైన పోటీని సృష్టించనుంది.

ట్రయంప్ మరియు బజాజ్ ఆటో ఉమ్మడి భాగస్వామ్యం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బజాజ్ ఆటో డుకాటి సంస్థను కొనుగోలు చేయడానికి ఆసక్తిని కనబరిచింది. అయితే డుకాటి అంతర్జాతీయ ఒప్పందంతో తెరపైకి వచ్చింది. మొత్తానికి దేశీయంగా అత్యుత్తమ ప్రొడక్షన్ సామర్థ్యం బజాజ్ టెక్నాలజీ పరంగా డుకాటి మరియు కెటిఎమ్ సంస్థ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ భాగస్వామ్యం గురించిన మరిన్ని కథనాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి...

English summary
Read In Telugu: Triumph Motorcycles And Bajaj Auto Announce Partnership
Story first published: Tuesday, August 8, 2017, 19:04 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark