విపణిలోకి బెనెల్లీ లియోన్సినో బైక్: ఇంజన్, స్పెసిఫికేషన్లు మరియు ఫోటోలు

Written By:

ఇటాలియన్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బెనెల్లీ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త లియోన్సినో స్క్రాంబ్లర్(Leoncino scrambler) బైకును లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

బెనెల్లీ లియోన్సినో

తాజాగా అందిన సమాచారం మేరకు, రెట్రో స్టైల్ నేక్డ్ వెర్షన్ మోటార్ సైకిల్ 2018 ప్రారంభంలో విపణిలోకి విడుదల కానున్నట్లు తెలిసింది. బెనెల్లీ లియోన్సినో స్క్రాంబ్లర్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

Recommended Video - Watch Now!
[Telugu] 2017 Triumph Tiger Explorer XCx Launched In India - DriveSpark
బెనెల్లీ లియోన్సినో

నిజానికి బెనెల్లీ లియాన్సినో స్క్రాంబ్లర్ బైకు 2017 లోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, ఆటోమొబైల్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ARAI)అనుమతులు పొందాల్సి ఉండటంతో దీని విడుదల 2018 ఫిబ్రవరికి వాయిదాపడింది.

బెనెల్లీ లియోన్సినో

బెనెల్లీ ఇది వరకే లియాన్సినో బైకును రహస్యంగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షించింది. విడుదలప్పుడు దిగుమతి చేసుకుని విక్రయించనంది. అయితే, తక్కువ ధరలో విక్రయించేందుకు కొన్నాళ్ల తరువాత ఇండియాలో అసెంబుల్ చేయనుంది.

బెనెల్లీ లియోన్సినో

డిఎస్‌కె బెనెల్లీ కథనం మేరకు, లియాన్సినో స్క్రాంబ్లర్ ఆఫ్ రోడ్ వేరియంట్ దేశీయంగా లభించదు. అయితే, డిమాండ్ ఆధారంగా పరిచయం చేసే అవకాశం ఉంది. లియాన్సినో స్క్రాంబ్లర్ విపణిలో రూ. 5.14 లక్షల ధరతో లభించే హ్యార్లీ డేవిడ్సన్ 750కు గట్టి పోనిస్తుంది.

బెనెల్లీ లియోన్సినో

సాంకేతికంగా బెనెల్లీ లియోన్సినో స్క్రాంబ్లర్ బైకులో 499.6సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ప్యార్లల్ ట్విన్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ 47బిహెచ్‌పి పవర్ మరియు 45ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బెనెల్లీ లియోన్సినో

బెనెల్లీ లియోన్సినో నియో రెట్రో నేక్డ మోటార్ సైకిల్ అత్యాధునిక ప్రీమియమ్ విడిపరికరాలను కలిగి ఉంది. ఇంజన్‌ ట్యూబులర్ స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ మీద కూర్చోబెట్టారు. ఫ్రంట్ డిజైన్‌లో క్లాసిక్ రౌండ్ హెడ్ ల్యాంప్ మరియు స్క్రాంబ్లర్ స్టైల్ షార్ట్ సీటు ఉంది.

బెనెల్లీ లియోన్సినో

బెనెల్లీ లియోన్సినో బైకులో ముందు వైపున 50ఎమ్ఎమ్ ట్రావెల్ గల అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 120ఎమ్ఎమ్ ట్రావెల్ గల మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు.

బెనెల్లీ లియోన్సినో

బెనెల్లీ లియోన్సినో బైకులో ముందు వైపున 50ఎమ్ఎమ్ ట్రావెల్ గల అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 120ఎమ్ఎమ్ ట్రావెల్ గల మోనో షాక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు.

బెనెల్లీ లియోన్సినో

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బెనెల్లీ ఇండియన్ మార్కెట్లోకి ఎన్నో కొత్త మోడళ్లను ఆవిష్కరిచింది. వాటిని ఒక్కొక్కటిగా లాంచ్ చేయనుంది. అందులో ఒకటి లియాన్సినో స్క్రాంబ్లర్. డుకాటి స్క్రాంబ్లర్‌తో పోల్చుకుంటే సరసమైన ధరతో వస్తున్న బెస్ట్ ప్యాకేజీ గల మోటార్ సైకిల్ లియోన్సినో స్క్రాంబ్లర్. దీన ధర సుమారుగా రూ. 4.5 లక్షలు ఎక్స్-షోరూమ్‌(ఢిల్లీ)గా ఉండే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: Benelli Leoncino India Launch Details Revealed
Story first published: Sunday, November 19, 2017, 9:00 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark