మార్కెట్లో అత్యుత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన బైకులు

ఇండియన్ మార్కెట్లో మంచి రీసేల్ వ్యాల్యూ కలిగిన బైకులు గురించి పూర్తి వివరాలు....

By Anil

కొత్త బైకు కొనేముందు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటాం. అలాగే దాని రీసేల్ వ్యాల్యూని కూడా పరిగణలోకి తీసుకొని కొత్త బైకును సెలక్ట్ చేసుకోవాలి. ప్రతి ఇంజన్ రేంజ్‌లో కుప్పలు తెప్పలుగా బైకులు అందుబాటులో ఉన్నాయి. మరి వీటిలో మంచి రీసేల్ వ్యాల్యూ ఉన్న బైకులు ఏవి, ఏ బైకులను త్వరంగా మంచి ధరకే అమ్మేసుకోవచ్చు అనే విషయాన్ని అంచనా వేయడంలో చాలా మంది విఫలమవుతుంటారు.

అయితే, డ్రైవ్‌స్పార్క్ తెలుగు నేడు పాఠకుల కోసం మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు గురించిన వివరాలను ప్రత్యేక కథనంగా అందిస్తోంది....

మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

08. బజాజ్ సిటి100

బజాజ్ సిటి100 ఈ జాబితాలో ఎలా ఉందని ఆశ్చర్యపోకండి. నిజానికి అత్యుత్తమ రీసేల్ వ్యాల్యూ కలిగిన బైకుల్లో సిటి100 కూడా ఒకటి. మైలేజ్ ఛాంపియన్‌గా పిలువడే ఈ బైకులకు గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ బైక్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

Recommended Video

Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

సాంకేతికంగా ఇందులోని ఉన్న 99.27సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 8.1బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. లీటర్‌కు 82కిమీల మైలేజ్ ఇవ్వగల దీని గరిష్ట వేగం గంటకు 90కిలోమీటర్లుగా ఉంది.

  • బజాజ్ సిటి100 ఎక్స్-షోరూమ్ ధర రూ. 32,734 లు
  • మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

    07. హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్

    ఇండియన్ కమ్యూటర్ టూ వీలర్ మార్కెట్లో ఎంట్రీ లెవల్ బైకులను విక్రయిస్తున్న దేశీయ దిగ్గజం హీరో మోటోకార్ప్. హీరో మోటోకార్ప్ స్ల్పెండర్ తర్వాత అత్యధికంగా విక్రయిస్తున్న మోడల్ ప్యాసన్. ప్యాసన్ బైకులకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సెకండ్ హ్యాండ్ బైకుగా మంచి గిరాకీ ఉంది. హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ లో ఇంజన్ స్టార్ట్, స్టాప్ సిస్టమ్ ద్వారా ఇది మంచి మైలేజ్‌నిస్తుంది. మైలేజ్ ఉన్న బైకులను ఎప్పుడైనా నిశ్చింతగా అమ్ముకోవచ్చని గుర్తుంచుకోండి.

    మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

    హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ బైకులో 97సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8.2బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల దీని మైలేజ్ 84కిమీ/లీగా ఉంది.

    • హీరో ప్యాసన్ ప్రొ ఐ3ఎస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 52,147 లు.
    • మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

      06. హోండా సిబి యూనికార్న్ 150

      హోండా యూనికార్న్ మోనో షాక్ అబ్జార్వర్‌ గల తొలి బైకుగా హోండా టూ వీలర్స్‌కు మంచి సక్సెస్ అందించి. గ్రామీణ మరియు చిన్న స్థాయి పట్టణాల్లో యూనికార్న్‌కు ఒకింత గౌరవం, అంతే క్రేజ్ ఉంది. మీరు సెకండ్ హ్యాండ్ బైకుగా విక్రయించేటపుడు యూనికార్న్ మంచి సొమ్మును అందిస్తుంది.

      మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

      హోండా సిబి యూనికార్న్ 150 బైకులో 149సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 13బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. హోండా కథనం ప్రకారం దీని మైలేజ్ లీటర్‌కు 60కిలోమీటర్లుగా ఉంది.

      • హోండా సిబి యూనికార్న్ 150 ఎక్స్-షోరూమ్ ధర రూ. 71,623 లు.
      • మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

        05. టీవీఎస్ స్టార్ సిటి ప్లస్

        టీవీఎస్ మోటార్స్ ఇప్పుడు అప్‌డేటెడ్ స్టార్ సిటి ప్లస్ మోటార్ సైకిల్‌ను విక్రయిస్తోంది. మైలేజ్ కింగ్‌గా పేరుగాంచిన స్టార్ సిటి ప్లస్ బైకుకు గ్రామీణ ప్రాంత వినియోగదారులు పట్టం కట్టారని చెప్పవచ్చు. గ్రామీణంగా వీటి సేల్స్ మరియు రీసేల్ రెండు బాగున్నాయి. అనేక ఎక్ట్సీరియర్ అప్‌డేట్స్‌తో వచ్చిన ఇది ఇతర టూ వీలర్లకు ధీటైన సమాధానమిస్తోంది.

        మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

        సాంకేతికంగా టీవీఎస్ స్టార్ సిటి ప్లస్ మోటార్ సైకిల్‌లో 109సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8.3బిహెచ్‌పి పవర్ మరియు 8.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్టార్ సిటి ప్లస్ మైలేజ్ లీటర్‌కు 86కిలోమీటర్లుగా ఉంది.

        • టీవీఎస్ స్టార్ సిటి ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 49,841 లు
        • మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

          04. హీరో స్ల్పెండర్ ప్లస్

          అత్యుత్తమ డిజైన్‌లో అన్ని రకాల వయస్సున్న వారికి హీరో స్ల్పెండర్ ప్లస్ డీసెంట్ బైక్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం హీరో మోటోకార్ప్ కమ్యూటర్ సెగ్మెంట్లో అత్యధికంగా విక్రయిస్తున్న బైకుల్లో స్ల్పెండర్ ప్లస్ ఒకటి. ఎంతో మంది భారతీయులు ఎంచుకోవడంతో ఇదొక గొప్ప కమ్యూటర్ బైకుగా నిరూపించుకుంది.

          మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

          సాంకేతికంగా హీరో స్ల్పెండర్ ప్లస్ మోటార్ సైకిల్‌లో 97సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 8.2బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. హీరో స్ల్పెండర్ ప్లస్ మైలేజ్ లీటర్‌కు 81 కిలోమీటర్లుగా ఉంది.

          • హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 47,965 లు
          • మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

            03. బజాజ్ పల్సర్ 150

            చిన్న చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో బజాజ్ పల్సర్‌ను ఒక శక్తివంతమైన మోటార్ సైకిల్‌గా కొలుస్తారు. బజాజ్ శ్రేణిలో అత్యుత్తమ విక్రయాలు సాధిస్తున్న మోడాల్ కూడా ఇదే. దీనికి దేశవ్యాప్తంగా అత్యుత్తమ రీసేల్ వ్యాల్యూ ఉంది. సెకండ్ హ్యాండ్ బైకుగా ఎంచుకున్నప్పటికీ మీరు ఆశించిన పనితీరు కనబరచడంలో ఇది అస్సలు నిరాశపరచదు.

            మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

            సాంకేతికంగా బజాజ్ పల్సర్ 150లో 149సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది 15బిహెచ్‌పి పవర్ మరియు 12ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పల్సర్ 150 బైక్ మైలేజ్ లీటర్‌కు 65కిలోమీటర్లుగా ఉంది.

            • బజాజ్ పల్సర్ 150 ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,077 లు
            • మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

              02. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500

              రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లలో క్లాసిక్ శ్రేణి బైకులకు మంచి డిమాండ్ ఉంది. కొత్త బైకులను ఏవిధంగా ఎంచుకుంటున్నారో... అదే రీతిలోనే సెకండ్ హ్యాండ్ బైకులుగా ఎంచుకుంటున్నారు.

              మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

              రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 మోటార్ సైకిళ్లను సెకండ్ హ్యాండ్ బైకులుగా బాగానే ఎంచుకుంటున్నారు. తక్కువ ధరకే మంచి మోడల్ బైకులు లభిస్తున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 బైకులో 499సీసీ కెపాసిటి గల ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉన్న ఇది 27బిహెచ్‌పి పవర్ మరియు 41ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

              • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,76,132 లు
              • మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

                01. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350

                రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో అత్యుత్తమ సేల్స్ సాధిస్తున్న మోడల్ క్లాసిక్ 350. వీటికి కొత్త బైకులుగానే కాదు సెకండ్ హ్యాండ్ బైకులుగా కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక రీసేల్ వ్యాల్యూ అంటారు. ఏ రోజు అమ్మినా కూడా బంగారాన్ని విక్రయించినట్లే ఉంటుంది. యువత ఎక్కువగా ఎంచుకుంటుండటంతో ధర విషయంలో రాజీపడకుండా కొనేస్తున్నారు.

                మంచి రీసేల్ వ్యాల్యూ గల బైకులు

                సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైకులో 346సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల ఇది లీటర్‌కు 37కిలోమీటర్ల మైలేజ్‌నిస్తోంది.

                • రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,35,813 లు
                • గమనిక: ఈ జాబితాలో ఇచ్చిన బైకులను మార్కెట్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ బైకుల విక్రయాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ హైదరాబాద్‌గా ఇవ్వబడ్డాయి మరియు తయారీ సంస్థల సమాచారం మేరకు ఆయా బైకుల మైలేజ్ వివరాలు అందివ్వడం జరిగింది.

Most Read Articles

English summary
Read In Telugu: bikes with good resale value in india
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X