ఇండియాలో జి310 జిఎస్ పేటెంట్ హక్కులు సొంతం చేసుకున్న బిఎమ్‍‌డబ్ల్యూ

Written By:

బిఎమ్‌డబ్ల్యూ ద్విచక్ర వాహన విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటార్రాడ్ ఈ మధ్యనే ఇండియన్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభించింది. అయితే ఎంట్రీ లెవల్ మోటార్ సైకిల్ అయిన డి310 ఆర్ విడుదల విషయంలో మాత్రం ఆలస్యం చేస్తూ వస్తోంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బిఎమ్‍‌డబ్ల్యూ జి310 జిఎస్ విడుదల

జి310 ఆర్ నేక్డ్ మోటార్ సైకిల్ ఆధారంగా రూపొందించిన జి310 జిఎస్ మోటార్ సైకిల్‌ను 2016 ఐక్మా మోటార్ షో వేదిక మీద ప్రదర్శించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు, బిఎమ్‌డబ్ల్యూ ఇండియాలో తమ జి310 జిఎస్ పై పేటెంట్ హక్కులు పొందినట్లు తెలిసింది.

బిఎమ్‍‌డబ్ల్యూ జి310 జిఎస్ విడుదల

పేటెంట్ హక్కులు సొంతం చేసుకుందంటే దాదాపుగా విడుదలకు సిద్దం అయినట్లే, బిఎమ్‌డబ్ల్యూ వద్ద ఉన్న జిఎస్ సిరీస్ లోని పెద్ద మోటార్ సైకిళ్లకు స్మాల్ వెర్షన్‌గా రానున్న జి310 జిఎస్ మోటార్ సైకిల్ 2018 మధ్య భాగానికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది.

బిఎమ్‍‌డబ్ల్యూ జి310 జిఎస్ విడుదల

బిఎమ్‌డబ్ల్యూ మోటార్రాడ్ దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్‌తో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మోటార్ సైకిళ్లను టీవీఎస్ హోసూర్ ప్లాంటులో ఉత్పత్తి చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. జి310 జిఎస్ బైకును కూడా ఇక్కడే ఉత్పత్తి చేయనుంది.

బిఎమ్‍‌డబ్ల్యూ జి310 జిఎస్ విడుదల

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ మోటార్ సైకిల్‌లో 313సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. నేక్ట్ వెర్షన్ బైకుతో పోల్చుకుంటే అడ్వెంచర్ టూరర్ బైకు మరింత పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేయగలదు.

బిఎమ్‍‌డబ్ల్యూ జి310 జిఎస్ విడుదల

జి310 జిఎస్ ను డిజైన్ అంశం పరంగా గమనిస్తే, స్పోర్టివ్ మరియు అగ్రెసివ్ డిజైన్ లక్షణాలను కలిగి ఉంటుంది. ట్యూబులర్ సూపర్ ఫ్రేమ్ ఛాసిస్ ఆధారంతో నిర్మించబడిన ఇందులో పదునైన డిజైన్ ఆకృతిలో ఉన్న హెడ్ ల్యాంప్, కండలు తిరిగిన ఆకారాన్ని పోలిన ఫ్యూయల్ ట్యాంక్, వెడల్పాటి హ్యాండిల్ బార్, పొడావాటి విండ్ స్క్రీన్ మరియు డ్యూయల్ స్పోర్ట్ టైర్లు ఉన్నాయి.

బిఎమ్‍‌డబ్ల్యూ జి310 జిఎస్ విడుదల

జి310 జిఎస్ బైకులో ముందువైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు. టూరింగ్ పర్పస్ కోసం టెయిల్ సెక్షన్‌లో లగేజ్ ర్యాక్ అందివ్వడం జరిగింది. అడ్వెంచర్ టూరర్ సెగ్మెంట్లో వస్తుండటంతో లాంగ్ సస్పెన్ ట్రావెల్ మరియు హై రైడింగ్ చాసిస్ ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి.

బిఎమ్‍‌డబ్ల్యూ జి310 జిఎస్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మోటార్ సైకిల్ మార్కెట్ శరవేగంగా వృద్ది చెందుతోంది. అదే విధంగా బైకుల మీద లాంగ్ రైడ్ ప్రస్తుతం పాపులర్ అయిపోయింది. దీంతో సరసమైన అడ్వెంచర్ టూరర్ బైకులకు డిమాండ్ అధికమవుతోంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్ విపణిలోకి విడుదలైతే, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, మహీంద్రా మోజో లతో పాటు అప్ కమింగ్ కవాసకి వెర్సేస్ ఎక్స్-300 మరియు కెటిఎమ్ డ్యూక్ 390 అడ్వెంచర్ బైకులకు గట్టి పోటీనివ్వనుంది. బిఎమ్‌‌డబ్ల్యూ బ్రాండ్ పేరుతో ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి విడుదల కానుండటంతో మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: BMW G 310 GS Patented In India
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark