బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ ఇండియా విడుదల మరోసారి వాయిదా

Written By:

బిఎమ్‌డబ్ల్యూ అభివృద్ది చేసిన అత్యంత సరసమైన మరియు ఎంట్రీ లెవల్ స్ట్రీట్ ఫైటర్ బైకు జి310 ఆర్ విడుదల ఈ ఏడాదిలో లేనట్లే అని తెలిసింది. దీని కోసం వేచి చూస్తున్న వారికి ఈ ఏడాది కూడా నిరాశను మిగిల్చింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

మిడ్ లెవల్ స్పోర్ట్స్ బైకును కోరుకునే వారికి ఉత్తమ ఎంపికగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకును టీవీఎస్ ప్లాంటులో తయారు చేసి, విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ టూవీలర్ విభాగం మోటోర్రాడ్ మరియు టీవీఎస్ టూ వీలర్స్ సంయుక్తంగా దీనిని అభివృద్ది చేశాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

ఈ ఏడాది ప్రారంభంలో బిఎమ్‌డబ్ల్యూ ఇండియా విభాగాధిపతి మాట్లాడుతూ, జి310ఆర్ విడుదల 2017 చివర్లో ఉండనుందని తెలిపాడు. అయితే దీని విడుదల మళ్లీ వాయిదా పడిందని తాజాగా ఓ ప్రకటన చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియన్ మార్కెట్లో అధికారిక కార్యకలాపాలు ప్రారంభించినపుడు తమ ప్రొడక్ట్ జాబితాలో ఈ 313సీసీ సామర్థ్యం ఉన్న నేక్డ్ వెర్షన్ జి310ఆర్ ను పొందుపరచలేదు. సుమారుగా 26 లక్షల విలువైన బైకులను కూడా ప్రవేశపెట్టింది. కానీ జి310ఆర్ విడుదల విషయంలో అలసత్వం చూపుతోంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ వద్ద అడ్వెంచర్ బైకులయిన ఆర్1200 శ్రేణి, ఆరు సిలిండర్ల కె1600 శ్రేణి, నియో రెట్రో ఆర్ నైన్ టి శ్రేణి, 2017 ఎస్1000 శ్రేణి, ఎస్1000 ఆర్ఆర్ సూపర్ బైకు, టూరింగ్ వెర్షన్ ఎస్1000 ఎక్స్ఐఆర్ మరియు ఎస్1000ఆర్ స్పోర్ట్స్ నేక్డ్ బైకులు అందుబాటులో ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్‌కు కేవలం నాలుగు విక్రయ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి, అయితే మరిన్ని నగరాల్లో విక్రయ కేంద్రాల ఏర్పాటులో బిఎమ‌డబ్ల్యూ బృందం బిజీగా ఉంది. ఎక్కువ నగరాల్లో షోరూమ్‌లు తెరిచిన తరువాత జి310ఆర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ ఇండియా హెడ్ విక్రమ్ పావా ఓ ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ, "జి310ఆర్ విడుదల కంటే ముందే విక్రయ కేంద్రాలను పెంచుకునే ఆలోచనలో ఉన్నాము. విస్తారమైన సేల్స్ నెట్‌వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. అందుకే జి310ఆర్ విడుదల ఆలస్యం అవుతోందని" పేర్కొన్నాడు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ ఈ జి310ఆర్ లో అందించిన శక్తివంతమైన 313సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 33బిహెచ్‌పి పవర్ మరియు 28.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

బిఎమ్‌డబ్ల్యూ టీవీఎస్ హోసూర్ ప్లాంటులో జి310ఆర్ ను ఉత్పత్తి చేసి యూరోపియన్ మరియు అమెరికా మార్కెట్లకు ఎగుమతి చేస్తోంది. అయితే దీనికి పోటీగా టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310ఎస్ మోటార్ సైకిల్‌ను రూపొందించి, పరీక్షిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్

జి310ఆర్ విడుదలకు ముందే టీవీఎస్ ఆర్ఆర్ 310ఎస్ ను విపణిలోకి తెచ్చే ప్రణాళికల్లో ఉంది. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ 2.50 లక్షలు(ఎక్స్-షోరూమ్) అంచనా ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

నిజానికి బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ తమ జి310ఆర్ ను విడుదల చేయడానికి అమితాసక్తితో ఉంది. ఇప్పటికే 300సీసీ - 400సీసీ శ్రేణిలో రాణిస్తున్న మోటార్ సైకిళ్లకు ఈ బిఎమ్‌డబ్ల్యూ గట్టి పోటీనిస్తోంది. జి310ఆర్ రాకతో ఈ సెగ్మెంట్లో ఉన్న డామినర్ 400 మరియు కెటిఎమ్ డ్యూక్ 390 బైకుల కథ కంచికే అన్నమాట.

English summary
Read In Telugu MW G 310 R India Launch Further Delayed
Story first published: Tuesday, June 20, 2017, 12:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark