తుది పరీక్షలు పూర్తి చేసుకున్న బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

Written By:

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ మరియు టీవీఎస్ సంయుక్తంగా అభివృద్ది చేసిన జి310 ఆర్ మోటార్ సైకిల్‌ను అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానుంది. అయితే విడుదల కంటే ముందుగా నేక్డ్ వర్షన్ జి310 ఆర్ ను మళ్లీ రహదారి పరీక్షలకు గురిచేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

బిఎమ్‌డబ్ల్యూ తమ జి310 ఆర్ బైకు ను రహస్యంగా కాకుండా పబ్లిక్‌గా పరీక్షించింది. ప్రస్తుతం ఇది దాదాపు ప్రొడక్షన్ రెడీ మోడల్‌ను తలపిస్తోంది. బెంగళూరు-క్రిష్ణగిరి జాతీయ రహదారి మీద దీనిని పరీక్షిస్తున్నపుడు మోటోరాయిడ్స్ ఫోటోలు తీసింది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ తమ జి310 ఆర్ మోటార్ సైకిల్‌ను మార్చి-జూన్ 2017 మధ్యలో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. దీనికి సంభందించి సామాజిక మాధ్యమాలలో వదంతులు వినిపిస్తున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

సాంకేతికంగా అన్ని అంశాల పరంగా సిద్దమైన బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ మోటార్ సైకిల్ ఇప్పుడు తుది దశ నిర్మాణ పనులకు చేరుకుంది, స్ట్రీట్ ఫైటర్ బాడీ డీకాల్స్ తరహాలో దీని ఎక్ట్సీరియర్ బాడీ డిజైన్‌లో భాగం కానున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ ఇందులో 313సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 33.5బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇంది గంటకు గరిష్టంగా 170 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. మరియు ఇది లీటర్‌కు 25 నుండి 28 కిమీల మధ్య మైలేజ్ ఇవ్వగలదు.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

ఇందులో ముందు వైపున స్పోర్ట్స్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు మల్టీ ఫంక్షన్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి అతి ముఖ్యమైన ఫీచర్లు రానున్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ మరియు టీవీఎస్ మోటార్ కంపెనీ సంయుక్తంగా అభివృద్ది చేసిన దీనిని హోసూర్ లోని టీవీఎస్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

కెటిఎమ్ డ్యూక్ 390 కన్నా తక్కువ ధరను దీనికి నిర్ణయించనుంది బిఎమ్‌డబ్ల్యూ. జి310ఆర్ రూ. 1.8 నుండి 2 లక్షల మధ్య ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

రూ. 3.5 లక్షల ప్రారంభ ధరతో హ్యుందాయ్ శాంట్రో

హ్యుందాయ్ మోటార్స్ తమ నెక్ట్స్ జనరేషన్ శాంట్రో కారును 2018 నాటికి రూ. 3.5 లక్షల ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం.

 

English summary
BMW G 310 R Spied Testing In India Ahead Of Launch
Story first published: Wednesday, January 18, 2017, 11:14 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark