నవంబర్ 24 విపణిలోకి బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్ బైకులు

జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మోటార్ సైకిళ్ల విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ గోవాలో జరుగుతున్న 2017 ఇండియా బైక్ వీక్ కార్యక్రమంలో అత్యంత ఖరీదైన రెండు బైకులను విడుదల చేయడానికి

By Anil

జర్మనీకి చెందిన ఖరీదైన కార్ల తయారీ సంస్థ బిఎమ్‌డబ్ల్యూ మోటార్ సైకిళ్ల విభాగం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ గోవాలో జరుగుతున్న 2017 ఇండియా బైక్ వీక్ కార్యక్రమంలో అత్యంత ఖరీదైన రెండు బైకులను విడుదల చేయడానికి సిద్దమైంది.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

ఇప్పటికే అందుబాటులో ఉన్న కె 1600 జిటిఎల్ మరియు ఆర్ నైన్‌టి మోడళ్లకు కొనసాగింపుగా వీటిని మళ్లీ లాంచ్ చేయనుంది. నవంబర్ 24, 2017 న ఈ రెండు బైకులను ఆవిష్కరించనుంది.

Recommended Video

[Telugu] Honda Cliq Review - DriveSpark
బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ కె 1600 బి మోటార్ సైకిల్‌ను తొలిసారిగా అక్టోబర్ 2016లో ఆవిష్కరించింది. బాడీ డీకాల్స్ ఫ్రంట్ మరియు రియర్ డిజైన్‌లో ఎన్నో మార్పులు చోటు జరిగాయి. స్లిమ్ముగా ఉన్న ఎల్ఇడి లైట్లు ఇంటిగ్రేటెడ్ స్టాప్ అండ్ టర్న్ సిగ్నల్స్ ఇందులో ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

సాంకేతికంగా బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ కె 1600 బి బైకులో 1,649సీసీ కెపాసిటి గల ఆరు సిలిండర్ల ఇన్ లైన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. 7,750ఆర్‌పి వద్ద ఉత్పత్తయ్యే 160బిహెచ్‌పి పవర్ మరియు 5,250ఆర్‌పిఎమ్ వద్ద ప్రొడ్యూస్ అయ్యే 175ఎన్ఎమ్ టార్క్ 6-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా వెనుక చక్రాలకు అందుతుంది.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

ఆరు సిలిండర్ల ఇంజన్ అంటే ఆశ్చర్యపోయారా...? నిజమే, ఇందులో మోస్ట్ పవర్ ఫుల్ సిక్స్ సిలిండర్ ఇంజన్ కలదు. బైకు బరువును మోయడంతో పాటు అత్యుత్తమ రైడింగ్ కల్పించడం కోసం ముందు వైపున సెంట్రల్ స్ప్రింగ్ స్ట్రట్ గల డౌలర్ సెటప్ మరియు వెనుక వైపున ఆటోమేటిక్ డ్యాంపిగ్ అడాప్షన్ గల ఎలక్ట్రానిక్ మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ కె 1600బి బైకులో మూడు విభిన్న రకాల రైడింగ్ మోడ్స్ మరియు బిఎమ్‍డబ్ల్యూ వారి డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కె 1600బి జిటిఎల్ ధర రూ. 26.3 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది మరియు కె1600బి ప్రొ మోడల్ ధర రూ. 29 లక్షలుగా ఉండవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్‌కు అనుగుణంగా రానుంటడంతో రెగ్యులర్ వెర్షన్ కన్నా ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఆర్ నైన్‌టి కఫె రేసర్ మోటార్ సైకిల్. దీని హ్యాండిల్ బార్ మిగతా వాటితో పోల్చితే చాలా క్రిందకు ఉంటుంది. మరియు రేసింగ్ మోటార్ సైకిళ్లతో పోల్చుకుంటే దీని బాడీ డీకాల్స్ సగం మాత్రమే ఉంటాయి. చిన్నగా కురచగా ఉండే ఫుట్ పెడల్స్, సింగల్ సీట్, బైకు ముందు నుండి చివరి వరకు ఒకే ఎత్తులో ఉంటుంది.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఆర్ నైన్‌టి బైకులో మునుపటి 43ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ స్థానంలోకి 46ఎమ్ఎమ్‌లో ఉన్న అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ వచ్చాయి. ఇరువైపులా 17-అంగుళాల పరిమాణం ఉన్న క్యాస్ట్ అల్లాయ్ వీల్స్, ట్విన్ పోడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, అనలాగ్ స్పీడ్ మీటర్ మరియు టాకో మీటర్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఆర్ నైన్‌టి బైకులో సాంకేతికంగా 1,170సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే బాక్సర్ ట్విన్ ఇంజన్ కలదు. 7,750ఆర్‌పిఎమ్ వద్ద 110బిహెచ్‌పి పవర్ మరియు 6,000ఆర్‌పిఎమ్ వద్ద 116ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరిగా వచ్చినప్పటికీ ఆటోమేటిక్ స్టెబిలిటి కంట్రోల్ ఆప్షనల్‌ ఫీచర్‌గా అందిస్తోంది.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఆర్ నైన్‌టి స్టాండర్డ్ మోడల్ ధర రూ. 18.2 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. అయితే, ఇండియా బైక్ వీక్ వేదిక మీద రీలాంచ్ చేస్తున్న ఈ బైకు ధర స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే, బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఆర్ నైన్‌టి బైకు రూ. 16.2 లక్షల ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరతో లభించే ఛాన్స్ ఉంది.

బిఎమ్‌డబ్ల్యూ కె1600బి మరియు ఆర్ నైన్‌టి రేసర్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియా విభాగం గోవాలో జరిగే ఇండియా బైక్ వీక్‌లో మొత్తం 14 మోటార్ సైకిళ్లను ప్రదర్శించనుంది. అందులో, బిఎమ్‌డబ్ల్యూ ఎస్ 1000 ఆర్ఆర్, బిఎమ్‌డబ్ల్యూ ఆర్ 1200 ఆర్, బిఎమ్‌డబ్ల్యూ ఆర్‌ నైన్‌టి స్క్రాంబ్లర్, బిఎమ్‌డబ్ల్యూ కె 1600జిటిఎల్ మరియు సరికొత్త బిఎమ్‌డబ్ల్యూ కె 1000బి మరియు బిఎమ్‌డబ్ల్యూ ఆర్ నైన్‌టి రేసర్ బైకులు ఉన్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: BMW K 1600 B, R nineT Racer to launch on November 24
Story first published: Thursday, November 23, 2017, 20:19 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X