ఇండియాలో అధికారికంగా విక్రయాలు ప్రారంభించిన బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్

Written By:

దేశీయంగా బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ మోటార్ సైకిళ్ల ప్రియులకు ఇదొక శుభవార్త అని చెప్పవచ్చు. బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ తమ మోటార్ సైకిళ్ల ఇండియా విభాగాన్ని అధికారికంగా ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థ అందుబాటులో ఉంచిన బైకులు మరియు వాటి ధరలు....

అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్

గతంలో ముంబాయ్ మరియు న్యూ ఢిల్లీలోని విక్రయదారులు దిగుమతి చేసుకుని కస్టమర్లకు అందించేవి. అయితే ఇప్పుడు ఈ రెండింటితో పాటు అహ్మదాబాద్, ముంబాయ్, పూనే మరియు బెంగళూరు నగరాల్లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు.

అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ ప్రొడక్ట్ లైనప్‌లో ఆర్ 1200 జిఎస్, ఆర్ 1200 జిఎస్ఎ, ఎస్ 1000 ఆర్ఆర్, ఎస్ 1000 ఆర్, ఆర్ 1200 ఆర్, ఆర్ నైన్ టి, ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్, ఆర్ 1200 ఆర్ఎస్, ఎస్ 1000ఎక్స్ఆర్, ఆర్ 1200 ఆర్‌టి మరియు తె 1600 జిటిఎల్ ఉత్పత్తులు ఉన్నాయి.

అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియాలో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి విక్రయ కేంద్రాలను విస్తరించే దిశగా పనిచేస్తోంది. శివపాడ రాయ్ బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఇండియా హెడ్‌గా నియమితులయ్యారు.

అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఆసియా, చైనా, పసిఫిక్ మరియు సౌత్ ఆఫ్రికా రీజియన్‌ల హెడ్ డిమిట్రిస్ రాప్టిస్ మాట్లాడుతూ, ఇండియన్ మార్కెట్లో ఖరీదైన మోటార్ సైకిళ్ల మార్కెట్‌కు మంచి అవకాశాలు ఉన్నాయి మరియు దేశీయంగా బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉన్న తరుణంలో బిఎమ్‌డబ్ల్యూ గ్రూప్ తమ ద్విచక్ర వాహనాల విభాగాన్ని పరిచయం చేసినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపాడు.

అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ టీవీఎస్ మోటార్స్ భాగస్వామ్యంతో అభివృద్ది చేసిన జి310ఆర్ మోటార్ సైకిల్ బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ తమ తొలి ఉత్పత్తిగా విడుదల చేయనుంది. టీవీఎస్ దేశీయంగా ఉత్పత్తి చేసే జి310 ఆర్ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ వద్ద ఉన్న మోటార్ సైకిళ్లు మరియు వాటి ధరలు

ప్రస్తుతం బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ వద్ద ఉన్న మోటార్ సైకిళ్లు మరియు వాటి ధరలు

 • ఆర్ 1200 జిఎస్ స్టాండర్డ్ ధర రూ. 15,90,000 లు
 • ఆర్ 1200 జిఎస్ డైనమిక్ ప్లస్ ధర రూ. 19,00,000 లు
 • ఆర్ 1200 జిఎస్ ప్రొ ధర రూ. 19,50,000 లు
 • ఆర్ 1200 జిఎస్ఎ స్టాండర్డ్ ధర రూ. 17,50,000 లు
 • ఆర్ 1200 జిఎస్ఎ డైనమిక్ ప్లస్ ధర రూ. 20,90,000 లు
అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్
 • ఆర్ 1200 జిఎస్ఎ ప్రొ ధర రూ. 21,40,000 లు
 • ఎస్ 1000 ఆర్ఆర్ స్టాండర్డ్ ధర రూ. 18,90,000 లు
 • ఎస్ 1000 ఆర్ఆర్ ప్రొ ధర రూ. 21,40,000 లు
 • ఎస్ 1000 ఆర్ స్టాండర్డ్ ధర రూ. 16,90,000 లు
 • ఎస్ 1000 ఆర్ స్పోర్ట్ ధర రూ. 17,90,000 లు
అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్
 • ఎస్ 1000 ఆర్ ప్రొ ధర రూ. 18,90,000 లు
 • ఆర్ 1200 ఆర్ స్టాండర్డ్ ధర రూ. 14,90,000 లు
 • ఆర్ 1200 ఆర్ ఎక్స్‌క్లూజివ్ ధర రూ. 15,40,000 లు
 • ఆర్ 1200 ఆర్ స్టైల్ ధర రూ. 15,50,000 లు
 • ఆర్ నైన్ టి స్టాండర్డ్ ధర రూ. 17,90,000 లు
అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్
 • ఆర్ నైన్ టి స్క్రాంబ్లర్ స్టాండర్డ్ ధర రూ. 15,90,000 లు
 • ఆర్ 1200 ఆర్ఎస్ స్టాండర్డ్ ధర రూ. 15,90,000 లు
 • ఆర్ 1200 ఆర్ఎస్ డైనమిక్ ప్లస్ ధర రూ. 16,90,000 లు
 • ఎస్ 1000 ఎక్స్ఆర్ స్టాండర్డ్ ధర రూ. 18,50,00 లు
 • ఎస్ 1000 ఎక్స్ఆర్ ప్రొ ధర రూ. 21,50,000 లు
అధికారిక కార్యకలాపాలు ప్రారంభించిన BMW మోటోర్రాడ్
 • ఆర్ 1200 ఆర్‌టి స్టాండర్డ్ ధర రూ. 18,50,000 లు
 • ఆర్ 1200 ఆర్‌టి ప్రొ ధర రూ. 21,90,000 లు
 • కె 1600 జిటిఎల్ స్టాండర్డ్ ధర రూ. 25,90,000 లు
 • కె 1600 జిటిఎల్ ప్రొ ధర రూ. 28,50,000 లు
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి.
English summary
Read In Telugu to know about BMW Motorrad Officially Begins Operations In India [Prices + Variants]
Story first published: Tuesday, April 11, 2017, 17:08 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark