ఆ ఊర్లో బైకు కొంటే మేక ఉచితం

Written By:

దీపావళి వచ్చిందంటే విక్రయదారులు కస్టమర్లను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రతి ఏడాది, ప్రతి పండుగ సీజన్‌లో ఇలాంటి సర్వసాధారణం. అయితే, ఎలాంటి ఆఫర్లను ఇస్తున్నారనేది మ్యాటర్.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
బైకు కొంటే మేక ఉచితం

విభిన్నంగా కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఓ హీరో మోటార్ సైకిల్స్ డీలర్ విన్నూత్న ఆఫర్ ప్రకటించాడు. ఈ దీపావళి సీజన్‌లో బైకు కొంటే మేక పూర్తిగా ఉచితం. ఆఫర్లు భలే ఉంది కదూ...?ఎక్కడో చూద్దాం రండి..

బైకు కొంటే మేక ఉచితం

వ్యాపారదారులు భారీ విక్రయాలకు చేసే ప్రణాళికల్లో భాగంగా దేశవ్యాప్తంగా దీపావళి ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అయితే, పరిచయం చేసే ఆఫర్ సామాన్యుడికి ఎంత వరకు ఉపయోగం, కస్టమర్లు ఎలాంటి ఆఫర్లను ఇష్టపడతారనేది చాలా ముఖ్యం. అచ్చం ఇదే మార్గంలో ఆలోచించిన టూ వీలర్ షోరూ నిర్వాహకుడు ఈ ఆఫర్ ప్రారంభించాడు.

Recommended Video
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
బైకు కొంటే మేక ఉచితం

వ్యాపారదారులు భారీ విక్రయాలకు చేసే ప్రణాళికల్లో భాగంగా దేశవ్యాప్తంగా దీపావళి ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అయితే, పరిచయం చేసే ఆఫర్ సామాన్యుడికి ఎంత వరకు ఉపయోగం, కస్టమర్లు ఎలాంటి ఆఫర్లను ఇష్టపడతారనేది చాలా ముఖ్యం. అచ్చం ఇదే మార్గంలో ఆలోచించిన టూ వీలర్ షోరూ నిర్వాహకుడు ఈ ఆఫర్ ప్రారంభించాడు.

బైకు కొంటే మేక ఉచితం

హీరోకు పోటీగా ఉన్న ఇతర డీలర్లు ప్రతి బైకు కొనుగోలు మీద ఒక సోఫా సెట్ ఉచితమని ప్రకటించగా, హీరో డీలర్ విన్నూత్న ఆలోచనతో బైకు కొంటే మేక ఫ్రీమ్ అనే స్కీముతో బ్యానర్లు ప్రింట్ చేయించి ఆఫర్‌ను అమల్లోకి తెచ్చాడు.

బైకు కొంటే మేక ఉచితం

ఈ స్కీమ్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉన్నట్లు ప్రకటించారు. అక్టోబరు 11 నుండి 14 వ తేదీ 2017 వరకు మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. అయితే, తొలి రోజు ప్రచారం అనంతరం ఈ ఆఫర్ గురించి భారీ సంఖ్యలో ఎంక్వైరీలు లభించినట్లు నిర్వాహకులు వెల్లడించారు. మరియు ఒక్క రోజులేనే 100 కు పైగా బైకులు బుక్ అయ్యాయని తెలిపారు.

బైకు కొంటే మేక ఉచితం

ఐడియా బాగానే ఉంది. ప్రతి కస్టమర్‌ను ఆకట్టుకుంటోంది. అయితే, ఇప్పుడు ఆ డీలర్‌కు కస్టమర్లు మరియు బుకింగ్స్ తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. బుకింగ్స్‌కు తగ్గ బైకులను మరియు వాటికి మేకలను సమకూర్చుకునే పనిలో డీలర్ నిమగ్నమయ్యాడు. తక్కువ సమయంలో బైకులను మరియు మేకలను సేకరించాల్సి ఉంది.

బైకు కొంటే మేక ఉచితం

డీలర్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం, ఒక్కో బైకు కొనుగోలు మీద ఆఫర్ క్రింద ఇచ్చే మేక విలువ 3,000 రుపాయలుగా ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి ఈ దీపాళికి అనుకున్న దానికంటే ఎక్కువ సేల్స్ సాధ్యమయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది కూడా ఇదే తరహా విన్నూత్న ఆఫర్ పరిచయం చేయనున్నాడు.

English summary
Read In Telugu: Diwali bumper offer – Buy a Hero MotoCorp bike, get a goat free
Story first published: Monday, October 9, 2017, 13:36 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark