కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000 బైకు విడుదల: ధర రూ. 7.35 లక్షలు

Written By:

కార్‌బెర్రీ మోటార్‌సైకిల్స్ ఇండియన్ మార్కెట్లోకి డబుల్ బ్యారెల్ 1000 బైకును విడుదల చేసింది. కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000 బైకు ప్రారంభ ధర రూ. 7.35 లక్షలు ఎక్స్-షోరూమ్‍‌గా ఉంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000

కార్‌బెర్రీ మోటార్‌సైకిల్స్ నుండి వచ్చిన ఈ బైకును కేవలం 29 యూనిట్లుగా పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది. లక్షల రుపాయలతో కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000 బైకును బుక్ చేసుకోవచ్చు. మరియు వెయిటింగ్ పీరియడ్ ఐదు నుండి పది నెలల మధ్య ఉండనుంది.

కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000

గాలితో చల్లబడే 1,000సీసీ ఇంజన్‌ను కార్‌బెర్రీ తమ డబుల్ బ్యారెల్ 1000 బైకులో ఉపయోగించింది. నిజానికి ఈ ఇంజన్‌ను 500సీసీ కెపాసిటి గల రెండు రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్‌లను ఒకటిగా కలిపి వి-ట్విన్ ఆకారంలో కార్‌బెర్రీ నిర్మించింది.

కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000

వి-ట్విన్ 1000సీసీ ఇంజన్ ఉత్పత్తి చేసే 52.19బిహెచ్‌పి పవర్ మరియు 82ఎన్ఎమ్ టార్క్ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 5-స్పీడ్ గేర్‌బాక్స్ గుండా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

Recommended Video
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000

కార్‌బెర్రీ మెటార్‌సైకిల్స్ డబుల్ బ్యారెల్ 1000 బైకులో కస్టమ్ ఛాసిస్, 7-ప్లేట్ క్లచ్ మరియు అధిక సామర్థ్యం గల ప్రైమరీ చైన్ ఉన్నాయి. ఇంజన్ అరుగుదల మరియు శబ్దాన్ని అరికట్టడానికి లిఫ్టర్స్ మరియు ఆయిల్ పంపులు స్వతహాగా పనిచేసేలా నిర్మించడం ఇందులో ఉన్న ప్రత్యేకత.

కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000

సరికొత్త కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000 మోటార్ సైకిల్‌ను చత్తీస్‌ఘర్ లోని బిలాయ్‌ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది. కార్‌బెర్రీ సంస్థ ఆస్ట్రేలియా నుండి ఫిబ్రవరి 2016లో భారత్‌కు వచ్చినపుడు బిలాయ్ ప్రాంతంలో ప్రొడక్షన్ ప్రారంభించింది.

కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వి-ట్విన్ ఇంజన్ కోరుకునే కస్టమర్లకు కార్‌బెర్రీ డబుల్ బ్యారెల్ 1000 బైకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. క్లాసిక్ స్టైల్‌కు తీసిపోకుండా బడ్జెట్ ధరలోనే వి-ట్విన్ ఇంజన్‌తో కార్‌బెర్రీ బైకులు లభిస్తున్నాయి. వి-ట్విన్ 1000సీసీ బైకుల సెగ్మెంట్లో కార్‌బెర్రీ సంచలనం సృష్టించనుంది.

English summary
Read In Telugu: Carberry Double Barrel 1000 With Enfield V-Twin Engine Launched At Rs 7.35 Lakh
Story first published: Tuesday, October 10, 2017, 10:46 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark