కెటిఎమ్ బైకు ఫ్యూయల్ ట్యాంకులో ఉప్పు పోసిన పోలీసు: ఎందుకో తెలుసా ?

Written By:

కాలం ముందుకెల్లేకొద్దీ మానవుని స్థితిగతులు మరియు జీవన శైలిలో మార్పులు రావాల్సి ఉంటుంది. మనం సృష్టించుకునే ప్రతీది మానవ ప్రగతికి ఉపయోగపడాలి. కొన్ని సందర్భాల్లో ఆధునికత మానవుని వికృత చేష్టలకు అద్దం పడుతూ ఉంటుంది.

మానవ రక్షణలో కీలకంగా వ్యవహరించే పోలీసులు సహనం కోల్పోయి ఊహించని పనులు చేస్తుంటారు. అందుకు నిదర్శనం "బైకు ఇంధన ట్యాంకులో ఉప్పు పోసిన పోలీసు" ఘటన.

బైక్ ఫ్యూయల్ ట్యాంకులో ఉప్పు పోసిన పోలీస్

వివరాల్లోకి వెళితే, కేరళలోని తిరువనంతపురంలో మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేషన్ ఏఎస్ఐ యధావిథిగా విధులు నిర్వర్తిసున్నాడు. అయితే అటుగా వచ్చిన కెటిఎమ్ ఆర్‌సి బైకు అధిక వేగంతో వెలుతున్నాడనే నెపంతో పోలీస్ ఆ బైకును ఆపాడు.

Recommended Video - Watch Now!
2018 Hyundai Verna Indian Model Unveiled | In Telugu - DriveSpark తెలుగు
బైక్ ఫ్యూయల్ ట్యాంకులో ఉప్పు పోసిన పోలీస్

ఎందుకు ఆపారు అని కెటిఎమ్ బైక్ రైడర్ పోలీసును అడిగితే, అధిక వేగంతో వెళుతున్నావు కాబట్టి నిలిపామని సమాధానమిచ్చాడు. వేగంగా వెళుతున్నానడానికి సాక్ష్యం ఏమిటిని ప్రశ్నించిన రైడర్‌కు, నీ దగ్గర కెటిఎమ్ ఆర్‌సి బైకు ఉంది కదా ఇదే సాక్ష్యం అని పొంతనలేని సమాధానం చెప్పాడు.

బైక్ ఫ్యూయల్ ట్యాంకులో ఉప్పు పోసిన పోలీస్

హెల్మెట్ మరియు రైడింగ్ వియర్ ధరించి పరిమిత వేగంతోనే వెళుతున్నాను, అయినప్పటికీ మీరు ఆపారు మీ పద్దతి సరిగా లేదని రైడర్ పోలీసుతో వాగ్వాదానికి దిగాడు. పోలీసు మరియు రైడర్ మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరింది.

కోపంతో ఊగిపోయిన ఏఎస్ఐ తన స్టేషన్ కానిష్టేబుల్‌తో ఉప్పు పాకెట్ తెప్పించి కెటిఎమ్ ఆర్‌సి బైకు ఇంధన ట్యాంక్ మూత తెరిచి పాకెట్ ఉప్పు మొత్తం అందులో పోసేశాడు.

బైక్ ఫ్యూయల్ ట్యాంకులో ఉప్పు పోసిన పోలీస్

కెటిఎమ్ ఆర్‌సి 200 బైకు రైడర్ నిజంగా అధిక వేగంతో రైడ్ చేసినప్పటికీ, పోలీసులు ఇలా బైక్ ఫ్యూయల్ ట్యాంకులో చక్కెర లేదా సాల్ట్ పోసే హక్కు లేదు. చట్ట రీత్యా వారిని అదుపులోకి తీసుకుని కేసు ఫైల్ చేయవచ్చు. కానీ పంతం నెగ్గడానికి కొంత మంది ఇలాంటి అనర్థకమైన పనులు చేస్తుంటారు.

బైక్ ఫ్యూయల్ ట్యాంకులో ఉప్పు పోసిన పోలీస్

స్థానికుల కథనం మేరకు, ఆ మార్గంలో ఏ కెట్ఎమ్ బైకులో వెళ్లినా అధిక వేగంతో వెళుతున్నారనే కారణంతో, జరిమానాలు విధించడం మరియు కేసులు పెట్టడం వంటి సంఘటనలు ఎన్నో జరిగాయని తెలిసింది.

బైక్ ఫ్యూయల్ ట్యాంకులో ఉప్పు పోసిన పోలీస్

పోలీసు బైకు ఫ్యూయల్ ట్యాంకులోకి ఉప్పు పోశాడనే వార్త వైరల్‌గా వ్యాపించడంతో తిరువనంతపురం పరిధిలోని మ్యూజియం పోలీస్ స్టేషన్‌ ఏఎస్ఐ సురేషన్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రాంతీయ వార్తా పత్రిక ఓ కథనంలో పేర్కొంది.

English summary
Read In Telugu: Cop Pours Salt In KTM RC Fuel Tank
Story first published: Monday, August 14, 2017, 16:19 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark