ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగోలు చేసిన తరువాత ఎందుకురాలేదని తయారీ సంస్థలను కోరిన కోర్టు

Written By:

మా స్కూటర్లు మరియు బైకులు భారీ మైలేజ్‌ని ఇస్తాయని ప్రకటనలపుడు టూ వీలర్ల తయారీ సంస్థలు గొప్పలుపోతాయి. వాటికి ఆకర్షితులయ్యి కొనుగోలు చేసిన తరువాత చెప్పిన మైలేజ్ ఇవ్వకపోతే ఏం చేస్తాం. చేసేది లేక అలాగే వాడుకుంటాం. కాని దీనికి చెక్ పెట్టేందుకు వినియోగదారుని కోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు...

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

వాహన తయారీ సంస్థలు ఇక మీదట ప్రకటనలు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పాలి. ప్రకనటలప్పుడు మీరు చెప్పిన మైలేజ్ ఓ స్కూటర్‌లో రాలేదు, అది మీరు చెప్పిన మైలేజ్ ఇచ్చే విధంగా రిపేర్ చేయమని ఓ టూ వీలర్ల తయారీ సంస్థకు సూచించింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

ప్రకటన వేళలో మీరు చెప్పిన మైలేజ్ స్కూటర్ ఇవ్వనపుడు, దానికి గల లోపాన్ని గుర్తించమని టీవీఎస్ సర్వీస్ సెంటర్‌ను ఆదేశించింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

రిపేర్ చేసిన తరువాత కూడా మీరు చెప్పిన మైలేజ్ ఇవ్వపోతే స్కూటర్ ధరను వెనక్కి తిరిగిచ్చేయమని కన్స్యూమర్ కోర్ట్ టీవీఎస్ మోటార్స్‌కు సూచించింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

రాజ్‌కోట్‌కు చెందిన గున్వంత్ స్థానిక టీవీఎస్ డీలర్ వద్ద 2014 సెప్టెంబరులో టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కొనుగోలు చేశాడు. కొనుగోలు చేసినపుడు జూపిటర్ లీటర్‌కు 63కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని పేర్కొన్నారు.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

అయితే జూపిటర్ తయారీదారులు టీవీఎస్ తెలిపిన ప్రకటన మేరకు ఒక్కసారి కూడ ఇది 62కిమీల మైలేజ్ ఇవ్వలేదు, దీని పట్ల గున్వంత్ సంతృప్తి చెందక పలుమార్లు డీలర్‌ను కూడా సంప్రదించాడు.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

చెప్పిన మైలేజ్ ఇవ్వనందుకు రూ. 10,000 లను నష్టపరిహారం చెల్లించడానికి టీవీఎస్ టూ వీలర్స్ సంస్థ ముందుకు వచ్చింది. అయితే ఇందుకు అంగీకరించని గున్వంట్ మెహ్తా రాజ్‌కోట్ జిల్లా వినియోగదారుని వివాదాల పరిష్కార ఫోరమ్‌ను సంప్రదించాడు.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

ఇందుకు స్పందించిన వినియోగదారుని కోర్టు మాట్లాడుతూ, మీరు ప్రకటన సమయంలో చెప్పే మైలేజ్ ఇప్పుడెందుకు రావడం లేదని తయారీ సంస్థను ప్రశ్నించింది. మరియు ఆ స్కూటర్‌ను టీవీఎస్ సర్వీస్ మరియు రిపేరీ సెంటర్లో మరమ్మత్తులు చేసే మీరు చెప్పిన మైలేజ్ వచ్చేలా తయారు చేయమని చెప్పింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

ఒక వేళ ఇది కుదరకపోతే గున్వంత్ మహ్తా కోరినట్లు స్కూటర్ మొత్తం ధర రూ. 54,000 లను వెనక్కి చెల్లించి స్కూటర్‌ను వెనక్కి తీసుకోవాలని కోర్టు టీవీఎస్‌కు సూచించింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

కోర్టులో కేసు నడుస్తున్నపుడు, మైలేజ్‌కు సంభందించిన రిపోర్ట్‌ను టీవీఎస్ కోర్టుకు సమర్పించింది. దీని ప్రకారం, మే 2015 లో జూపిటర్‌కు మైలేజ్ పరీక్ష నిర్వహించినపుడు లీటర్‌కు 43కిమీలు నమోదైంది. అయితే ఈ మైలేజ్ మార్చి 2016 నాటికి 65.1కిలో మీటర్లకు పెరిగినట్లు రిపోర్టులో ఉంది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

గతంలో వచ్చిన ఇలాంటి సుమారు ఆరు కేసులను కోర్టు పరిశీలించి ఈ కేసుకు తీర్పునిచ్చింది. ఎప్పటిలాగే గున్వంత్ మెహ్తాకు స్కూటర్ మొత్తం విలువను వెనక్కి తిరిగిచ్చేయాలని సూచించి, స్కూటర్‌ను టీవీఎస్ సర్వీస్ మరియు మరమ్మత్తుల విభాగానికి అప్పగించాలను తీర్పునిచ్చింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

అనుబంధ అంశం

వినియోగదారుని డిమాండ్ మేరకు కోర్టు సూచించినట్లుగా కస్టమర్‌కు సెటిల్‌మెంట్ చేసినట్లు టీవీఎస్ మోటార్స్ తెలిపింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

సాంకేతికంగా టీవీఎస్ జూపిటర్ స్కూటర్‌లో 109సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. టీవీఎస్ టూ వీలర్స్ దీనిని బిస్-IV ఇంజన్‌లతో అప్‌గ్రేడ్ చేసింది.

స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 7.80బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 108కిలోల బరువున్న ఇది టీవీఎస్ ప్రకారం లీటర్‌కు 56కిలమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

 టీవీఎస్ జూపిటర్ మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది.

టీవీఎస్ జూపిటర్ మూడు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది.

  • జూపిటర్ స్టాండర్డ్ ఆర్ ధర రూ. 60,747 లు
  • జూపిటర్ జడ్ఎక్స్ ఆర్ ధర రూ. 62,980 లు
  • మిలియన్ ఆర్ ధర రూ. 65,181 లు
అన్ని ధరలు ఆన్-రోడ్ హైదరాబాద్‌గా ఉన్నాయి.
స్కూటర్ ప్రకటనల్లో చెప్పిన మైలేజ్ కొనుగులు చేసిన తరువాత రావడం లేదా

ప్రస్తుతం ఇండియన్ స్కూటర్ మార్కెట్లో రెండవ అతి పెద్ద స్కూటర్ల తయారీ సంస్థగా టీవీఎస్ రెండవ స్థానంలో నిలిచింది. ఇందుకు ప్రధాన కారణం జూపిటర్ విక్రయాలే. టాప్ 10 స్కూటర్ల విక్రయాల జాబితాలో జూపిటర్ రెండవ స్థానంలో నిలిచింది.

English summary
Read In Telugu to know about Scooter Does Not Deliver Claimed Mileage — Court Asks Company To Rectify The Issue

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark