చూశారంటే హార్ట్ అటాక్ రావడం ఖాయం !!!

Written By:

మోటార్ సైకిళ్లతో స్టంట్లు చేసుకుంటూ రైడింగ్ చేయడం చాలా సంవత్సరాల నుండి జరుగుతోంది. విభిన్న విన్యాసాలు చేయడం ఇప్పుడు వ్యాపారమైపోయింది. ఇలాంటి విన్యాసాలకు మోటార్ సైకిల్ స్పోర్ట్ అనే పేర్లను కూడా పెట్టుకున్నారు. విన్యాసంలో ఆరితేరిన యువకులు తమ స్టంటింగ్ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసేందుకు ఎక్కడపడితే అక్కడ భయకరమైన రీతిలో స్టంట్లు చేపడుతున్నారు.

బైకుల విన్యాసాలు సురక్షితమైన మరియు సరైన వాతావరణంలో చేయాలి, ప్రత్యేకించి మనుషులకు ప్రమాదం వాటిల్లకుండా జరగాల్సి ఉంటుంది. కాని ఈ కథనం చివరిలో ఉన్న వీడియో మీద క్లిక్ చేసారంటే ఓ క్రేజీ బైకర్ (స్నో బాయ్) చేసిన భయంకరమైన స్టంటును వీక్షించవచ్చు. ఆఫ్రికా వీధుల్లో చోటు చేసుకున్న ఈ సంఘటన అక్కడున్న వారికే కాదు వీడియో ద్వారా చూసే వాళ్లకు కూడా చుక్కలు చూపించాడు.

బేసిక్‌గా ఇతడు చేసింది స్టంట్ అనడం కంటే, న్యూసెన్స్ అని చెప్పాలి. ఓ చిన్న తప్పిదం జరిగినా వెలకట్టలేని ప్రమాదం జరిగేది. ముందస్తు ప్రకటన లేకుండా, వాహనాలు నిరంతరం తిరిగే రద్దీ రహదారి మీద ఎలాంటి భద్రత పరమైన నియమాలను పాటించకుండా ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు చేసాడు.

పాఠకులారా.... మీరు ఎప్పుడైనా బైక్ స్టంట్ చేయాలనుకుంటే ఎవరూ లేని ప్రాంతంలో నిపుణుల ఆధ్వర్యంలో భద్రత పరమైన సూచనలు పాటించి, రైడింగ్ జాకెట్, గ్లూవ్స్, హెల్మెట్ ధరించి మరియు సేఫ్టీ గేర్స్ ఇన్‌స్టాల్ చేసుకుని ప్రమాదంలో బయటపడే విధంగా రైడింగ్‌కు సిద్దం కండి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠకుల కోసం కొత్త ఆప్షన్ పరిచయం చేసింది. దేశీయ ఆటోమొబైల్ వెబ్‌సైట్లలో తొలిసారిగా అన్ని వాహన తయారీ సంస్థల యొక్క ఇంటీరియర్ మరియు ఎక్ట్సీరియర్ ఫోటోలను ఒక చోట చేర్చి ఫోటో గ్యాలరీ అనే సెక్షన్ ప్రారంభించింది. మీకు నచ్చిన ఫోటోలను వీక్షించేందుకు www.telugu.drivespark.com వెబ్‌సైట్లో ఫోటోలు సెక్షన్ మీద క్లిక్ చేయగలరు.... ఉదాహరణకు: మీ కోసం టాటా హెక్సా ఎస్‌యూవీ ఫోటో గ్యాలరీ...

English summary
Crazy Biker's Riding Skills Will Leave Your Jaw On The Floor
Please Wait while comments are loading...

Latest Photos