మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులా...? అయితే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే!!

Written By:

ప్రపంచలో అతి పురాతణమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థలలో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి. చిన్న వయస్సు గల వారి నుండి పెద్దల వరకు అన్ని రకాల ఏజ్ గ్రూప్ ఉన్న వ్యక్తులకు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఉత్తమ ఎంపికగా నిలిచాయి. ఏ ఒకటి లేదా రెండు దేశాలకు మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రాయల్ ఎన్ఫీల్డ్‌కు విపరీతమైన అభిమానులు ఉన్నారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

1901 లో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రాణం పోసుకున్నప్పటి నుండి ఎక్కువ మంది ఈ మోటార్ సైకిళ్లను ఎంచుకోవడానికి మొగ్గు చూపేవారు. ఇప్పటికీ, ఆఫీసుకు వెళ్లినా... లేదంటే అడ్వెంచర్ రైడింగ్‌కు వెళ్లినా... సమానమైన రైడింగ్ ఫీల్‌ కల్పించే మోటార్ సైకిళ్లు రాయల్ ఎన్ఫీల్డ్ వద్ద ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు పాఠకుల కోసం రాయల్ ఎన్ఫీల్డ్ గురించి అతి ముఖ్యమైన కొన్ని నిజాలను నేటి కథనంలో అందిస్తోంది.

Recommended Video
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ తొలుత ఆయుధ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఎన్ఫీల్డ్ రైఫిల్ అనే ఆయుధానికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ప్రసిద్దిగాంచింది.

రాయల్ ఎన్ఫీల్డ్ తమ తొలి మోటార్ సైకిల్‌ను 1901లో తయారు చేసింది. ఇందులో 239సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ అందించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఒరిజినల్ లోగో మీద ఫిరంగి ఆయుధపు గుర్తు ఉంటుంది. రాయల్ ఎన్ఫీల్డ్ లోగో మీద ఫిరంగిలా తయారు చేయబడింది, బుల్లెట్‌లా పరుగెడుతుంది(Made like a gun, goes like a bullet) అనే ట్యాగ్ లైన్ ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

షోలే సినిమాలో సైడ్ కార్ ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకును మీరు చూసే ఉంటారు. మొదటి ప్రపంచ యుద్ద కాలంలో ఆయుధాలను తీసుకెళ్లేందుకు మరియు మిలిటరీ అవసరాల కోసం రాయల్ ఎన్ఫీల్డ్ తమ బైకుల్లో సైడ్ కారును పరిచయం చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ బ్రిటీష్ వారికి మోటార్ సైకిళ్లను తయారు చేయడానికి ముందు, యుద్ద అవసరాల కోసం ఉపయోగపడే మోటార్ సైకిళ్లను రష్యా ప్రభుత్వానికి అందించే ఒప్పందాన్ని అప్పట్లో కుదుర్చుకుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

1921 కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ సొంతంగా ఇంజన్‌లను తయారు చేసుకునేది. వాటిలో 976సీసీ సామర్థ్యం గల వి-ట్విన్ ఇంజన్ మరియు 350సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్‌లు ఉండేవి.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రెండవ ప్రపంచ యుద్ద కాలంలో రాయల్ ఎన్ఫీల్డ్ బ్రిటీష్ ఆర్మీ కోసం ప్రత్యేకంగా మోటార్ సైకిళ్లను తయారు చేసింది. తేలిక పాటి ఈ బైకులను గగన తలం నుండి యుద్దం జరిగే ప్రదేశంలోకి పారాచూట్ ద్వారా వదిలేసే వారు.

Picture Credit:welbike.net

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

తేలిక పాటు ఈ యుద్ద బైకు బరువు కేవలం 60 కిలోలు మాత్రమే ఉండేది. ఇందులో 3.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే 125సీసీ సామర్థ్యం ఉన్న 2-స్ట్రోక్ ఇంజన్ ఉండేది. దీని పేరు ఇంత వరకు చెప్పలేదు కదూ.... ఫ్లయింగ్ ఫ్లీ [FLYING FLEA (ఎగిరే గుమ్మడి పురుగు)] అనే పేరుతో తయారు చేసేది.

Picture Credit: Wiki-Commons

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

1947 ఏడాదిలో రాయల్ ఎన్ఫీల్డ్ 'Super Meteor' మరియు 'Constellation' అనే బైకులను విడుదల చేసింది. ఈ రెండు బైకుల్లో 700సీసీ సామర్థ్యం గల ప్యార్లల్ ఇంజన్‌లు ఉండేవి. అప్పట్లో అత్యంత సరసమైన ధరకు లభించే ఇవి, రాయల్ ఎన్ఫీల్డ్ తొలి సూపర్ బైకులుగా పేరు గడించాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో కొన్ని బైకులు బుల్లెట్లుగా పిలువబడ్డాయి. ఇందుకు కారణం, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రిటీష్ ఆర్మీ కోసం ఒకప్పుడు రైఫిల్స్ తయారు చేసేది. దాని ఆధాంగా బుల్లెట్ అనే మోటార్ సైకిల్ పేరు వాడుకలోకి వచ్చింది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీలో ఎక్కువ కాలం విక్రయించబడిన మరియు దీర్ఘకాలం పాటు ప్రొడక్షన్ చేయబడిన మోడల్ బుల్లెట్ 350. తొలి బుల్లెట్ బైకును గ్రేట్ బ్రిటన్‌లో విడుదల చేసింది. తరువాత 1955లో ఇండియన్ మార్కెట్లోకి బుల్లెట్ 350 విడుదలయ్యింది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లను ఎన్ఫీల్డ్ ఇండియన్ అనే బ్రాండ్ పేరుతో అమెరికన్ మార్కెట్లో విడుదల చేసింది. 1955 నుండి 1959 కాలం మధ్యలో 'ఎన్ఫీల్డ్ ఇండియన్' బైకులను విక్రయించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

అదే సమయంలో రాయల్ ఎన్ఫీల్డ్ తమిళనాడులోని చెన్నై ఆధారిత మద్రాస్ మోటార్స్ ఉమ్మడి భాగస్వామ్యంతో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించింది. 1955 నుండి 1962 వరకు రాయల్ ఎన్ఫీల్డ్ విడి భాగాలను దిగుమతి చేసుకుని మద్రాస్ మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంటులో అసెంబుల్ చేసి విక్రయించేది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ 1962 లో ‘Super Meteor‘ మరియు‘Constellation‘ బైకుల విజయానికి గుర్తుగా ఇంటర్‌సెప్టర్ (Interseptor) బైకును 740సీసీ సామర్థ్యం గల ప్యార్లల్ ట్విన్ ఇంజన్‌తో విడుదల చేసింది. అప్పట్లో ఇది 400 మీటర్ల దూరాన్ని 13 సెకండ్లలో చేధించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

భారత దేశానికి గల పొరుగు దేశాల సరిహద్దుల్లో గస్తీ నిర్వహించడానికి ఆర్మీ మరియు పోలీసులకు మోటార్ సైకిళ్లను అందించేందుకు 1965 లో భారత ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అందుకు ఉత్తమ మోడల్‌గా భారత ప్రభుత్వం ఎంచుకుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ 1970ల కాలంలో 650సీసీ, 700సీసీ సామర్థ్యం గల మోటార్ సైకిళ్లను ఇండియాలో విడుదల చేసింది. అయితే, ఆశించిన విక్రయాలు లేనందు వలన వాటి విక్రయాలు నిలిపివేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయాల పరంగా హ్యార్లీడేవిడ్సన్ సంస్థను వెనక్కినెట్టేసింది. కేవలం ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ హ్యార్లీడేడ్సన్ ప్రపంచ వ్యాప్తంగా ఒక్క ఏడాదిలో విక్రయించిన బైకుల కంటే అధికం.

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఆసక్తికర నిజాలు

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 42 దేశాలకు పైగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఎగుమతి అవుతున్నాయి. ఇండియా నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను అధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా, జపాన్, జర్మనీ మరియు అర్జెంటీనా వంటి దేశాలున్నాయి.

English summary
Read In Telugu: Facts Every Royal Enfield Fan Should know
Story first published: Tuesday, August 22, 2017, 13:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark