టూ వీలర్ల మీద జిఎస్‌టి ప్రభావం: వివిధ కంపెనీల బైకుల్లో పెరిగిన మరియు తగ్గిన ధరలు

Written By:

ఒకే దేశం, ఒకే ట్యాక్స్ ప్రేరణతో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వస్తు మరియు సేవల పన్ను (GST) పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. జిఎస్‌టి ఆధారంగా వివిధ కార్ల మీద అమలయ్యే ట్యాక్స్ వివరాలతో ఇది వరకే ఓ కథనాన్ని ప్రచురించాము.

అయితే జిఎస్‌టి అమలు వివిధ ద్విచక్ర వాహనాల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించింది ? ఏ బైకుల మీద ధరలు తగ్గాయి, ఏ బైకుల మీద ధరలు పెరిగాయి ? వంటి వాటి వివరాలను నేటి కథనంలో తెలుసుకుందాం రండి...

స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

టూ వీలర్ల మీద జిఎస్‌టి మండలి ఖరారు చేసిన ట్యాక్స్ స్వాగతించదగినదే అని చెప్పవచ్చు. సామాన్యులు ఎక్కువగా ఎంచుకునే టూ వీలర్లు మీద ట్యాక్స్ తగ్గుముఖం పట్టగా, అత్యంత ఖరీదైన మరియు ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల మీద స్వల్ప మేర ట్యాక్స్ పెరిగింది.

స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

టూ వీలర్లను ఇంజన్ యొక్క కెపాసిటి ఆధారంతో రెండు వర్గాలుగా విభజించి ట్యాక్స్ నిర్ణయించడం జరిగింది. అందులో 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్ల మీద ట్యాక్స్ పెరగగా, 350సీసీ కన్నా తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న టూ వీలర్ల మీద ట్యాక్స్ తగ్గింది.

స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

గతంలో అన్ని టూ వీలర్ల మీద ట్యాక్స్ 30 శాతంగా ఉండేది. ఇప్పుడు 350సీసీ కన్నా తక్కు ఇంజన్ కెపాసిటి ఉన్న టూ వీలర్ల మీద 28 శాతంగా నిర్ణయించడంతో వీటి మీద 2 శాతం ట్యాక్స్ తగ్గింది. అదే విధంగా 350సీసీ కన్నా ఎక్కువ కెపాసిటి ఉన్న టూ వీలర్ల మీద 28శాతం ట్యాక్స్ మరియు 3 శాతం సెస్ అదనంగా కలపడంతో మొత్తం ట్యాక్స్ 31 శాతంగా నిర్ణయించడం జరిగింది. దీంతో ఇలాంటి బైకుల మీద సాధరణంగా కన్నా 1 శాతం పెరిగింది.

వివిధ బైకులకు చెందిన జిఎస్‌టికి ముందు జిఎస్‌టి అనంతరం ధరల వివరాలు....

స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

బజాజ్

బజాజ్ ఆటో లైనప్‌లో 350సీసీ లోపే ఎక్కువ టూ వీలర్లను అందుబాటులో ఉంచింది. కేవలం బజాజ్ డామినర్ మాత్రమే 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న కెటగిరీలోకి వస్తుంది. డామినర్ 400 బైకు మీద 0.8శాతం వరకు ధర పెరిగింది. మిగతా అన్ని టూ వీలర్ల మీద 2 శాతం వరకు ధరలు తగ్గించింది.

స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు బజాజ్ పల్సర్ శ్రేణి బైకుల ధరలు: రూ. 82,147 లు నుండి 1,37,862 లు
 • జిఎస్‌టి అనంతరం బజాజ్ పల్సర్ శ్రేణి బైకుల ధరలు: రూ. 78,861 లు నుండి 1,32,347 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు బజాజ్ డిస్కవర్ ధర రూ. 57,326 లు
 • జిఎస్‌టి అనంతరం బజాజ్ డిస్కవర్ ధర రూ. 55,033 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు డామినర్ 400 ధర రూ. 1,54,503 లు
 • జిఎస్‌టి అనంతరం డామినర్ 400 ధర రూ. 1,55,739 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల మీద జిఎస్‌టి ప్రభావం

రాయల్ ఎన్ఫీల్డ్‌లోని అన్ని మోటార్ సైకిళ్ల సామర్థ్యం 350సీసీ కన్నా ఎక్కువే ఉంది. కాబట్టి రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల ధరల తగ్గింపు ఏ మాత్రం లేదు.

 • జిఎస్‌టి ముందు క్లాసిక్ 350 ధర రూ. 1,52,865 లు
 • జిఎస్‌టి అనంతరం క్లాసిక్ 350 ధర రూ. 1,54,087 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధర రూ. 1,82,364 లు
 • జిఎస్‌టి అనంతరం రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధర రూ. 1,83,822 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు రాయల్ ఎన్ఫీల్డ్బుల్లెట్ 350 ధర రూ. 1,28,409 లు
 • జిఎస్‌టి అనంతరం రాయల్ ఎన్ఫీల్డ్బుల్లెట్ 350 ధర రూ. 1,29,436 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

టీవీఎస్ టూ వీలర్ల మీద జిఎస్‌టి ప్రభావం

టీవీఎస్ లైనప్‌లో 350సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులు లేవు. కాబట్టి అన్ని బైకులు మరియు స్కూటర్ల మీద రెండు శాతం ధరలు తగ్గుముఖం పట్టాయి.

 • జిఎస్‌టి ముందు టీవీఎస్ స్టార్ సిటి ప్లస్ ధర రూ. 51,888 లు
 • జిఎస్‌టి అనంతరం టీవీఎస్ స్టార్ సిటి ప్లస్ ధర రూ. 49,812 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ధర రూ. 1,05,609 లు
 • జిఎస్‌టి తరువాత టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి ధర రూ. 1,01,304 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు టీవీఎస్ విక్టర్ ధర రూ. 59,286 లు
 • జిఎస్‌టి తరువాత టీవీఎస్ విక్టర్ ధర రూ. 56,914 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

హోండా మోటార్ సైకిళ్ల మీద జిఎస్‌టి ప్రభావం

జపాన్ దిగ్గజం హోండా టూ వీలర్స్ ఇండియా లైనప్‌లో 350సీసీ కన్నా ఎక్కువ మరియు తక్కువ సామర్థ్యం ఉన్న టూ వీలర్లు ఉన్నాయి.

 • జిఎస్‌టి ముందు హోండా సిబి షైన్ ధర రూ. 70,147 లు
 • జిఎస్‌టి తరువాత హోండా సిబి షైన్ ధర రూ. 67,341 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు హోండా సిబి యూనికార్న్ 160 ధర రూ. 85,215 లు
 • జిఎస్‌టి ముందు హోండా సిబి యూనికార్న్ 160 ధర రూ. 88,623 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం
 • జిఎస్‌టి ముందు హోండా సిబిఆర్ 650 ఎఫ్ ధర రూ. 8,64,249 లు
 • జిఎస్‌టి తరువాత హోండా సిబిఆర్ 650 ఎఫ్ ధర రూ. 8,71,162 లు
స్కూటర్లు మరియు బైకుల మీద జిఎస్‌టి ప్రభావం

ముఖ్య గమనిక: జిఎస్‌టి ఆధారంగా ద్విచక్ర వాహన తయారీ సంస్థలు వెల్లడించిన ధరలు అన్ని కూడా ఎక్స్-షోరూమ్‌గా ఇవ్వబడ్డాయి, ఈ ధరలలో వివిధ నగరాలు మరియు డీలర్ల మధ్య వ్యత్యాసం ఉంటుంది.

English summary
Read in Telugu about GST Impact on Bike Prices
Story first published: Monday, July 3, 2017, 17:37 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark