కార్ల మీద జిఎస్‌టి ప్రభావం: ఏ కార్ల మీద ఎంత మేరకు ట్యాక్స్- వివరంగా

Written By:

కేంద్ర ప్రభుత్వం మునుపు ఉన్న ట్యాక్స్ స్థానంలోకి ఒకే దేశం, ఒకే ట్యాక్స్ అంటూ కొత్తగా రూపొందించిన వస్తు మరియు సేవల పన్ను (GST) జూలై 1, 2017 అమలు చేయనుంది. GST ఆధారంగా వివిధ స్లాబుల్లో వెల్లడించిన ట్యాక్స్‌లు తీవ్ర గందరగోళానికి తెరతీశాయి. కొన్ని రంగాలకు కొలిసొస్తుంటే, మరికొన్ని రంగాలకు తీవ్ర నిరాశను మిగల్చనుంది. మరి ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రధానంగా కార్ల మీద కూడా ఇదే పరిస్థితి నెలకొంది.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రధానంగా ఉన్న ప్యాసింజర్ కార్ల సెగ్మెంట్లో విభాగాల వారీగా విభజించి జిఎస్‌టి ట్యాక్స్ నిర్ణయించారు. చిన్న కార్ల ధరల్లో పెద్ద మార్పులేవీ చోటు చేసుకోలేదు, హైబ్రిడ్ కార్ల ధరలు పెరగనున్నాయి. అయితే పెద్ద వాహనాలు, ఎస్‌యూవీల మీద ట్యాక్స్ తగ్గింది. ఇవాళ్టి కథనంలో ఏ కార్ల మీద ఎంత మేరకు ట్యాక్స్ ఉందో చూద్దాం రండి...

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

1200సీసీ ఇంజన్ కెపాసిటి కన్నా తక్కువ ఉన్న పెట్రోల్ కార్ల మీద మునుపు 31.5 శాతం ట్యాక్స్ ఉండేది. అయితే జిఎస్‌టి ప్రకారం, 28 శాతం నిర్ధిష్టమైన ట్యాక్స్ మరియు ఒక శాతం అదనపు ట్యాక్స్ నిర్ణయించి, మొత్తం ట్యాక్స్ 29 శాతంగా నిర్ణయించారు. మారుతి ఆల్టో, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 కార్లను ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

చిన్న డీజల్ కార్ల మీద ప్రస్తుతం 33.25 శాతం ట్యాక్స్ ఉంది. నాలుగు మీటర్ల పొడవులోపు ఉన్న మరియు 1.5-లీటర్ కన్నా తక్కువ కెపాసిటి ఉన్న డీజల్ కార్ల మీద 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్ మరియు 3 శాతం అదనపు సెస్ నిర్ణయించారు. అనగా మొత్తం 31 శాతం ట్యాక్స్ కాబట్టి ఈ కెటగిరీలో వచ్చే కార్ల ధరలు కూడా తగ్గనున్నాయి.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఫోర్డ్ ఎకో స్పోర్ట్ మరియు ఈ సెగ్మెంట్లో ఉన్న నాలుగు మీటర్ల కన్నా తక్కువ పొడవుతో 1.5-లీటర్ లోపు సామర్థ్యం ఉన్న పెట్రలో వేరియంట్ వాహనాల మీద ప్రస్తుత ట్యాక్స్ 44.7శాతముగా ఉంది. అయితే జిఎస్‌టి మేరకు వీటి మీద 28 శాతం నిర్దిష్ట ట్యాక్స్ మరియు 15 శాతం సెస్ నిర్ణయించారు. మొత్తం కలుపుకుంటే 43 శాతం. మునుపటి విధానంతో పోల్చుకుంటే 1.7శాతం తగ్గనుంది.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

1.2-లీటర్ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పెట్రోల్ మరియు 1.5-లీటర్ కన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజల్ కార్ల పొడవు 4 మీటర్ల కన్నా ఎక్కువ ఉన్న వాటిపై ప్రస్తుతం 51.6 శాతం ట్యాక్స్ ఉంది. అయితే వీటి మీద ప్రస్తుతం 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్ మరియు 15 శాతం సెస్ కలుపుకొన్ని మొత్తం 43 శాతంగా నిర్ణయించారు. అంటే ఈ సెగ్మెంట్లోని కార్లపై ట్యాక్స్ 8.6 శాతం వరకు తగ్గుతోంది.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఎస్‌యూవీ వాహనాల మీద ప్రస్తుతం ట్యాక్స్ 55 శాతంగా ఉంది. అయితే జిఎస్‌టి మేరకు 28 శాతం మరియు 15 శాతం కలుపుకుంటే ఎస్‌యూవీల మీద 43 శాతం ట్యాక్స్ మాత్రమే పడనుంది. కాబట్టి 12 శాతం వరకు ఎస్‌యూవీల ధరలు తగ్గనున్నాయి.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో సంయుక్తంగా నడిచే కార్లను హైబ్రిడ్ కార్లుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఇలాంటి కార్ల మీద కేంద్రం 30.3 శాతం మాత్రమే ట్యాక్స్ విధిస్తోంది. కానీ, నూతన జిఎస్‌టి కారణంగా వీటి ట్యాక్స్ భారీగా పెరిగింది.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

పెద్ద పరిమాణంలో ఉన్న పెట్రోల్ మరియు డీజల్ కార్లు అదే విధంగా ఎస్‌యూవీల తరహాలోనే వీటి మీద 28 శాతం నిర్ధిష్ట ట్యాక్స్ మరియు 15 శాతం సెస్ నిర్ణయించడంతో 30.3 శాతం ట్యాక్స్ కాస్తా 43 శాతానికి పెరిగింది. అంటే హైబ్రిడ్ కార్ల మీద ట్యాక్స్ 13.3 మేర పెరిగింది. ఇక మీదట హైబ్రిడ్ కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

ఉద్గార రహిత ఎలక్ట్రిక్ కార్ల మీద ప్రస్తుతం 20.5 శాతం ట్యాక్స్ ఉంది. తాజాగా జిఎస్‌టిలో ఎలక్ట్రిక్ కార్ల మీద ట్యాక్స్ 12 శాతం వరకు తగ్గించారు. దీంతో ఇప్పుడు ఈ విద్యుత్ కార్ల మీద ట్యాక్స్ కేవలం 8.5 శాతం మాత్రమే ఉంది.

కార్ల మీద జిఎస్‌టి ప్రభావం

కేంద్రం జూలై 1, 2017 నుండి జిఎస్‌టి ని పూర్తి స్థాయిలో అమలు చేయనుంది. కాబట్టి పైన తెలిపిన ట్యాక్స్‌లకు అనుగుణంగా వివిధ కార్ల తయారీ సంస్థలు వారి ఉత్పత్తుల ధరలను సవరించనున్నాయి. ధరలు మరియు ట్యాక్స్ విషయంలో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చిన తరువాతనే మీకు నచ్చిన కారును బుక్ చేసుకోండి, పైన పేర్కొన్న జిఎస్‌టిలో కేంద్రం మార్పులు చేసే అవకాశం ఉంది.

English summary
Read In Telugu: How Will GST Impact On Various Cars

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark