హ్యార్లీ డేవిడ్సన్ నుండి రోడ్ కింగ్ స్పెషల్: పూర్తి వివరాల కోసం

Written By:

ఖరీదైన మరియు లగ్జరీ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హ్యార్లీ డేవిడ్‌సన్ తాజాగ రోడ్ కింగ్ స్పెషల్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. రోడ్ కింగ్ స్పెషల్ ప్రత్యేకత ఏమిటంటే నాలుగు విభిన్న రంగుల్లో పరిచయం చేయడం. అంతే కాకుండా క్రోమ్ పరికరాల తొలగింపు మీద దృష్టి సారిస్తోందా అంటే అవుననే చెప్పాలి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హ్యార్లీ డేవిడ్సన్ రోడ్ కింగ్ స్పెషల్

హ్యార్లీ ఆవిష్కరించిన రోడ్ కింగ్ స్పెషల్ మోటార్ సైకిల్‌ను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే క్రోమ్ పరికరాలు ఉన్న ప్రదేశంలో మూడే బ్లాక్ అనే రంగుతో ఉన్న లోహపు పరికరాలు వచ్చాయి. సాధారణ బైకుతో పోల్చుకుంటే భిన్నంగా విండ్ షీల్డ్ తొలగించడం జరిగింది.

హ్యార్లీ డేవిడ్సన్ రోడ్ కింగ్ స్పెషల్

సాంకేతికంగా ఇందులో 1,750సీసీ సామర్థ్యం గల మిల్వాకీ ఎయిట్ ఇంజన్ కలదు, మునుపటి ఇంజన్‌తో పోల్చుకుంటే ఇది 10 శాతం అధికంగా పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుందని అమెరికా బైకుల తయారీ సంస్థ హ్యార్లీ తెలిపింది.

హ్యార్లీ డేవిడ్సన్ రోడ్ కింగ్ స్పెషల్

తొలుత తెలిపిన కథనం మేరకు రోడ్ కింగ్ స్పెషల్ నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది. ఇవి, చార్ కోల్ డెనిమ్, వివిడ్ బ్లాక్, ఆలీవ్ గోల్డ్ మరియు హాట్ రెడ్ ఫ్లేక్ హార్డ్ క్యాండీ కస్టమ్.

హ్యార్లీ డేవిడ్సన్ రోడ్ కింగ్ స్పెషల్

దీనిని ఇండియాలో విడుదల చేసే అంశానికి సంభందించి ఎలాంటి సమాచారం లేదు. అంతర్జాతీయ విపణిలో అందించే దాదాపు అన్ని మోడళ్లను కూడా దేశీయ విపణిలో అందుబాటులో ఉంచింది. కాబట్టి దీనిని భారత్ మార్కెట్లోకి తెస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

హ్యార్లీ డేవిడ్సన్ రోడ్ కింగ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్ బైకుల ధరలు ఎక్కువనిపిస్తే, భారీ ఫీచర్లతో, శక్తివంతమైన ఇంజన్‌తో బజాజ్ విడుదల చేసిన డామినర్ 400 మోటార్ సైకిల్ ఫోటోలను వీక్షించండి....

 
English summary
Harley-Davidson Road King Special Unveiled — All The Details You Need To Know
Story first published: Tuesday, February 14, 2017, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark