హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో మోటోకార్ప్

Written By:

భారత దేశపు అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తమ ఇండియా వెబ్‌సైట్ నుండి హంక్ మరియు ఎక్ట్స్రీమ్ మోటార్ సైకిళ్లను తొలగించింది. హీరో మోటోకార్ప్‌కు కొన్ని మోడళ్లు మంచి ఫలితాలను సాధించిపెడుతుంటే మరికొన్ని మోడళ్లు ఆశించిన మేర ఫలితాన్నివ్వడం లేదు.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

హంక్ మరియు ఎక్ట్స్రీమ్‌లు మాత్రమే కాకుండా హెచ్ఎఫ్ డాన్, స్ల్పెండర్ ప్రొ క్లాసిక్ లతో పాటు స్ల్పెండర్ ఐస్మార్ట్ వంటి బైకులు కూడా పెద్ద రాణించలేకపోతున్నాయి.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

విక్రయాల్లో వృద్ది లేని మోడళ్లను లైనప్‌ నుండి తొలగించి వాటి స్థానంలోకి కొత్త మోడళ్లు లేదా ఉన్న వాటికే అప్‌గ్రేడ్స్ చేసి మళ్లీ విడుదల చేసే అవకాశం ఉంది.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

హంక్ మరియు ఎక్ట్స్రీమ్ బైకులను లైనప్‌ నుండి తొలగించడంతో 150సీసీ సెగ్మెంట్లో హీరో తన ప్రాబల్యాన్ని స్వల్పంగా కోల్పోయిందని చెప్పవచ్చు. గతంలో ఆచీవర్ మరియు ఎక్ట్స్రీమ్ స్పోర్ట్ బైకులను విపణిలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

ఇండియా లోని 150సీసీ సెగ్మెంట్లో ఉన్న మోటార్ సైకిళ్లలో ఆటోమేటిక్ ఇంజన్ ఆఫ్ మరియు ఆన్ (I3S) పరిజ్ఞానంతో వచ్చిన మొదటి బైకు ఇదే. ఐదు సెకండ్ల పాటు ఇంజన్‌ను న్యూట్రల్‌లో ఐడిల్‌గా ఉంచితే బైకు ఆఫ్ అయిపోతుంది తరువాత క్లచ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

హీరో మోటోకార్ప్ వద్ద ఉన్న హంక్ మరియు ఎక్ట్స్రీమ్‌లను తొలగించగా ఉన్న ప్రధానమైన 150సీసీ బైకు ఆచీవర్. ఇందులో 13.4బిహెచ్‌పి పవర్ మరియు 12.8ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 149.1సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

హీరో వద్ద ఉన్న మరో 150సీసీ మోడల్ ఎక్ట్స్రీమ్ స్పోర్ట్స్, 150సీసీ సెగ్మెంట్లో స్పోర్టివ్ లక్షణాలున్న ఏకైక బైక్ ఇదే. అయితే ఇందులో కూడా 149.1సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 15.6బిహెచ్‌పి పవర్ మరియు 13.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆరు కొత్త మోటార్ సైకిళ్లను విడుదల చేయాలని లక్ష్యంతో ఉంది. అందుకుగాను కొత్త మోడళ్ల అభివృద్ది కోసం సుమారుగా రూ. 2,500 కోట్ల రుపాయలను పెట్టుబడిగా పెట్టనుంది.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

ఈ మొత్తం పెట్టుబడిని తయారీ సాంకేతికత అభివృద్ది, వేగవంతమైన మరియు నాణ్యమైన ఉత్పత్తి కోసం కూడా మళ్లించనున్నట్లు హీరో తెలిపింది. భవిష్యత్తులో కొత్త ప్లాంట్లు మరియు కొత్త ఉత్పత్తుల అభివృద్ది కోసం ఈ పెట్టుబడిని వినియోగించనుంది.

హంక్ మరియు ఎక్స్‌స్ట్రీమ్ లకు వీడ్కోలు పలికిన హీరో

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హీరో నుండి రానున్న తరువాత మోడల్ ఎక్ట్స్రీమ్ 200ఎస్ ప్రీమియమ్ మోటార్ సైకిల్‌ అని తెలుస్తోంది. అదే విధంగా 125సీసీ నుండి 150సీసీ మధ్య రేంజ్‌లో కొత్త స్కూటర్లను అభివృద్ది చేసే ఆలోచనలో కూడా ఉంది.

English summary
Read In Telugu Hero Hunk And Xtreme Removed From Indian Website
Story first published: Wednesday, May 31, 2017, 10:49 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark