భారీగా పెరిగిన హీరో టూ వీలర్ల ధరలు

Written By:

భారత దేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ దేశీయ విపణిలో ఉన్న తమ అన్ని మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్ల మీద ధరలను పెంచేసింది. తయారీ భారం పెరిగిందనే కారణం చేత ధరల పెంపుతో నూతన ధరల సవరణ చేపట్టింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హీరో టూ వీలర్ల ధరలు

రూ. 500 నుండి రూ. 2000 ల రేంజ్‌లో ధరలు పెంపును చేపట్టింది. పెరిగిన ధరలతో కొత్త ధరలన్నీ మే 1, 2017 నుండి అమల్లోకి వచ్చినట్లు హీరో మోటోకార్ప్ ఓ ప్రకటనలో తెలిపింది.

హీరో టూ వీలర్ల ధరలు

ముడి సరుకు కొనుగోలు మీద భారం పెరుగుతున్న నేపథ్యంలో తమ లైనప్‌లో ఉండే అన్ని మోడళ్ల మీద కనిష్టంగా రూ. 500 లు మరియు గరిష్టంగా రూ. 2,200 ల వరకు పెంచామని పేర్కొంది.

హీరో టూ వీలర్ల ధరలు

హీరో మోటోకార్ప్ తమ లైనప్‌లో ఎంట్రీ లెవల్ మోడల్ హెచ్ఎఫ్ డాన్ నుండి టాప్ ఎండ్ మోడల్ కరిజ్మా జడ్ఎమ్ఆర్ వరకు ఉన్నాయి, వీటి ధరలు రూ. 40,000 ల నుండి ఒక లక్ష రుపాయల వరకు ఉన్నాయి.

హీరో టూ వీలర్ల ధరలు

గడిచిన ఏప్రిల్ 2017 నెలలో 5,91,306 యూనిట్ల టూ వీలర్లను హీరో మోటోకార్ప్ విక్రయించింది. గత ఏడాది ఇదే నెల విక్రయాలు 6,12,739 తో పోల్చుకుంటే అమ్మకాలు 3.49 శాతం క్షీణించాయి.

హీరో టూ వీలర్ల ధరలు

ఇండియాలో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో మే మాసంలో రిటైల్ అమ్మకాలు పుంజుకునే అవకాశాలు అధికంగా ఉన్నట్లు ఓ టూ వీలర్ల తయారీ దిగ్గజం తెలిపింది.

హీరో టూ వీలర్ల ధరలు

తయారీని వృద్ది చేసేందుకు ప్రొడక్షన్ ప్లాంట్లను విస్తరించే పనిలో హీరో నిమగ్నమయ్యింది. బ్రెజిల్ మరియు కొలంబియా వంటి దేశాలలో మార్కెట్‌ను విరివిగా విస్తరించే పనిలో హీరో మోటోకార్ప్ ఉంది.

ప్రస్తుతం హీరో లైనప్‌లో ఉన్న టూ వీలర్ల వివరాలు...

ప్రస్తుతం హీరో లైనప్‌లో ఉన్న టూ వీలర్ల వివరాలు...

స్కూటర్లు

 • డ్యూయెట్,
 • మాయెస్ట్రో ఎడ్జ్,
 • ప్లెజర్,
 • గ్లామర్,
హీరో టూ వీలర్ల ధరలు

బైకులు...

 • ప్యాసన్,
 • స్ల్పెండర్,
 • హెచ్ఎఫ్ డీలక్స్,
 • కరిజ్మా జడ్ఎమ్ఆర్,
 • ఎక్స్‌స్ట్రీమ్,
 • హంక్,
 • అచీవర్,
 • ఇగ్నైటర్,
 
English summary
Read In Telugu To Know About Hero MotoCorp Increases Prices Of Its Scooters And Motorcycles.
Story first published: Thursday, May 4, 2017, 10:56 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark