త్వరలో విడుదల కానున్న హీరో ఎక్స్ఎఫ్3ఆర్ కు ప్రొడక్షన్ ఏర్పాట్లు

Written By:

2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రపంచపు అతి పెద్ద టూ వీలర్ల తయారీ సంస్థ హీరో మోటోకార్ప్, తమ ఎక్స్ఎఫ్3ఆర్ మోటార్ సైకిల్‌ను ఆవిష్కరించింది. కాన్సెప్ట్ దశలో ప్రదర్శనకు వచ్చిన దీని పట్ల సందర్శకుల నుండి భారీ స్పందన రావడంతో ఇప్పుడు దీనిని ప్రొడక్షన్‌కు సిద్దం చేస్తోంది.

ప్రొడక్షన్‌కు సిద్దమైన మోడల్ యొక్క డిజైన్ దాదాపు కాన్సెప్ట్ ను పోలి ఉంది. గుర్గావ్ ఆధారిత హీరో మోటోకార్ప్ ప్రొడక్షన్ ప్లాంటులో దీనిని ఉత్పత్తి చేయనున్నట్లు సమాచారం...

హీరో ఎక్స్ఎఫ్3ఆర్ మోటార్ సైకిల్ నేక్డ్ స్ట్రీట్ బైక్ సెగ్మెంట్లోకి విడుదల కానుంది. ఇందులో 300సీసీ సామర్థ్యం గల ఇంజన్ రానుంది.

ఇందులో ప్రత్యేకంగా ఉన్న ఫీచర్లలో సింగల్ సైడ్ స్వింగ్ ఆర్మ్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ మరియు అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ కలవు. ముందు వైపున 300ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు కలవు.

ఇంకా ఖాయం కాని ఫీచర్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి, డ్యూయల్ ఛానల్ యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, డ్యూయల్ మ్యాప్ టెక్నాలజీ(రెండు రైడింగ్ మోడ్స్) మరియు ఇరువైపులా పిరెల్లీ టైర్లుతో పాటు ఎర్రటి రంగులో ఉన్న సబ్ ఫ్రేమ్ ఆధారంతో గ్రౌండ్ నుండి ఎక్కువ ఎత్తులో బంధించబడిన ఎగ్జాస్ట్ సిస్టమ్.

హీరో మోటోకార్ప్ ఈ మధ్యనో తమ ఎక్ట్స్రీమ్ 200ఎస్ మోడల్‌ను దేశీయంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులోని 200సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ 18.2బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

యమహా ఎఫ్‌జడ్ 25 ఇండియా విడుదల: ధర, మైలేజ్ మరియు ఇంజన్ స్పెసిఫికేషన్లు
యమహా ఇండియా దేశీయంగా ఉన్న 200-250సీసీ సెగ్మెంట్లోకి తమ ఎఫ్‌జడ్ 25 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ధర, మైలేజ్ మరియు ఇంజన్ వివరాల గురించి పూర్తిగా...

 

English summary
Naked Street Bike Hero XF3R To Hit Production; India Launch Soon
Story first published: Wednesday, January 25, 2017, 19:22 [IST]
Please Wait while comments are loading...

Latest Photos