హై కెపాసిటి మోటార్ సైకిళ్ల మీద కన్నేసిన హీరోమోటోకార్ప్

Written By:

200సీసీ సామర్థ్యం ఉన్న ద్విచక్ర వాహన సెగ్మెంట్లో రంగం సిద్దంమైందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న బజాజ్ పల్సర్ 200ఎన్ఎస్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 మరియు కెటిఎమ్ 200 డ్యూక్ వంటి బైకులున్న సెగ్మెంట్లోకి భారత దేశపు దిగ్గజ సరసమైన మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ హీరో మోటాకార్ప్ తమ ఎక్స్‌ట్రీమ్ 200ఎస్ ను విడుదల చేస్తోంది.

హీరో మోటోకార్ప్ ఈ ప్రీమియ్ మోటార్ సైకిల్‌ను మొదటి సారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. మరియు దీనిని కేవలం రూ. 90,000 ల ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది.

సాంకేతికంగా ఇందులో 200సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది సుమారుగా 18.5బిహెచ్‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి అందుతుంది. ఇది సుమారుగా 45కెఎమ్‌పిఎల్ మైలేజ్ ఇవ్వగలదు.

హీరో మోటోకార్ప్ ఇందులో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, రెండు వైపులా డిస్క్ బ్రేకులు, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్ వంటి వాటిని పరిచయం చేస్తోంది.

పోటీ పరంగా చూస్తే ఎక్స్‌ట్రీమ్200ఎస్ ప్రస్తుతం ఉన్న పల్సర్ 200ఎన్ఎస్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 మరియు కెటిఎమ్ 200 డ్యూక్ వంటి మోటార్ సైకిళ్లతో గట్టి పోటీని ఎదుర్కోనుంది. డిజైన్ పరంగా దీని తోబుట్టువుగా వ్యవహరించే ఎక్స్‌ట్రీమ్150 ను పోలి ఉంటుంది.

తక్కువ సామర్థ్యం ఉన్న మరియు అత్యంత సరసమైన ఉత్పత్తులను విడుదల చేసే సంస్థగా పేరుగాంచిన హీరో మోటోకార్ప్ ఈ ఏడాది మరిన్ని శక్తివంతమైన మోటార్ సైకిళ్ల విడుదలకు సిద్దమవుతోంది.

అందులో 250సీసీ నుండి 600సీసీ మధ్య సామర్థ్యం గల ఇంజన్‌లతో హెచ్ఎక్స్250ఆర్, ఎక్స్ఎఫ్250ఆర్, ఎక్స్ఎఫ్3ఆర్ మరియు హీరో హాస్టర్ వంటివి మోడళ్లు ఉన్నాయి.

బడ్జెట్ ధరతో 2017 లో విడుదల కానున్న స్పోర్టివ్ బైకులు
2017 లో విడుదల కానున్న ఉత్తేజకరమైన బైకుల గురించి మరియు అంచనాతో విడుదల , ధర వివరాలు మీ కోసం....

English summary
Hero Xtreme 200S To Be Launched Soon In India — Is It A Bajaj Pulsar 200NS Rival?
Story first published: Monday, January 9, 2017, 19:17 [IST]
Please Wait while comments are loading...

Latest Photos