అప్‌డేటెడ్ ఆక్టివా 125 విడుదల: ధర మరియు ఇంజన్ వివరాలు

Written By:

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్‌‌ను 2017 మోడల్‌గా డిజైన్ మరియు సాంకేతికంగా ఇంజన్‌కు అప్‌గ్రేడ్స్ నిర్వహించి విపణిలోకి విడుదల చేసింది. ఈ 2017 హోండా ఆక్టివా 125 ధర రూ. 56,954 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు ప్రకటించింది.

గతంలో రెండు వేరియంట్లలో ఉన్న ఈ స్కూటర్ ఇప్పుడు మూడు వేరియంట్లతో భర్తీ అయ్యింది. మునుపటి వేరియంట్ కన్నా ఇందులో మరిన్ని ఫీచర్లు మరియు ఇంజన్‌కు మార్పులు చేర్పులు చేయబడ్డాయి.

మధ్య స్థాయి వేరియంట్లో అల్లాయ్ వీల్స్ మరియు సాధారణ డ్రమ్ బ్రేకులున్నాయి. ఇక అన్ని వేరియంట్లలో కూడా స్టాండర్డ్ ఫీచర్‌గా కాంబి బ్రేక్ సిస్టమ్ కలదు.

వేరియంట్ల వారీగా ధర వివరాలు

  • స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 56,954 లు
  • అల్లాయ్ వీల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 58,900 లు
  • అల్లాయ్ వీల్ డిస్క్ బ్రే వేరియంట్ ధర రూ. 61,362 లు

2017 హోండా ఆక్టివా 125 ఇంజన్ వివరాలు

హోండా ఆక్టివా లో 125సీసీ సామర్థ్యం ఉన్న హోండా ఇకో టెక్నాలజీ పరిజ్ఞానం జోడింపుతో అభివృద్ది చేసి బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే విధంగా డిజైన్ చేయబడిన ఇంజన్‌ను పరిచయం చేయడం జరిగింది.

సరికొత్త 2017 ఆక్టివా 125 లోని శక్తివంతమైన ఇంజన్ 6,500ఆర్‌పిఎమ్ వద్ద 8.25బిహెచ్‌పి పవర్ మరియు 5,000ఆర్‌పిఎమ్ వద్ద 10.54ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ గల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ పేటెంట్ హక్కులను పొందిన ఈక్విలైజర్ సిస్టమ్‌ అనుసంధానం గల కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఇందులో కల్పిచింది. ఈ ఫీచర్ ద్వారా బ్రేకులను ప్రెస్ చేసినపుడు ముందు మరియు వెనుక చక్రాల మీద సమానమైన బలం ప్రయోగించబడి తక్కువ దూరంలోనే స్కూటర్ ఆగుతుంది.

అంతే కాకుండా, ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, పొడవాటి మరియు వెడల్పాటి సౌకర్యవంతమైన సీటు, మరియు ఎక్కువ పరిమాణంలో(12- అంగుళాల) ఉన్న ముందు చక్రం కలదు.

డిజైన్ పరంగా స్వల్ప మార్పులు సంభవించాయి. స్థానం మారిన అధునాతన ఎల్ఇడి లైట్లు, వీటిని విభజించే క్రోమ్ పట్టీ చాలా ఆకర్షణీయంగా ఉంది. మునుపటి కన్నా ఎక్కువ పరిమాణంలో త్రీడి ఆకారంలో ఉన్న హోండా బ్యాడ్జిని అందివ్వడం జరిగింది.

సరికొత్త హోండా ఆక్టివా 125 ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి,

  • పర్ల్ అమేజింగ్ వైట్,
  • మిడ్ నైట్ బ్లూ మెటాలిక్,
  • బ్లాక్,
  • రెబల్ రెడ్ మెటాలిక్ మరియు
  • మ్యాట్ క్రస్ట్ మెటాలిక్

అప్రిలియా సంస్థ విపణిలోకి ఎస్ఆర్ 150 రేస్ ఎడిషన్ స్కూటర్ ను విడుదల చేసింది. క్రింది గ్యాలరీ ద్వారా ఫోటోలను వీక్షించగలరు....

 

Read more on: #హోండా #honda
English summary
Honda Activa 125 Launched In India; Prices Start At Rs 56,954
Story first published: Thursday, February 9, 2017, 19:29 [IST]
Please Wait while comments are loading...

Latest Photos