హార్నెట్ మరియు యూనికార్న్ బైకులను రీకాల్ చేసిన హోండా

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా దేశీయంగా ఉన్న సిబి యూనికార్న్ 160 మరియు సిబి హార్నెట్ 160ఆర్ మోటార్ సైకిళ్లను రీకాల్ చేసింది. ఈ రెండు బైకుల్లోని ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌‌లో ఉన్న క్లాక్

పనిచేయకపోవడంతో వీటిని వెనక్కి పిలిచినట్లు హోండా ఆధికారికంగా ప్రకటించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
హోండా హార్నెట్ మరియు యూనికార్న్ బైకుల రీకాల్

కొంత మంది కస్టమర్లు తాము కొనుగోలు చేసిన సిబి యూనికార్న్ 160 మరియు సిబి హార్నెట్ 160 ఆర్ మోటార్ సైకిళ్లలో ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో ఉన్న గడియారం పనిచేయడం లేదని హోండాకు ఫిర్యాదు చేశారు.

Recommended Video
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
హోండా హార్నెట్ మరియు యూనికార్న్ బైకుల రీకాల్

ఎక్కువ మంది కస్టమర్లు ఇదే సమస్య మీద ఫిర్యాదు చేస్తుండటంతో సమస్యను పరిష్కరించడానికి ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు హోండా వెల్లడించింది. హార్నెట్ మరియు యూనికార్న్ కస్టమర్లు తమ మోటార్ సైకిళ్లను సమీప డీలర్ల వద్ద ఉచితంగా చెక్ చేయించుకోవచ్చని హోండా పేర్కొంది.

హోండా హార్నెట్ మరియు యూనికార్న్ బైకుల రీకాల్

కాబట్టి, మీరు కొన్న సిబి యూనికార్న్ 160 లేదా సిబి హార్నెట్ 160 ఆర్ మోటార్ సైకిళ్లలో గడియారం పనిచేయకపోతే ఇప్పుడు మీకు దగ్గరలోని హోండా సర్వీస్ సెంటర్‌లో చెక్ చేయించుకోండి. వారంటీ ఆధారంగా ఈ రెండు బైకుల్లో డిజిటల్ మీటర్‌ను పూర్తిగే మార్చేసే అవకాశం కూడా ఉంది.

హోండా హార్నెట్ మరియు యూనికార్న్ బైకుల రీకాల్

రీకాల్‌కు గురైన మోటార్ సైకిళ్ల వివరాలను కస్టమర్లు తెలుసుకునేందుకు హోండా తమ అఫీషియల్ వెబ్‌సైట్‌ను అప్‌డేట్ చేసింది. కస్టమర్లు తమ బైకు యొక్క వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లేదా ఫ్రేమ్ నెంబర్ ఎంటర్ చేసి రీకాల్ జాబితాలో తమ బైకు ఉందో లేదే చూసుకోవచ్చు.

హోండా హార్నెట్ మరియు యూనికార్న్ బైకుల రీకాల్

నాణ్యత మరియు సర్వీస్‌లో రాజీపడకుండా కస్టమర్లకు అత్యుత్తమ సేవలందించడానికి హోండా ప్రణాళికాబద్దంగా వీటిని రీకాల్ చేసినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా తమ రెండు మోడళ్లలో ఎదురైన అతి చిన్న సమస్య(ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో సరిగ్గా పనిచేయని క్లాక్ ) కారణంగా రీకాల్ చేసింది. దీంతో హోండా తమ ఉత్పత్తుల క్వాలిటీ మరియు కస్టమర్ల సంతృప్తికి ఎంతటి ప్రధాన్యతనిస్తోందో స్పష్టంగా తెలుస్తోంది.

English summary
Read In Telugu: Honda Recalls CB Hornet 160R And CB Unicorn 160
Story first published: Thursday, August 3, 2017, 17:50 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark