ఒక్క నెలలో లక్ష షైన్ బైకులను కొనుగోలు చేశారు

Written By:

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో 125సీసీ సెగ్మెంట్ నానాటికీ ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఇందులో హోండా షైన్ పాత్ర అతి ముఖ్యమైనది. ఇండియన్ మార్కెట్లోనే కాదు ప్రపంచ 125సీసీ సెగ్మెంట్ వారీగా చూసుకున్నా కూడా హోండా షైన్ ప్రథమ స్థానంలో ఉంది.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

దేశీయ విపణిలో 125సీసీ సెగ్మెంట్లో అత్యుత్తమ విక్రయాలు సాధించి మొదటి స్థానంలో నిలిచిన హోండా షైన్ ఇప్పుడు మరో అరుదైన మైలురాయిని సాధించింది. కేవలం ఒక్క నెలలో లక్షకు పైగా విక్రయాలు సాధించింది.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

దేశీయంగా 125సీసీ సెగ్మెంట్లో ఒక్క నెలలో లక్షకు పైగా విక్రయాలు సాధించిన మొట్టమొదటి మోటార్ సైకిల్ ఈ హోండా షైన్. 51 శాతం వృద్దిని నమోదు చేసుకుని గడిచిన ఏప్రిల్ 2017 లో ఏకంగా 1,00,824 యూనిట్లను విక్రయించింది.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

125సీసీ సెగ్మెంట్లో షైన్ మాత్రమే కాదు, పోటీగా అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. మరి వాటన్నింటిన కాదని షైన్‌ను విపరీతంగా ఎంచుకోవడానికి కారణమేంటో తెలుసా? ఈ అంశం మీద దృష్టి సారిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూసాయి.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

హోండా ఎకో టెక్నాలజీ పరిజ్ఞానంతో ఉన్న బిఎస్-IV 125సీసీ ఇంజన్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచర్ అదే విధంగా షైన్‌కు కొనసాగింపుగా వచ్చిన సిబిషైన్ ఎస్‌పి మోడల్‌లో తక్కువ జారుడు స్వభావం ఉన్న టైర్లను అందివ్వడం.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

ఇండియన్ 125సీసీ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో సిబి షైన్ మోటార్ సైకిల్ ఐదు రెట్లు వేగంతో వృద్ది చెందుతోంది. 125సీసీ సెగ్మెంట్‌ను శాసిస్తున్న హోండా షైన్ ఒక ఏడాది ఫలితాలను తీసుకుంటే మొత్తం టూ వీలర్ మార్కెట్‌లో 15 శాతం మార్కెట్ వాటాను సాధించింది.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

హోండా ఈ సిబి షైన్ బైకును తొలిసారిగా 2006లో మార్కెట్లోకి విడుదల చేసింది. ఇప్పుడు వరకు 55 లక్షల కస్టమర్లు దీనిని ఎంచుకున్నారు. హోండా టూ వీలర్స్ ఇండియా విభాగంలో షైన్ బ్రాండ్ ఇప్పుడు అతి ప్రధానమైనది.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

ఒక దశాబ్దం పాటు తిరుగులేని విజయం సాధించిన హోండా షైన్ ఇప్పుడు హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఫోర్ట్ ఫోలియోలో అతి ముఖ్యమైన మోటార్ సైకిల్ బ్రాండ్ అని కంపెనీ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్విందర్ సింగ్ గులేరియా వెల్లడించారు.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

నిరంతర ఆవిష్కరణ ద్వారా అప్‌డేట్స్‌తో అందుబాటులోకి వస్తున్న షైన్ ఒక్క వేరియంట్ హోండా మోటార్ సైకిల్ విభాగంలో 55శాతం విక్రయాలను సాధించిపెడుతోందని ఆయన వెల్లడించారు.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

అధిక నాణ్యత మరియు విశ్వసనీయత కారణంగా ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో భారీ సంఖ్యలో హోండా షైన్ 125సీసీ మోటార్ సైకిల్‌ను ఎంచుకుంటున్నారని గులేరియా పేర్కొన్నారు.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

హోండా సాంకేతికంగా సిబి షైన్‌లో 125సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ అందించింది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 10బిహెచ్‌పి పవర్ మరియు 11ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

హోండా షైన్ ఆరు విభిన్న రంగుల్లో లభించును. అవి, బ్లాక్, జెనీ గ్రే మెటాలిక్, మ్యాపిల్ బ్రౌన్ మెటాలిక్, రెబల్ రెడ్ మెటాలిక్, స్పోర్ట్స్ రెడ్ మరియు పర్ల్ అమేజింగ్ వైట్.

హోండా సిబి షైన్ 125 రికార్డ్ సేల్స్

డ్రమ్, డిస్క్ మరియు సిబిఎస్ అనే మూడు వేరియంట్లలో లభించే షైన్ ప్రారంభ వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ ధర రూ. 67,714 లు గా ఉంది.

Read more on: #హోండా #honda
English summary
Read In Telugu Honda CB Shine Creates New Record
Story first published: Thursday, May 25, 2017, 12:31 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark