హోండా సిబి షైన్ భారీ రికార్డ్: 50 లక్షల విక్రయాలు

Written By:

హోండా టూ వీలర్స్ సంస్థకు చెందిన రాజస్థాన్ లోని తపుకరా ప్లాంటులో 50 లక్షల వ యూనిట్‌ను ఉత్పత్తి చేసింది. అత్యంధిక అమ్మకాలు మరియు ఉత్పత్తి గావింపబడుతున్న 125సీసీ మోటార్ సైకిల్‌గా హోండా సిబి షైన్ మొదటి స్థానంలో నిలిచింది.

బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఫీచర్‌ పరిచయం చేస్తూ హోండా 2017 హోండా సిబి షైన్ విడుదల చేసిన వేదిక మీద ఈ వివరాలను వెల్లడించింది.

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయంగా 125సీసీ బైకు ప్రొడక్షన్ ను ప్రారంభించినప్పటి నుండి 50 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేసినట్లు తెలిసింది, మరియు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ మరియు అత్యధిక అమ్మకాలు సాగిస్తున్న ఉత్పత్తిగా మొదటి స్థానంలో నిలిచింది.

జపాన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఈ సిబి షైన్ మోటార్ సైకిల్‌ను 2006 లో దేశీయ విపణిలోకి విడుదల చేసింది. అప్పటి నుండి భారీ అమ్మకాలు సాధిస్తూ వస్తోంది.

2008-09 మధ్య కాలంలో భారత దేశపు ఏకైక 125 సీసీ మోటార్ సైకిల్‌గా అత్యుత్తమ విక్రయాలు సాధించింది. తరువాత రెండేళ్ల పాటు పోటీ అనేది ఎరుగకుండా విక్రయాల్లో నిలిచింది.

నూతన సిబి షైన్ విడుదల వేదిక మీద సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సేల్స్ మరియు మార్కెటింగ్ వై.ఎస్ గులేరియా మాట్లాడుతూ, కస్టమర్లన నుండి భారీ వచ్చిన స్పందనకు సంతోషిస్తున్నామని తెలిపాడు. 125సీసీ సెగ్మెంట్లో అత్యుత్తమ మోటార్ సైకిల్‌గా నిలిచిందని తెలిపాడు.

సుమారుగా దశాబ్ద కాలం నుండి హోండా సిబి షైన్ ఇండియన్ 125సీసీ సెగ్మెంట్లో ప్రభంజననాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం హోండా ఇండియా లైనప్‌లో షైన్ అతి ముఖ్యమైన ఉత్పత్తి అని ఆయన పేర్కొన్నాడు. ఈ సిబి షైన్ ఆధారంగానే సిబి షైన్ ఎస్‌పి మోడల్ ను కూడా అభివృద్ది చేసినట్లు చెప్పుకొచ్చారు.

హోండా సిబి షైన అక్టోబర్ 2010 నాటికి 10 లక్షల యూనిట్లు, విడుదలైన 54 నెలలో పది లక్షల అమ్మకాలు నమోదయ్యాయి. మరియు తరువాత నాలుగు సంవత్సరాలకు 2014 నాటికి 20 లక్షల యూనట్ల మైలురాయిని చేధించింది.

ప్రస్తుతం 2017 హోండా సిబి షైన్ మోటార్ సైకిల్‌లో 124.73సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 10.16బిహెచ్‌పి పవర్ మరియు 10.30ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

ప్రస్తుతం సరికొత్త షైన్ అథ్లెటిక్ బ్లూ, మెటాలిక్ మరియు ఇంపీరియర్ రెడ్ మెటాలిక్ రంగుల మేళవింపుతో అందుబాటులో ఉంది.

 

Read more on: #హోండా #honda
English summary
Honda CB Shine Hits An Impressive Milestone — Creates A Record
Story first published: Saturday, February 4, 2017, 17:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos