TVS XL శకానికి హోండా క్లిక్ స్కూటర్ ముగింపు పలుకుతుందా?

Written By:

రూరల్ కస్టమర్లను టార్గెట్ చేస్తూ హోండా మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి క్లిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. రూ. 42,499 ల ప్రారంభ ధరతో విడుదలైన క్లిక్ స్కూటర్‌ ఇప్పుడు టీఎవీఎస్ ఎక్స్ఎల్ టూ వీలర్‌కు గట్టిపోటీనిస్తోంది.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

దేశీయంగా స్కూటర్ల విక్రయాల్లో హెండా సంస్థ అగ్రస్థానంలో ఉంది. ఒక కాలం నాటి బజాజ్ చేతక్ మరియు ప్రియా స్కూటర్లకు ధీటుగా వచ్చిన గేర్‌లెస్ స్కూటర్లు దేశీయ స్కూటర్ల మార్కెట్ ముఖ చిత్రాన్నే మార్చేశాయి.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

అందుకు నిదర్శనం హోండా ప్రవేశపెట్టిన హోండా ఆక్టివా మరియు ఇతర శ్రేణి స్కూటర్లు. స్కూటర్లను సౌకర్యవంతంగా, సులభంగా వినియోగించవచ్చు. పల్లె మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా స్కూటర్లే కీలక పాత్ర పోషిస్తున్నాయి. దీనిని అవకాశంగా చేసుకుని హోండా ఇప్పుడు కొత్త స్కూటర్ల ఉత్పత్తి మీద దృష్టి పెట్టింది.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

హోండా అభివృద్ది చేసిన ఆక్టివా ఫ్లాట్‌ఫామ్ చాలా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఇదే ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా మరిన్ని ఉత్పత్తులను అభివృద్ది చేసింది. ప్రత్యేకించి ప్రాంతీయ కస్టమర్ల కోసం అతి తక్కువ ధరలో ఆక్టివా నుండి సేకరించిన అనేక లక్షణాలతో క్లిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

అన్ని అంశాల పరంగా చూసుకుంటే క్లిక్ స్కూటర్ విపణిలో విస్పోటనం అనే చెప్పాలి. అడ్వెంచర్ శైలిలో, ఫంకీ లుక్‌లో ఫస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లతో విభిన్న శైలిలో అన్ని రకాల కస్టమర్లను టార్గెట్ చేసే విధంగా క్లిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

ప్రాంతీయంగా చూసుకుంటే 100 నుండి 125సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిళ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు కస్టమర్లు. ఖచ్చితంగా చెప్పాలంటే చిన్న చిన్న యుటిలిటి అవసరాలకు ఇలాంటి బైకులు ఏ మాత్రం ఉపయోగపడవు. దీనిని దృష్టిలో ఉంచుకుని నవీ టూ వీలర్ డిజైన్ లక్షణాలతో ఆక్టివా ఇంజన్ జోడింపుతో క్లిక్ ను రూపొందించింది హోండా.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

చిన్న మొత్తంలో సరుకులను రవాణా చేయడానికి, మరియు చిన్న పాటి వ్యాపారాలకు అనువుగా ఉండే టీవీస్ ఎక్స్ఎల్ ను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. మరి హోండా విడుదల చేసిన క్లిక్ స్కూటర్ టీవీఎస్ ఎక్స్ఎల్ స్థానాన్ని భర్తీ చేస్తుందా అంటే అవుననే చెప్పాలి.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

కానీ మీడియా వర్గాలు మాత్రం క్లిక్ విడుదల కాగానే, టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 కు గట్టి పోటీ అని కథనాలు రాశాయి. స్కూటీ జెస్ట్ కన్నా క్లిక్ ధర రూ. 4,000 తక్కువ ధరకే అందుబాటులో ఉంది. కానీ ఇది పెద్ద వ్యత్యాసం చూపదు. ఎందుకంటే TVS XL 100 మోపెడ్ మీద దృష్టి పెట్టి క్లిక్‌ను ఆవిష్కరించింది కాబట్టి.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

ప్రస్తుతం దేశీయంగా ఉన్న చిన్న మోపెడ్‌లలో, ఏకైక మోపెడ్ టీవీఎస్ వారి ఎక్స్ఎల్. నిజమే, రైతులు, పాల వ్యాపారస్తులు, కొరియర్ మరియు పార్శిల్ డెలివరీ, చిన్న కిరాణా దుకాణాదారులు వంటి అనేక మంది రోజూవారీ నిత్యావసరాలకు TVS XL ఉపయోగించుకుంటున్నారు.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

కొన్ని దశాబ్దాల పాటు టీవీఎస్ ఎక్స్ఎల్ ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఒకప్పుడు 50సీసీ సామర్థ్యం ఉన్న 2-స్ట్రోక్ ఇంజన్‌తో పరిచయమై, అనేక అప్‌గ్రేడ్స్‌తో మార్పులకు గురయ్యి, ఇప్పుడు 100సీసీ సామర్థ్యం గల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికీ ఎక్స్ఎల్ కు సరైన పోటీ లేదు.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

ఎక్స్ఎల్ మీద టార్గెట్ చేస్తూనే హోండా క్లిక్ ను విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది. టీవీఎస్ ఎక్స్ఎల్ శకానికి ముగింపు పలికే ప్రధానమైన అంశాలను చూద్దాం రండి: క్లిక్ స్కూటర్‌లో ఆక్టివా నుండి సేకరించిన 110సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫ్యాన్‌ ద్వారా చల్లబడే ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.8ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

టీవీఎస్ ఎక్స్ఎల్ 100 టూ వీలర్ ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 99.7సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సాధారణ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 3.7బిహెచ్‌పి పవర్ మరియు 3.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. క్లిక్ స్కూటర్‌తో పోల్చుకుంటే ఇది 10సీసీ తక్కువగానే ఉంది, దీనికంటే ఎక్కువ పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

రెండు టూ వీలర్లను కూడా చిన్న స్థాయి లోడ్ ట్రాన్స్‌పోర్టర్లతో పోల్చుతున్నాం కాబట్టి, క్లిక్ స్కూటర్‌లో అండర్ సీట్ స్టోరేజ్ కలదు మరియు విశాలమైన ఫుట్ బోర్డ్ ఉంది. ఎక్స్ఎల్ విషయానికి అండర్ సీట్ స్టోరేజ్ లేకపోవడంతో పాటు ఫుట్ బోర్డ్ చాలా చిన్నగా ఉంటుంది. ఈ విషయంలో కూడా క్లిక్ స్కూటర్ బెస్ట్ అని నిరూపించబడింది.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్‌కు వ్యతిరేకంగా రాస్తునందుకు మమ్మల్ని ఆపార్థం చేసుకోకండి. ఇప్పటికీ టీవీఎస్ ఎక్స్ఎల్ కు ప్రత్యామ్నాయ టూ వీలర్లు ఏవీ లేవు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్స్ఎల్ స్థానంలో ఆక్టివాను అధికంగా ఎంచుకుంటున్నారు.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

ఆక్టివా కాకుండా మరేదైనా ఇతర స్కూటర్ ఎంచుకోవాలనుకునే వారికి ఎలాంటి ఆప్షన్ లేదు. అయితే ఉన్నదల్లా టీవీఎస్ స్కూటీ జెస్ట్ మాత్రమే. ఎందుకంటే ఆక్టివా కన్నా దీని ధర ఎనిమిది వేల రుపాయలు వరకు తక్కువగానే ఉండటం.

TVS XL వర్సెస్ హోండా క్లిక్

అత్యుత్తమ ఇంజన్ మరియు ఫీచర్లను కలిగిన క్లిక్ ఆక్టివా కన్నా 12 వేలు మరియు స్కూటీ జెస్ట్ కన్నా 8 వేల రుపాయల తక్కువ ధరతో లభిస్తోంది. కాబట్టి ఖచ్చితంగా టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్‌కు హోండా క్లిక్ ఖచ్చితమైన పోటీ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. పల్లె మరియు పట్టణ ప్రాంతాల్లో క్లిక్ స్కూటర్‌కు ప్రజలు పట్టం కడితే, రికార్డులు తారుమారు కావడం గ్యారంటీ.

English summary
Read In Telugu Will The Honda Cliq Be Able To End The TVS XL Legacy?
Story first published: Saturday, June 24, 2017, 13:40 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark