బిఎస్-IV 2017 హోండా లివో విడుదల: ధర, ఇంజన్, మైలేజ్ మరియు ఇతర వివరాలు

Written By:

హోండా స్కూటర్ అండ్ మోటార్ సైకిల్స్ ఇండియా లిమిటెడ్ దేశీయంగా టూ వీలర్ మార్కెట్లోకి తమ లివో బైకులో విఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ ఫీచక్ జోడించి సరికొత్త 2017 హోండా లివో బైకును విడుదల చేసింది.

బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో 2017 హోండా లివో విడుదల

నూతనంగా విడుదల చేసిన హోండా లివో బిఎస్-IV డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 54,331 లు మరియు డిస్క్ బ్రేక్ వేరియంట్ లివో ధర రూ. 56,834 లు, రెండు ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో 2017 హోండా లివో విడుదల

సరికొత్త 2017 హోండా లివో బైకులో తక్కువ రెసిస్టెన్స్ ఉన్న హెచ్ఇటి టైర్లు, నిస్సాన్ కాలిపర్ గల ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేకు మరియు మెయింటెనెన్స్ రహిత బ్యాటరీ కలవు.

బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో 2017 హోండా లివో విడుదల

2017 లివో లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఐదు దశలలో అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉన్న డ్యూయల్ రియర్ షాక్ అబ్జార్వర్లు కలవు.

బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో 2017 హోండా లివో విడుదల

సాంకేతికంగా 2017 లివో బైకులో 109.19సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు.

బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో 2017 హోండా లివో విడుదల

ఈ ఇంజన్‌కు అనుసంధానం చేసిన 4-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ ద్వారా ఇంజన్ ఉత్పత్తి చేసే 8.31బిహెచ్‌పి పవర్ మరియు 9.09ఎన్ఎమ్ గరిష్ట టార్క్ వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో 2017 హోండా లివో విడుదల

మీరు 2017 బిఎస్-IV అప్‌గ్రేడెజ్ లివో బైకును ఆరు విభిన్నమైన రంగుల్లో ఎంచుకోవచ్చు.అవి, సన్‌సెట్ బ్రౌన్ మెటాలిక్, అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, బ్లాక్, పర్ల్ అమేజింగ్ వైట్, ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ మరియు మట్టీ యాక్సిస్ గ్రే మెటాలిక్.

బిఎస్-IV అప్‌గ్రేడ్స్‌తో 2017 హోండా లివో విడుదల

2017 లివోలో ముందు మరియు వెనుక వైపున 130ఎమ్ఎమ్ చుట్టుకొలత గల డ్రమ్ బ్రేకులు కలవు, మరియు ఆప్షనల్ డిస్క్ బ్రేక్ వేరియంట్లో 240ఎమ్ఎమ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ కలదు. లివో మొత్తం బరువు 111 కిలోలుగా ఉంది.

English summary
Read In Telugu to know about 2017 Honda Livo With BS-IV Engine Launched In India — Prices Start At Rs 54,331
Story first published: Friday, April 14, 2017, 13:09 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark