50 ఏళ్లు పూర్తి చేసుకున్న హోండా మంకీ బైకు

Written By:

హోండా ద్విచక్ర వాహన తయారీ సంస్థ ప్రపంచానికి తమ మంకీ బైకును పరిచయం చేసిన సందర్భంగా 50వ వార్షికోత్సవ ఎడిషన్ మంకీ బైకును తయారు చేసింది. అసలైన మంకీ బైకును పోలి ఉండేలా ఈ లిమిటెడ్ ఎడిషన్ మంకీ బైకును తయారుచేసింది. దీని గురించి పూర్తి వివరాలు....

హోండా ఈ లిమిటెడ్ ఎడిషన్ మంకీ బైకు ఎక్ట్సీరియర్ మీద సన్‌బీమ్ వైట్ కలర్ ఆప్షన్‌ అందివ్వడం జరిగింది. మరియు విభిన్నమైన స్పోర్టివ్ 3డీ చిహ్నాన్ని అందించింది.

హోండా ఈ 50 వ వార్షికోత్సవ మంకీ బైకును జపాన్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ బైకులో 49సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానంతో అందించింది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 3.35బిహెచ్‌పి పవర్ మరియు 3.4ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. 145ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ గల ఈ బైకు మొత్తం బరువు 68కిలోలుగా ఉంది.

హోండా ఈ లిమిటెడ్ ఎడిషన్ 50 వ వార్షికోత్సవ మంకీ బైకులోని ముందు మరియు వెనుక వైపున్న మడ్ గార్డ్(ముందు మరియు వెనుక టైర్ల మీద ఉన్న అర్ధ వృత్తాకార రేకు భాగాలు)లను షాస్తా వైట్ కలర్‌లో, అదే విధంగా ప్రేమ్, ఫ్రంట్ ఫోర్క్, స్వింగ్ ఆర్మ్, హెడ్ లైట్ కేస్, ఇంధన ట్యాంకు మధ్య భాగంలో ఉన్న స్ట్రిప్‌లను మాగ్నా రెడ్ కలర్‌లో అందివ్వడం జరిగింది.

50 ఏళ్ల వార్షికోత్సవ ఎడిషన్ మంకీ బైకుగా 50 ఏళ్ల యానివర్శరీ ఎడిషన్‌ను సూచించే చిహ్నాన్ని ఇంధన ట్యాంకు మీద, సీటుకు వెనుక భాగంలో, ఇంజన్ స్టార్ట్ కీ మీద ప్రధానంగా అందివ్వడం జరిగింది.

లిమిటెడ్ ఎడిషన్ హోండా మంకీ బైకు పొడవు 1365ఎమ్ఎమ్, వెడల్పు 600ఎమ్ఎమ్, ఎత్తు 850ఎమ్ఎమ్ గా ఉంది. హోండా టూ వీలర్స్ సంస్థ ఈ యానివర్సరీ ఎడిషన్ మంకీ బైకులను కేవలం 1,800 యూనిట్లుగా మాత్రమే ఉత్పత్తి చేస్తోంది.

50 వ వార్షికోత్సవ లిమిటెడ్ ఎడిషన్ మంకీ బైకు ధర జపాన్‌లో జెపివై 3,52,080 లుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో దీని ధర సుమారుగా రూ. 2,07,296 లుగా ఉంది.

హోండా లిమిటెడ్ ఎడిషన్ మంకీ బైకు....

హోండా లిమిటెడ్ ఎడిషన్ మంకీ బైకు....

హోండా లిమిటెడ్ ఎడిషన్ మంకీ బైకు....

బిఎమ్‌డబ్ల్యూ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీలెవల్ స్పోర్ట్స్ బైకును విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంటోంది. దీనికి చెందిన ఫోటోల కోసం క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి....

 

Read more on: #హోండా #honda
English summary
No Monkey Business This — Honda Celebrates 50th Birthday Of A Very Iconic Bike
Story first published: Saturday, March 4, 2017, 15:33 [IST]
Please Wait while comments are loading...

Latest Photos