నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌లను విడుదల చేసిన హోండా

Written By:

దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలోకి హోండా విడుదల చేసిన నవీ క్రాసోవర్ స్కూటర్ మంచి పాపులారిటీని పొందింది. అయితే ఈ విజయానికి కొనసాగింపుగా హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా విపణిలోకి నవీ క్రోమ్ మరియు అడ్వెంచర్ ఎడిషన్ ఉత్పత్తులను విడుదల చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌
  • నవీ క్రోమ్ ఎడిషన్ ధర రూ. 44,713 లు
  • నవీ అడ్వెంచర్ ఎడిషన్ ధర రూ. 48,173 లు

రెండు ధరలు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి.

నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌

హోండా నవీలోని క్రోమ్ మరియు అడ్వెంచర్ ఎడిషన్ మోటార్ సైకిళ్లలో 109.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది 7,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 8.83ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడం జరిగింది.

నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌

హోండా టూ వీలర్స్ నవీ అడ్వెంచర్ ఎడిషన్ లో కస్టమైజేషన్ కిట్, నకుల్ గార్డ్ సెట్, ఆర్ఆర్ గ్రిప్, అండర్ గార్డ్, అడ్వెంచర్ స్ట్రిప్, హెడ్ లైట్ ప్రొటెక్టర్, అడ్వెంచర్ విజర్ మరియు సీట్ కవర్‌లతో పాటు లగేజ్ బాక్స్ ను అందించింది.

నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌

హోండా తమ నవీ క్రోమ్ ఎడిషన్ లో హెడ్ లైట్ ప్రొటెక్టర్ మరియు కవర్, లగేజ్ బాక్స్, అండర్ గార్డ్ మరియు రియర్ గ్రిప్ హ్యాండిల్‌తో పాటు బాడీ మీద క్రోమ్ సొబగులను అందించింది.

నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌

ప్రస్తుతం హోండా నవీ క్రోమ్ మరియు అడ్వెంచర్ ఎడిషన్ రెండూ కూడా కేవలం బ్లాక్ కలర్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 1,000 లతో హోండా డీలర్ల వద్ద లేదా నవీ కోసం హోండా అభివృద్ది చేసిన ప్రత్యేక యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌

హోండా టూ వీలర్స్ ఇండియా ఈ నవీ బైకును తొలుత 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వాహన ప్రదర్శన వేదిక మీద ప్రదర్శించబడింది. ఫిబ్రవరి నుండి బుకింగ్స్ ప్రారంభించినప్పటికీ వీటిని ఏప్రిల్ నుండి డెలివరీ ఇచ్చింది.

నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌

ప్రారంభంలో నెలకు 2,000 యూనిట్ల నవీ బైకులను అమ్మాలని లక్ష్యంతో పెట్టుకున్న హోండా టూ వీలర్స్, విడుదలైనప్పటి నుండి అక్టోబర్ 2016 నాటికి 50,000 సేల్స్ మార్క్‌ని దాటింది. ఊహించిన ఫలితాలను అందుకున్న తరుణంలో హోండా ఈ రెండు ప్రత్యేక ఎడిషన్‌లను విడుదల చేసింది.

నవీ అడ్వెంచర్ మరియు క్రోమ్ ఎడిషన్‌

హోండా టూ వీలర్స్ ఇండియా ఈ నవీ బైకును శ్రీలంక మరియు నేపాల్ ‌కు ఎగుమతి చేయడం ప్రారంభించింది. త్వరలో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయాలనే ఆలోచనలో హోండా ఉంది.

Read more on: #హోండా #honda
English summary
Honda Navi Adventure And Chrome Edition Launched In India; Prices Start At Rs 44,713
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark