అతి త్వరలో హోండా విడుదల చేయనున్న కొత్త స్కూటర్

Written By:

హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా విపణిలోకి నూతన స్కూటర్ విడుదల చేయడానికి సిద్దమవుతోంది. భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు భారత్ స్టేజ్ - IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను విడుదల చేసే పనిలో హోండా నిమగ్నమయ్యింది. అంతే కాకుండా ఈ నూతన స్కూటర్‌లో ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ కూడా రానుంది.

బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ జోడింపుతో హోండా విడుదల చేస్తున్న మొట్టమొదటి స్కూటర్ ఇదే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టూ వీలర్ల తయారీ సంస్థలు తమ అన్ని మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్లలో మార్చి 31, 2017 నుండి బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్‌ను తప్పనసరి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కార్అండ్‌బైక్ బృందం తెలిపిన వివరాల మేరకు హోండా తమ నూతన స్కూటర్ విడుదలకు సంభందించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదని తెలిసింది. అయితే హెచ్ఎమ్ఎస్ఐ అధికారుల తెలిపిన వివరాలు మేరకు ఫిబ్రవరి 2017 నూతన స్కూటర్ విడుదల ఉంటుందని తెలిసింది.

హోండా టూ వీలర్స్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యడ్వీందర్ గులేరియా మాట్లాడుతూ, హోండా అతి త్వరలో ఆశ్చర్యకరమైన స్కూటర్ విడుదల చేయడానికి సిద్దం అవుతోంది. ప్రస్తుతానికి దీనికి సంభందించిన ఎలాంటి సమాచారం వెల్లడించం, అయితే దీని విడుదల కోసం ఎదురు చూడండి అంటూ ఓ వేడుకలో తెలిపాడు.

ప్రస్తుతం హోండా తమ ప్రొడక్షన్ ప్లాంటులో ఎప్పటిలాగే తమ ఆక్టివా స్కూటర్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన గడువు వరకు మాత్రమే పాత ఉద్గార నియమాలను పాటించే స్కూటర్లను అమ్మవచ్చు. ఆ తరువాత అమ్మడం కుదరదు. దీని గురించి ప్రశ్నించగా, ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్న మునుపటి తరం స్కూటర్లను పూర్తిగా విక్రయించిన అనంతరం నూతన వాటిని ప్రవేశపెట్టనున్నట్లు హోండా ప్రకటించింది.

గులేరియా మాట్లాడుతూ, మార్చి 31 లోపు తమ లైనప్‌లో ఉన్న అన్ని మోడళ్లలో కూడా బిఎస్-IV ఇంజన్ మరియు ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ జోడించి గడువు లోగా మార్కెట్లోకి ప్రవేశపెడతామని నమ్మకం వ్యక్తం చేసాడు.

మరిన్ని తాజా ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి డ్రైవ్‌స్పార్క్ తెలుగు..... బజాజ్ గత ఏడాది చివరిలో బిఎస్‌-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌తో డామినర్ 400 మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. ఫోటోల కోసం క్రింది గ్యాలరీని వీక్షించగలరు...

 

Read more on: #హోండా #honda
English summary
Honda Launching New Scooter With BS IV Engine
Story first published: Tuesday, February 7, 2017, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos