స్కూపీ స్కూటర్లు లేడీస్‌కు బెస్ట్ ఛాయిస్: ప్రైజ్, ఫీచర్స్ మరియు విడుదల వివరాలు

Written By:

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం హోండా ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త స్కూటర్‌ను విడుదల చేయడానికి సర్వం సిద్దం చేసుకుంది. నిజమే, హోండా టూ వీలర్స్ తాజాగా స్కూపీ స్కూటర్‌ను పరీక్షిస్తూ ఆటో మీడియా కంటబడింది.

హోండా స్కూపీ స్కూటర్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో....

హోండా స్కూపీ స్కూటర్

ఈ ఆర్థిక సంవత్సరంలో హోండా తమ స్కూపీ ఆటోమేటిక్ రెట్రో స్టైల్ స్కూటర్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. హోండా దీంతో పాటు నవీ టూ వీలర్ శైలిలో ఉన్న గ్రోమ్ బైకును కూడా హోండా పరీక్షిస్తోంది.

Recommended Video
Yamaha Launches Dark Night Variants | In Telugu - DriveSpark తెలుగు
హోండా స్కూపీ స్కూటర్

డార్క్ బ్లూ పెయింట్ కలర్ స్కీములో ఉన్న దీనిని స్పష్టంగా గుర్తించేలా, పబ్లిక్‌గా హోండా ప్రతినిధులు టెస్టింగ్ నిర్వహించారు. ఈ స్కూటర్‌లో అతి ముఖ్యమైన హైలైట్ ముందు భాగంలో ఉన్న పెద్ద హెడ్ ల్యాంప్.

హోండా స్కూపీ స్కూటర్

పాత కాలం నాటి డిజైన్ అంశాలను మళ్లీ ఇందులో పొందుపరిచేందుకు ప్రయత్నిస్తున్న హోండా హ్యాండిల్‌ బార్‌కు క్రింది వైపు అందించిన గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్‌కు ఇరువైపులా టర్న్ ఇండికేటర్లను మరియు రెండు వైపులా అల్లాయ్ వీల్స్ అందించింది.

హోండా స్కూపీ స్కూటర్

హోండా స్కూపీ స్కూటర్‌లో సాంకేతికంగా 110సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందివ్వనుంది. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

హోండా స్కూపీ స్కూటర్

హోండా ఈ ఇంజన్‌లో హోండా ఎకో టెక్నాలజీ(HET)ని అందించింది. క్రోమ్ పట్టీ ఉన్న రియర్ వ్యూవ్ మిర్రర్స్, డ్యూయల్ టోన్ బాడీ, ముందు వైపు డిస్క్ బ్రేక్, వెనుక వైపున డ్రమ్ బ్రేక్ మరియు ఆప్షనల్‌గా ఇరువైపులా డిస్క్ బ్రేక్ అందించే అవకాశం ఉంది.

హోండా స్కూపీ స్కూటర్

స్కూటర్‌కు చివర్లో చిన్న లగేజ్ బాక్స్ ఉంది, దీనిని కూడా ఆప్షనల్ యాక్ససరీగా అందించే ఛాన్స్ ఉంది.

హోండా స్కూపీ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

హోండా స్కూపీ స్కూటర్‌ను రూ. 55,000 ల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో 2018 ప్రారంభం నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. రెట్రో స్టైల్ స్కూటర్ యమహా ఫ్యాసినో మరియు యాక్సెస్125 లకు గట్టి పోటీనివ్వనుంది.

English summary
Read In Telugu: Honda Scoopy Spotted Testing In India
Please Wait while comments are loading...

Latest Photos