బుక్ చేసుకున్న బైక్ డెలివరీ ఆలస్యం చేసినందుకు డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

Written By:

ఓ కొనుగోలు దారుడు టూ వీలర్ బుక్ చేసుకున్నాడు, డెలివరీ ఇవ్వాల్సిన రోజు షోరూమ్‌కి వెళితే, ఏవో కారణాలు చెప్పి పంపేశారు. మళ్లీ ఎన్ని సార్లు వెళ్లినా తాను బుక్ చేసుకున్న బైకును డెలివరీ ఇవ్వడాన్ని షోరూమ్ నిర్వాహకుల జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో విసిగిపోయిన సదరు కస్టమర్ నాతోనే ఆడకుంటారా అంటూ సినిమా స్టైల్లో షోరూమ్ నిర్వాహకుల మీదకు తుపాకీ ఎక్కుపెట్టాడు.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

అదే షోరూమ్‌లో ఉన్న కొనుగోలుదారులు మరియు షోరూమ్‌లో పనిచేసే ఉద్యోగులంతా ఓ కస్టమర్ తుపాకీతో చేస్తున్న వీరంగానికి హతాశులయ్యారు. అందరినీ భయంబ్రాంతులకు గురిచేసిన ఈ సంఘన బెంగళూరు నగరానికి సమీపంలో ఉన్న కెంగేరిలో చోటు చేసుకుంది.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

వివరాల్లోకి వెళితే, మాజీ మిలిటరీ ఉద్యోగి ఒకరు కెంగేరిలోని శాటిలైట్ హోండ్ షోరూమ్‌లో బైకును బుక్ చేసుకున్నాడు. ఇచ్చిన డెలవరీ రోజు నాడు షోరూమ్‌ను సంప్రదిస్తే, ఎవో కారణాలు చెప్పి బైకు ఇవ్వకుండా ఆలస్యం చేసారు. కొద్ది రోజులుగా ఇదే తంతు జరిగింది.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

అయితే డీలర్ మీద తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎక్స్-మిలిటరీ ఉద్యోగి తన తుపాకీతో డీలర్ వద్దకు వెళ్లి, తన బైకును డెలివరీ ఇవ్వాలంటూ షోరూమ్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగాడు. ఈ తరుణంలో కోపోద్రిక్తుడైన కస్టమర్ వారి మీదకు తుపాకీ ఎక్కుపెట్టాడు.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

అయితే అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ మాజీ మిలిటరీ ఉద్యోగి నిర్వాహకుల మీదకు ఎక్కు పెట్టిన తుపాకీని క్రిందకు దించడానికి ప్రయత్నించాడు. ఎవ్వరు చెప్పినా వినని అతడు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లడంతో, దీని మీద దర్యాప్తు చేసిన పోలీసులు షోరూమ్ నిర్వాహకులు చేస్తున్న మోసంతో కంగుతిన్నారు. ఏప్రిల్ 1నుండి బిఎస్-3 టూ వీలర్ల విక్రయాలను సుప్రీం కోర్టు దేశవ్యాప్తంగా బ్యాన్ చేసినా కూడా ఇప్పటికీ అవే టూ వీలర్లను విక్రయిస్తూ పట్టుబడ్డారు.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

కెంగేరి లోని శాటిలైట్ హోండా టూ వీలర్ షోరూమ్ నిర్వాహకులు ఇప్పటి వరకు సుమారుగా 48 బిఎస్-3 టూ వీలర్లను విక్రయించినట్లు తెలిసింది. అయితే బ్యాన్ చేయడానికి ముందు ఈ టూ వీలర్లకు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ చేయించి, బ్యాన్ తరువాత కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లకు విక్రయించడం జరిగింది.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఉన్న టూ వీలర్లకు, శాస్వత రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి. ప్రస్తుతం బిఎస్-3 వెహికల్స్ రిజిస్ట్రేషన్ బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి, ఈ షోరూమ్ నుండి కొనుగోలు చేసిన బిఎస్-3 టూ వీలర్లకు రిజిస్ట్రేషన్ చేయించడం దాదాపు అసాధ్యమే.

టూ వీలర్ షోరూమ్‌లో డీలర్ మీద తుపాకీ ఎక్కుపెట్టిన కస్టమర్

దీని గురించి ఆర్‌టిఓ అధికారులు మాట్లాడుతూ, ఇలా చేయడం చట్ట విరుద్దమే, కాబట్టి బిఎస్-3 టూ వీలర్లను తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో కొనుగోలు చేసిన కస్టమర్లు మూకుమ్మడిగా సదరు షో రూమ్ మీద ఫిర్యాదు చేయమని సూచించారు. మొత్తానికి ఓ మాజీ మిలిటరీ ఉద్యోగి ఆవేశం షోరూం చేస్తున్న మోసాన్ని బయటపెట్టింది!

English summary
Read In Telugu This Motorcycle Showroom Had Sold Banned BS3 Motorcycles — Ex-Serviceman Opens Fire
Story first published: Wednesday, June 14, 2017, 13:48 [IST]
Please Wait while comments are loading...

Latest Photos