స్టాండ్ మరియు హ్యాండ్లింగ్ అవసరం లేని సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైక్

Written By:

లాస్ వెగాస్ లో జరిగిన 2017 కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో వేదిక మీద హోండా టూ వీలర్స్, తమ అధునాతన రైడింగ్ కాన్సెప్ట్ బైకును ప్రదర్శించింది. టెక్నాలజీ పరంగా ఆధునిక ఆవిష్కరణల ప్రదర్శనకు వేదికగా నిలిచే సిఇఎస్-2017 షో ఆధారంగా హోండా ప్రదర్శించిన ఈ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ మరియు హ్యాడ్లింగ్ బైకు ప్రత్యేకతలు నేటి కథనంలో తెలుసుకుందాం రండి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
సెల్ఫ్ డ్రైవింగ్ బైక్

జపాన్ ఆధారిత ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా లాస్ వెగాస్ లోని ఎలక్ట్రిక్ సాంకేతికత ప్రదర్శన వేదిక మీద తమ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైకును ప్రదర్శించింది. ఇది ఎలాంటి స్టాండ్ అవసరం లేకుండా స్వతహాగా, తనంతటతానుగా నిలబడుతుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ బైక్

ఇలా నిలబడితే పడిపోదా... ? ప్రశ్న మీ మదిలో ఇప్పటికే మెదిలి ఉంటుంది. అయితే ఇది క్రింద పడిపోవడానికి చెక్ పెట్టేందుకు సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అనే సరికొత్త పరిజ్ఞాన్ని ఇందులో పరిచయం చేసింది. బైకు ఏ వైపుకైతే వాలిపోతుందో దానికి వ్యతిరేక దిశలో బరువులను ఉంచి బ్యాలెన్సింగ్ చేస్తుంది.

సెల్ఫ్ డ్రైవింగ్ బైక్

ఇందుకోసం బైకు ముందు బాగంలో హెడ్ లైట్ వద్ద ఈ పరికరాన్ని హోండా అమర్చింది. బైకు కోసం అదనంగా అందించే తరహాలో ఉండటం ద్వారా ఇతర బైకుల్లో ఈ పరిజ్ఞానాన్ని వినియోగించుకునే అవకాశం ఉంది.

సెల్ఫ్ డ్రైవింగ్ బైక్

నిజానికి ఈ పరిజ్ఞానాన్ని హోండా రోబోటిక్ డివిజన్ ప్రిన్సిపుల్స్ నుండి సేకరించింది. ప్రదర్శన సమయంలో ఈ అవిష్కరణకు సందర్శకుల నుండి మంచి స్పందన లభించింది.

సెల్ఫ్ డ్రైవింగ్ బైక్

ఈ పరిజ్ఞానం ద్వారా భారీ బరువున్న బైకులను మీరున్న చోటు నుండి పార్కింగ్ ఏరియాకు, పార్కింగ్ ఏరియా నుండి మీ వద్దకు ఎవరి సహాయం లేకుండా వస్తుంది. ఇలాంటి వాటి కోసం ఇంజన్ కూడా ఆన్ చేయాల్సిన పనిలేదు.

స్టాండ్ మరియు హ్యాండ్లింగ్ అవసరం లేని సెల్ఫ్ బ్యాలెన్స్ బైక్ పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చూడండి మరి...

 

ఎలక్ట్రిక్ మరియు భారీ ఫీచర్లున్న బైకులంటే ఇష్టం లేదా.... ఆక్సిలరేటర్ రైస్ చేయకుండా, గేర్లు మార్చకుండా బైకును నడపడం ఎవరు కోరుకుంటారులెండి. మరి మంచి శక్తివంతమైన సరికొత్త బైకు కోసం చూస్తున్నారా... ? అయితే బజాజ్ విడుదల చేసిన డామినర్ 400 గురించి మీరు తెలుసుకోవాల్సిందే. విడుదలైన అతి కొద్ది కాలమే అయినా దీని పోటీదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. దీనిని కొనేముందు ఎలా ఉందో ఓ సారి ఇక్కడున్న ఫోటోలను చూడండి...

 

Read more on: #హోండా #honda
English summary
Honda Reveals Riding Assist Concept At CES 2017 — The Self Balancing Future Of Motorcycles?
Story first published: Saturday, January 7, 2017, 12:12 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark