హైదరాబాద్ పోలీసులకు అత్యంత ఖరీదైన రీగల్ రాప్టర్ మోటార్ సైకిళ్లు

Written By:

భారీ అధునాతన ఫీచర్లను కలిగి ఉన్న ఫ్యాబ్(FaB) రీగల్ రాప్టర్ మోటార్ సైకిళ్లు హైదరాబాద్ పోలీసులు పొందనున్నారు. శక్తివంతమైన ఇంజన్, ఫీచర్లతో పాటు మంచి హుందాతనాన్ని సొంతం చేసుకున్న రీగల్ రాప్టర్ మోటార్ సైకిళ్లు త్వరలో హైదరాబాద్‌ పోలీసుల చేతిలో చక్కర్లు కొట్టనున్నాయి.

విభిన్నమైన డిజైన్‌తో పాటు జిపిఎస్ ట్రాకర్, పోలీస్ లైట్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ లతో పాటు పోలీసులకు కావాల్సిన అన్ని అధునాతన ఫీచర్లను ఇందులో అందివ్వడం జరిగింది.

రీగల్ రాప్టర్ మోటార్ సైకిల్స్ అనునది అమెరికా ఆధారిత కంపెనీ, అయితే దీనికి యజమాని చైనా ఆధారిత లైఫెంగ్ గ్రూప్ ఓనర్ అని తెలిసింది. వీటి ప్రధాన ఉత్పత్తులు షాంఘైలో తయారవుతున్నాయి అవుతున్నాయి.

హైదరాబాద్ ఆధారిత ఫ్యాబులస్ అండ్ బేయాండ్ (FaB) మోటార్స్ భాగస్వామ్యంతో 2015 ఫిబ్రవరిలో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించింది.

ఇప్పుడు ఇండియాలో పూర్తి స్థాయిలో తయారీ హక్కులను పొందేందుకు రీగల్ రాప్టర్ ప్రయత్నిస్తోంది. ఆ తరువాత శ్రీలంక, నేపాల్, భూటాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, యెమెన్ మరియు పాకిస్తాన్‌కు ఎగుమతి చేయనుంది.

ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులకు చేరనున్న రీగల్ రాప్టర్ మోటార్ సైకిల్స్ డిడి-350ఇ-9బి క్రూయిజర్ మోడల్. ఇందులో గాలితో చల్లబడే ఫూయల్ ఇంజెక్టడ్ ప్యార్లల్ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలదు.

రీగల్ రాప్టర్ లోని శక్తివంతమైన 320సీసీ ఇంజన్ 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 22.8బిహెచ్‌పి పవర్ మరియు 6,500ఆర్‌పిఎమ్ వద్ద 22ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్పి చేయును.

5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇందులో 14-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు, దీని బరువు సుమారుగా 180 కిలోలుగా ఉంది.

ఫ్యాబ్ రీగల్ రాప్టర్ మోటార్ సైకిల్ సంస్థ ఈ బైకును 2,96,000 రుపాయలు ఎక్స్ షోరూమ్ హైదరాబాద్‌గా అందుబాటులో ఉంచింది.

 

English summary
Hyderabad Police To Use Fully Equipped Fab Regal Raptor Motorcycles Soon
Story first published: Thursday, February 2, 2017, 11:48 [IST]
Please Wait while comments are loading...

Latest Photos