ఇండియా నుండి అధికంగా ఎగుమతి అవుతున్న బైక్

Written By:

ఇండియా నుండి అధికంగా ఎగుమతి అవుతున్న మోడల్ బజాజ్ బాక్సర్. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... ఇది ఇండియన్ మార్కెట్లో లభించకపోవడం. గతంలో దేశీయంగానే విడుదలైనా కొన్నాళ్లకు మార్కెట్ నుండి తొలగించారు. విదేశాల్లో దీనికి మంచి ఆదరణ లభించడంతో కేవలం ఎగుమతుల కోసమే దీనిని ఉత్పత్తి చేస్తున్నారు.

బజాజ్ బాక్సర్

బజాజ్ ఆటో గత ఆర్థిక సంవత్సరం 2016-17 లో 3.57 లక్షల యూనిట్ల బాక్సర్ మోటార్ సైకిళ్లను ఎగుమతి చేసింది. అంతకు మునుపు 2015-16 ఆర్థిక సంవత్సరంలో 6.07 లక్షల యూనిట్లను ఎగుమతి చేసింది.

బజాజ్ బాక్సర్

చివరి రెండు ఆర్థిక సంవత్సరాల్లో జరిగిన ఎగుమతుల గణాంకాలను పరిశీలిస్తే ఎగుమతుల వృద్దిలో 41 శాతం కోల్పోయినప్పటికీ ఇండియా నుండి అధికంగా ఎగుమతి చేయబడుతున్న ఇదే బైకుగా నిలిచింది.

బజాజ్ బాక్సర్

100సీసీ నుండి 150సీసీ సామర్థ్యం గల ఉత్పత్తులతో బజాజ్ ఆటో బాక్సర్ బ్రాండ్‌ను పరిచయం చేసింది. తరువాత బాక్సర్‌కు కొనసాగింపుగా సిటి100 ను అందుబాటులోకి తెచ్చింది.

బజాజ్ బాక్సర్

బజాజ్ తమ సిటి100 ను తొలుత 2006లో మార్కెట్ నుండి తొలగించింది. తరువాత న్యూ గ్రాఫిక్స్ మరియు అల్లాయ్ వీల్స్‌తో 2015లో మళ్లీ రీలాంచ్ చేసింది.

బజాజ్ బాక్సర్

బజాజ్ బాక్సర్ తరువాత సిటి100 మోడల్ ఏడాదికి 2 లక్షలు యూనిట్లు మరియు మూడవ స్థానంలో బజాజ్ పల్సర్ ఏడాదికి 1.5 లక్షల యూనిట్లను ఎగుమతి చేస్తోంది బజాజ్ ఆటో.

బజాజ్ బాక్సర్

బజాజ్ అధికంగా ఎగుమతి చేస్తున్న మోడల్ బాక్సర్ 150. ఏడాదికి సుమారుగా 1.40 లక్షల యూనిట్ల వరకు ఎగుమతి చేస్తోంది. బాక్సర్ 150 అడ్వెంచర్ శ్రేణికి చెందిన మోటార్ సైకిల్. ఇది ఇండియాలో విడుదల కావాల్సి ఉంది. అయితే బజాజ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.

బజాజ్ బాక్సర్

ఎగుమతుల్లో ఐదవ స్థానంలో ఉంది హోండా ఆక్టివా కాదు. ఇండియాలో బెస్ట్ స్కూటర్ ఇదే అయినప్పటికీ, ఇండియా నుండి ఎగుమతి అవుతున్న స్కూటర్లలో హోండా డియో 1.35 లక్షల యూనిట్ల ఎగుమతులతో మొదటి స్థానంలో నిలిచింది.

Read more on: #బజాజ్ #bajaj
English summary
Read In Telugu India's Most Exported Motorcycle Revealed. Get more details bajaj boxer
Story first published: Tuesday, May 23, 2017, 11:13 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark