స్కౌట్ బాబర్ మీద బుకింగ్స్ ప్రారంభించిన ఇండియన్ మోటార్‌సైకిల్

Written By:

అమెరికాకు చెందిన తొలి మోటార్ సైకిల్ కంపెనీ ఇండియన్ మోటార్‌సైకిల్ తమ సరికొత్త ఇండియన్ స్కౌట్ బాబర్ మోటార్ సైకిల్ మీద బుకింగ్స్ ఆహ్వానించింది. ఇండియన్ మోటార్‍‌సైకిల్‌ స్కౌట్ ఫ్యామిలీలోకి అతి త్వరలో స్కౌట్ బాబర్ విడుదల కానుంది.

రూ. 50,000 ల బుకింగ్ అమౌంట్‌తో దేశవ్యాప్తంగా మీకు సమీపంలో ఉన్న డీలర్ల వద్ద ఇండియన్ స్కౌట్ బాబర్‌ను బుక్ చేసుకోగలరు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఇండియన్ స్కౌట్ బాబర్

స్కౌట్ బాబర్ బైకు స్కౌట్ సిక్ట్సి నుండి రూపాంతరం చెందిన మోడల్. ఫ్యూయల్ ట్యాంక్ మీద క్లాసిక్ ఫాంట్ స్టైల్లో ఉన్న అక్షరాలు, ఇంజన్ మరియు బాడీ మొత్తం బ్లాక్ కలర్‌లో ఉండటం ద్వారా కండలు తిరిగిన శరీరాన్ని గమనించవచ్చు.

Recommended Video
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఇండియన్ స్కౌట్ బాబర్

సాంకేతికంగా ఇండియన్ స్కౌట్ బాబర్‌లో 1,133సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్, థండర్ స్ట్రోక్ 111 వి-ట్విన్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 100బిహెచ్‍‌‌పి పవర్ మరియు 97.7ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఇండియన్ స్కౌట్ బాబర్

టూరింగ్ కంఫర్ట్ కోసం, స్కౌట్ బాబర్‌లో ఇతర యాక్ససరీలను పొందవచ్చు. ప్యాసింజర్ సీట్, సోలో రైడ్ కోసం సోలో ర్యాక్ బ్యాగ్ మరియు శాడిల్ బ్యాగ్ పొందవచ్చు. అంతే కాకుండా హ్యాండిల్‌ బార్‌కు ఇరువైపులా చిన్న మిర్రర్స్ కూడా ఉన్నాయి.

ఇండియన్ స్కౌట్ బాబర్

ఇండియన్ స్కౌట్ బాబర్ మోటార్ సైకిల్ ఐదు విభిన్న రంగుల్లో లభించును. అవి, థండర్ బ్లాక్, స్టార్ సిల్వర్ స్మోక్, బ్రాంజ్ స్మోక్, ఇండియన్ మోటార్‌సైకిల్ రెడ్ మరియు థండర్ బ్లాక్ స్మోక్.

ఇండియన్ స్కౌట్ బాబర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

స్ట్రిప్‌డౌన్ డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందించబడింది కాబట్టి, అత్యంత అగ్రెసివ్ రూపాన్ని కలిగి ఉంది. అంతే కాకుండా రైడింగ్ చేస్తున్నపుడు కూడా అగ్రెసివ్ రైడింగ్ పొజిషన్ ఉంటుంది.

English summary
Read In Telugu: Indian Motorcycle Commences Booking Of Scout Bobber
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark