అతి త్వరలో విడుదల కానున్న కవాసకి డబ్ల్యూ800

Written By:

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ కవాసకి మోటార్స్ ఇండియా విభాగంలో దేశీయ విపణిలోకి తమ డబ్ల్యూ800 మోటార్ సైకిల్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే దీనికి పలుమార్లు దేశ రహదారుల మీద పరీక్షలు కూడా నిర్వహించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కవాసకి డబ్ల్యూ800

చూడటానికి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ క్లాసిక్ ను పోలి ఉండి రెస్ట్రో స్టైల్లో ఉంటుంది. గత నెలలో పూనే లోని డీలర్ వద్ద ఈ ప్రదర్శనకు ఉంచిన డబ్ల్యూ800 బైకును ఇప్పడు మంగళూరు పరిసర ప్రాంతాల్లో రహదారి పరీక్షలు నిర్వహిస్తోంది.

కవాసకి డబ్ల్యూ800

దేశీయంగా కవాసకి సంస్థకు చెందిన బైకుల్లో ఎక్కువ సామర్థ్యం ఉన్న హెచ్2, జడ్ఎక్స్-10ఆర్, జడ్1000 వంటి ఉత్పత్తులకు బాగా ప్రసిద్ది చెందింది. అయితే ఈ మిడ్ సైజ్ మోటార్ సైకిల్ కు కస్టమర్ల నుండి ఎలాంటి స్పందన వస్తుందో అని గమనించడానికి పూనే డీలర్ వద్ద ప్రదర్శనకు ఉంచినట్లు తెలిసింది.

కవాసకి డబ్ల్యూ800

పాత కాలం బైకులు అని తెలుపుతూ, ఆధునిక ఫీచర్లు మరియు హంగులతో లభించే మోటార్ సైకిళ్లకు దేశీయంగా మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కవాసకి ఈ డబ్ల్యూ800 ను విడుదల చేసే ఆలోచనలో ఉంది. అయితే కవాసకి ఇండియా దీని విడుదలకు సంభందించిన వివరాలను వెల్లడించడానికి నిరాకరిస్తోంది.

కవాసకి డబ్ల్యూ800

మోటార్ వరల్డ్ ఇండియా అనే వెబ్‌సైట్ తన కథనంలో డబ్ల్యూ800 బైకు ఫోటోలను పోస్ట్ చేసింది. మంగళూరులో ఈ బైకును పరీక్షిస్తున్న సమయంలో సేకరించిన ఫోటోలుగా తెలిపింది. ఇది యూరోపియన్ స్పెక్ వెర్షన్ అనే విషయం కూడా ఫోటోల ద్వారా స్పష్టమవుతోంది.

కవాసకి డబ్ల్యూ800

కవాసకి ఈ డబ్ల్యూ800 మోటార్ సైకిల్‌లో గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్, ఎక్ట్సీరియర్ మీద క్రోమ్ సొబగులు, డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్, పొడవాటి సీటు, వంటి రెట్రో స్టైల్ ఫీచర్లను అందించింది.

కవాసకి డబ్ల్యూ800

సస్పెన్షన్ పరంగా ముందు వైపున 39ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు కలవు. బ్రేకుల పరంగా ముందు వైపున ట్విన్ పిస్టన్ కాలిపర్ గల 300ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న డిస్క్ బ్రేక్ అదే విధంగా వెనుక వైపున 160ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న డిస్క్ బ్రేక్ కలదు.

కవాసకి డబ్ల్యూ800

216 కిలోలు ఉన్న కవాసకి డబ్ల్యూ800 బైకు ఎత్తు 2,190ఎమ్ఎమ్, 790ఎమ్ఎమ్ వెడల్పు మరియు ఎత్తు 1,075ఎమ్ఎమ్‌గా ఉంది. దీని బాహ్య డిజైన్‌లో అధిక తన్యత(tensile) గల స్టీల్‌ను వినియోగించారు.

కవాసకి డబ్ల్యూ800

సాంకేతికంగా కవాసకి మోటార్స్ ఈ డబ్ల్యూ800 మోటార్ సైకిల్‌లో 773సీసీ సామర్థ్యం గల సమాంతరంగా ఉన్న రెండు సిలిండర్ల (Twin Parllel) ఇంజన్ కలదు, ఇది 6,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 47బిహెచ్‌పి పవర్ మరియు 2,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద గరిష్టంగా 60ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడం జరిగింది.

కవాసకి డబ్ల్యూ800

కవాసకి ఈ డబ్ల్యూ800 బైకును మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రయంప్ స్ట్రీట్ ట్విన్, డుకాటి స్క్రాంబ్లర్ మరియు మోటో గుజ్జి వి9 రోమర్ వంటి వాటికి గట్టి పోటీనివ్వనుంది.

కవాసకి డబ్ల్యూ800

మార్కెట్లోకి డబ్ల్యూ800 విడుదల, అత్యధిక డిమాండ్ ఉన్న రెస్ట్రో స్టైల్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి అత్యుత్తమ చేరిక అని చెప్పవచ్చు. మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.

కవాసకి డబ్ల్యూ800

మహేంద్ర సింగ్ ధోని కార్ మరియు బైక్ కలెక్షన్

భారత క్రికెట్ జట్టుకు సారథ్యం వహిస్తూ వచ్చిన మహేంద్ర సింగ్ ధోనికి వెహికల్స్ అంటే అమితాసక్తి. ఇవాళ్టి స్టోరీ ద్వారా ఎమ్.ఎస్. ధోనీ వద్ద ఎలాంటి బైకులు మరియు కార్లు ఉన్నాయో చూద్దాం రండి.

కవాసకి డబ్ల్యూ800

రెడ్డిచ్ పేరుతో క్లాసిక్ బైకు విడుదల చేసిన రాయల్ ఎన్పీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ బైకులను విపణికి పరిచయం చేసింది. రెండు రోజుల క్రితం నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టిన ఈ మోడల్ నేడు విపణిలోకి చేరింది. ధర మరియు ఇతర వివరాలు కోసం...

  
English summary
Kawasaki W800 Spotted Testing In India; Launch Imminent
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark