ఫిబ్రవరి 23 న విడుదలకు సిద్దమైన కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

Written By:

ఆస్ట్రియన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ కెటిఎమ్, ఇండియా విభాగం 2017 కు చెందిన 390 డ్యూక్ మరియు 200 డ్యూక్ మోటార్ సైకిళ్లను నవంబర్ 2016 ఎకిమా మోటార్ సైకిల్ షో వేదిక మీద ప్రదర్శించింది. అయితే ప్రస్తుతం అందుతున్న తాజా సమాచారం మేరకు ఫిబ్రవరి 23, 2017 దేశీయంగా విడుదలకు సిద్దం చేసింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్ మీద వస్తోన్న ఆధారం లేని వార్తలకు చెక్ పెడుతూ, అత్యంత రహస్యంగా డ్యూక్ 200 మోటార్ సైకిల్‌ను పరీక్షిస్తున్నప్పుడు, దానికి చెందిన వివరాలతో మోటోరాయిడ్స్ వార్తా వేదిక ఓ కథనం ప్రచురించింది.

కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

2017 మోడల్ డ్యూక్ మోటార్ సైకిళ్లు అదే బ్లాక్ ఫ్రేమ్ మరియు కాషాయం రంగులో ఉన్నటువంటి సబ్ ఫ్రేమ్ మరియు ప్రస్తుతం జనరేషన్ కోసం మునుపటి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ లను కలిగి ఉన్నాయి.

కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

రహస్యంగా విడుదలయిన ఫోటోలను గమనిస్తే డ్యూక్ 200 బైకులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేదనే విషయం స్పష్టం అవుతుంది. అంతే కాకుండా ఎల్ఇడి హెడ్ ల్యాంప్ ఇందులో మిస్సయ్యింది. దీని స్థానంలో పగటి పూట వెలిగే లైట్ల ఇముడింపుతో ఉన్న హ్యాలోజియన్ హెడ్ ల్యాంప్ ఉంది.

కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

2017 కెటిఎమ్ డ్యూక్ 200 లో జరిగిన మార్పులు మీద దృష్టి సారిస్తే, కొత్త సీటు, ఫ్యూయల్ ట్యాంక్ ఇంటిగ్రేటెడ్ ఇగ్నిషన్ కీ మరియు వెనుక వైపు బాడీ ప్యానల్‌లోకి జొప్పించిన పిలియన్ గ్రాబ్ రెయిల్ కలవు.

కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

డ్యూక్ 200 లో ప్రధాన మార్పు ఇంజన్ క్రింది భాగంలో ఉండే ఎగ్జాస్ట్ గొట్టానికి బదులుగా, ఉద్గారాలను వెనుక వైపుకు వెదజల్లే విధంగా పొడవాటిని ఎగ్జాస్ట్ పైపును అందివ్వడం జరిగింది.

కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

సాంకేతికంగా ఇందులో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే 199.5సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 25బిహెచ్‌పి పవర్ మరియు 19.2ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

కెటిఎమ్ 390 డ్యూక్ మరియు 200 డ్యూక్

ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందుబాటులో డ్యూక్ 200 ఉత్పత్తి చేసే పవర్‌కు సమానమైన పవర్‌నే ఉత్పత్తి చేసినప్పటికీ మరింత శక్తివంతమైన ఇంజన్‌తోనే రానుంది. ఫిబ్రవరి 23, 2017 న కెటిఎమ్ ఈ నూతన కెటిఎమ్ డ్యూక్ 200 ను విడుదలకు సిద్దం చేస్తోంది. తాజా ఆటోమొబైల్ సమాచారం తెలుగులో పొందడానికి చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్.

 
English summary
2017 KTM 390 Duke And 200 Duke India Launch On February 23
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark