250సీసీ ఇంజన్‌తో డ్యూక్ 250 వేరియంట్‌ను విడుదలకు సిద్దం చేసిన కెటిఎమ్

Written By:

కెటిఎమ్ ఇండియా విభాగం ఇప్పటికే తమ 2017 మోడల్ డ్యూక్ 200 మరియు డ్యూక్ 390 మోటార్ సైకిళ్లను దేశీయంగా విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేసుకుంది. అయితే డ్యూక్ రేంజ్‌లో ఉన్న 200 మరియు 390 ల మధ్య డ్యూక్ 250 మోడల్‌ను ప్రవేశపెట్టడానికి కెటిఎమ్ సిద్దమైంది. అత్యంత రహస్యంగా డ్యూక్ 250 కు ఈ మధ్యనే పరీక్షలు నిర్వహించింది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కెటిఎమ్ డ్యూక్ 250

ఆటోకార్ ఇండియా కథనం మేరకు కెటిఎమ్ డ్యూక్ 250 మోటార్ సైకిల్ ను విడుదలకు సన్నద్దం చేసినట్లు తెలిసింది, పూర్తి స్థాయిలో విడుదలయితే 200 మరియు 390 ల మధ్య స్థానాన్ని భర్తీ చేయనుందని వెల్లడించింది.

కెటిఎమ్ డ్యూక్ 250

డ్యూక్ 250 మోడల్‌లో ఎల్ఇడి హెడ్ లైట్లు, టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ కన్సోల్ వంటివి వచ్చే ఆస్కారం లేదు. డ్యూక్ 390 లో ఉన్నటువంటి మెట్జలర్ టైర్ల స్థానంలో ఎమ్ఆర్ఎఫ్ రెవ్జ్ సి1టైర్లతో వస్తోంది. ఈ టైర్లను బజాజ్ డామినర్ 400లో గుర్తించవచ్చు.

కెటిఎమ్ డ్యూక్ 250

డ్యూక్ 250 పనితీరు విషయానికి వస్తే, అంతర్జాతీయ విపణిలో అమ్ముడుపోతున్న వేరియంట్లలోని సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 31బిహెచ్‌పి పవర్ మరియు 24ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇండియన్ మార్కెట్‌కు కూడా ఇదే ఇంజన్ వచ్చే అవకాశం ఉంది.

కెటిఎమ్ డ్యూక్ 250

ధర అనేది ఇప్పుడు ముఖ్యమైన అంశం. డ్యూక్ 200 మరియు డ్యూక్ 390 ల మధ్య స్థానాన్ని భర్తీ చేస్తున్నందున ఈ రెండింటి మీద ప్రభావం పడుకుండా పోటీదారులను లక్ష్యంగా చేసుకుని ధరను నిర్ణయించాల్సి అవసరం ఎంతయినా ఉంది.

కెటిఎమ్ డ్యూక్ 250

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న యమహా ఎఫ్‌జడ్ 250, బెనెల్లీ టిఎన్‌టి 25 మరియు కవాసకి జడ్250 వంటి మోటార్ సైకిళ్ల నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది.

కెటిఎమ్ డ్యూక్ 250

ధర వివరాలను వెల్లడించడానికి కెటిఎమ్ ఇండియా నిరాకరించింది. మరో రెండు రోజుల్లో కెటిఎమ్ అధికారికంగా డ్యూక్ 250 ని విడుదల చేయనుంది, తాజా ఆటోమొబల్ సమాచారం కోసం చూస్తూ ఉండండి తెలుగు డ్రైవ్‌స్పార్క్ (Telugu DriveSpark).

 
English summary
KTM Duke 250 India Launch Confirmed ― Ready To Race?
Story first published: Wednesday, February 22, 2017, 9:00 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark