విపణిలోకి 2017 కెటిఎమ్ డ్యూక్ 390 విడుదల: ధర మరియు ఇతర వివరాలు....

Written By:

అభిమానుల్లో ఉత్కంఠను పెంచేందుకు అనేక ధపాలుగా ఇండియన్ రోడ్ల మీద పరీక్షలకొచ్చిన 2017 డ్యూక్ 390 మోటార్ సైకిల్ ఎట్టకేలకు నేడు (23/02/2017) దేశీయ మార్కెట్లోకి విడుదలయ్యింది. ఆస్ట్రియన్‌కు చెందిన స్పోర్ట్స్ శైలి ద్విచక్రవాహనాల తయారీ సంస్థ దీనితో పాటు డ్యూక్ 250 మరియు 2017 డ్యూక్ 200 లను కూడా విడుదల చేసింది.

సరికొత్త 2017 డ్యూక్ 390 మోటార్ సైకిల్ భౌతికంగా గుర్తించదగిన కొన్ని మార్పులకు గురయ్యింది. ప్రత్యేకించి ఇంస్ట్రుమెంటేషన్ డిజైన్ మరియు మెకానికల్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి.

కెటిఎమ్ ఇండియా విభాగం తమ 2017 కెటిఎమ్ డ్యూక్ 390 మోటార్ సైకిల్‌ను రూ. 2,25,730 ల ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచింది.

డిజైన్ పరంగా పెద్ద మార్పులే సంభవించాయి. మునుపటి వేరియంట్‌తో పోల్చుకుంటే ఈ నూతన మోడల్ అత్యంత పదునైన ఆకృతిని కలిగి ఉంది. ప్రధానంగా గుర్తించే వాటిలో ఇంజన్ క్రింది భాగంలో ఉండే ఎగ్జాస్ట్ వ్యవస్థను వెనుక వైపుకు పొడగించడం జరిగింది.

మరో ప్రధానమైన మార్పు, నూతన డిజైన్‌లో హెడ్ ల్యాంప్. పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ల ఇముడింపుతో ఉన్న హెడ్ ల్యాంప్ కలదు. ఇదే తరహా హెడ్ ల్యాంప్‌ను కెటిఎమ్ 1290 సూపర్ డ్యూక్ లో గుర్తించవచ్చు.

సాంకేతిక వివరాలు

కెటిఎమ్ తమ 2017 డ్యూక్ 390 లో 373సీసీ సామర్థ్యం గల లిక్విడ్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ అందించింది. ఇది గరిష్టంగా 44బిహెచ్‌పి పవర్ మరియు 35ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

ఫీచర్లు

సరికొత్త 2017 కెటిఎమ్ డ్యూక్ 390 ఫీచర్ల విషయానికి వస్తే, టిఎఫ్‌టి ఇంస్ట్రుమెంట్ డిస్ల్పే, ముందు వైపున 300ఎమ్ఎమ్ చుట్టుకొలత ఉన్న డిస్క్ బ్రేక్, ముందు వైపున డబ్ల్యూపి అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున డబ్ల్యూపి మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

రెండు చక్రాలకు ఉన్న డిస్క్ బ్రేకులకు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనుసంధానం కలదు, స్లిప్ అసిస్ట్ క్లచ్, మెట్జలర్ టైర్లలతో పాటు అతి ముఖ్యమైన అడ్జస్టబుల్ లీవర్లు మరియు రైడ్ బై వైర్ సాంకేతికతలను కూడా ఇందులో పరిచయం చేశారు.

పోటీదారులు

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న బెనెల్లీ టిఎన్‌టి 300, బజాజ్ డామినర్ 400 మరియు మహీంద్రా మోజో వంటి వాటితో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

మరిన్ని 2017 కెటిఎమ్ డ్యూక్ 390 ఫోటోలను వీక్షించడానికి క్రింది గ్యాలరీ మీద క్లిక్ చేయండి.

English summary
2017 KTM Duke 390 Launched In India — Are You Ready To Race?
Please Wait while comments are loading...

Latest Photos