విభిన్న వైకల్యం గల వ్యక్తులచే నడుస్తున్న మా ఉలా బైక్ ట్యాక్సీ

Written By:

అంగవైకల్యం విజయానికి ఏ మాత్రం అడ్డుకాదని నిరూపించింది "మా ఉలా" అనే చెన్నై ఆధారిత బైక్ ట్యాక్సీ నిర్వహణ సంస్థ. కార్పోరేట్ ట్యాక్సీ సంస్థల సేవలకు దీటుగా, సరసమైన ధరతో సర్వీసులందిస్తూ మంచి విజయాన్ని సాధించింది ఈ "మా ఉలా".

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మా ఉలా బైక్ ట్యాక్సీ

వైకల్యం గల వ్యక్తులు బైకు ద్వారా కస్టమర్లకు ట్యాక్సీ సేవలను అందించడం అనేది కాస్త ఆలోంచించదగిన అంశం. అవయవ లోపం ఉన్న వారు ఈ వృత్తిలో రాణించడం కష్టమని భావించే వారికి, వీరు తమ విజయంతో చక్కటి సమాధానం ఇచ్చారు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

విభిన్న వైకల్యం గల వ్యక్తులచే నిర్వహించే ఈ మా ఉలా బైక్ ట్యాక్సీ చెన్నైకి చెందింన బాలాజీ అనే వ్యక్తి ప్రారంభించారు మరియు దీని సహ వ్యవస్థాపకులు మహ్మద్ గడాఫీ దీనికి మా ఉలా అనే పేరును పెట్టారు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

తమిళంలో మాత్రు తిరునాలిగల్ (విభిన్న అవయవ వైకల్యం) అనే పదం నుండి "మా" సేకరించారు మరియు ఉలా అంటే ప్రయాణం. ఈ రెండు పదాలను సేకరించి మా ఉలా అనే పేరుతో బైక్ ట్యాక్సీ సేవలను ప్రారంభించారు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

బాలాజీ ప్రకారం భారత దేశంలో పూర్తిగా అంగ వైకల్యం గల వ్యక్తులచే నిర్వహించబడుతున్న ఏకైక సంస్థ మా ఉలా అని పేర్కొన్నారు. ఈ మా ఉలా ను 2015 జనవరిలో ప్రారంభించారు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

మా ఉలా ప్రారభించడానికి ముందు బాలాజీ తన టీచర్‌ను రోజు తన బైకు మీద వారి ఇంటికి తీసుకేళ్లేవాడు. అయితే ఈ పనిని వృత్తిగా మార్చుకుంటే బాగుంటుందని భావించి తన బైకుతో ట్యాక్సీ సేవలు ప్రారభించాడు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

మొదటి నెలలో మాత్రమే బాలాజీ రూ. 12,000 లాభాన్ని ఆర్జించాడు. తరువాత మహ్మద్‌తో కలిసి మా ఉలా స్థాపించి, విభిన్న అవయవ వైకల్యం గల వ్యక్తులను సంప్రదించి తమ బృందాన్ని విస్తరించుకున్నారు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

ప్రస్తుతం మా ఉలా లో 11 మంది ఉన్నారు. పెట్రోల్ ఖర్చులు అన్నీ పోను ప్రతి వ్యక్తి కూడా 15,000 రుపాయలను ఇంటికి తీసుకెళ్తున్నట్లు బాలాజీ తెలిపాడు. కస్టమర్లను మరింత పెంచుకునేందుకు పోస్టర్లు మరియు కరపత్రాలను కూడా పంచడం ద్వారా మా ఉలా ను స్థిరంగా నిర్మించుకుంటూ వచ్చారు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

మా ఉలా బైక్ ట్యాక్సీ సేవలు అత్యంత సరసమైనవి. కస్టమర్లకు సరసమైన ధరలకే సేవలందించి వారికి సంతృప్తినిచ్చేలా ఛార్జ్ చేస్తున్నారు. పగట వేళల్లో కిమీకు రూ.10 మరియు రాత్రి వేళ కిమీకు రూ. 13 చొప్పున చార్జ్ చేస్తున్నట్లు తెలిపారు.

మా ఉలా బైక్ ట్యాక్సీ

మా ఉలా కోసం మొబైల్ యాప్ రూపొందించేందుకు ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ డెవలపర్స్‌‌తో మాట్లాడుతోంది ఈ బృందం. మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చిన అనంతరం తమ సేవలను ఇతర జిల్లాలకు విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

మా ఉలా సంస్థకు ప్రారంభం నుండి మంచి విశ్వసనీయమైన కస్టమర్లు ఉన్నారు. అయితే ఆటో రిక్షాల ద్వారా తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ వచ్చారు. మా ఉలా కు సంభందించిన లఘు చిత్రాన్ని ఈ వీడియో ద్వారా వీక్షించగలరు.

English summary
Read In Telugu Maa Ula: A Bike Taxi Service Run By The Differently-Abled
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark