అదే డిజైన్‌లో మళ్లీ ఇండియన్ మార్కెట్లోకి వస్తున్న యెజ్ది బైకులు

Written By:

ఐదున్నర దశాబ్దాల చరిత్ర ఉన్న యెజ్ది బైకుల గురించి చెప్పుకోవాలంటే, ముందు 1960 కాలంలోకి వెళ్లాల్సిందే. భారత ద్విచక్ర వాహన పరిశ్రమలో సంచలనాలను సృష్టిస్తూ మైసూర్ ఆధారిత ఐడియల్ జావా మోటార్ సైకిళ్ల తయారీని ప్రారంభించింది. అప్పట్లో ఈ జావా కంపెనీ ఉత్పత్తి చేసే యెజ్ది బైకులకు అభిమానులు విపరీతంగా ఉండేవారు.

మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

1960 ల కాలంలో జావా పేరుతో మోటార్ సైకిళ్లను విక్రయించిన జావా కంపెనీ, 1973 నుండి యెజ్ది పేరుతో మోటార్ సైకిళ్లను తయారు చేసింది. 1960 నుండి 1990ల మధ్య కాలంలో ఉన్న యువతకు ఫేవరెట్ బైకు యెజ్ది. కాలగమనంలో చరిత్రకే పరిమితమైన యెజ్జి బైకులను మహీంద్రా మళ్లీ విపణిలోకి ప్రవేశపెట్టనుంది.

Recommended Video - Watch Now!
Ducati 1299 Panigale R Final Edition Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

అప్పట్లోనే కాదు, 57 ఏళ్ల తరువాత ఇప్పటికీ నేటి యువతలో ఎంతో మంది యెజ్ది బైకులకు ఫ్యాన్స్ ఉన్నారు. క్లాసిక్ మోటార్ సైకిళ్లకు భారతదేశంలో ఎప్పటీ డిమాండ్ తగ్గదు. ఇందుకు, చెన్నై ఆధారిత రాయల్ ఎన్ఫీల్డ్ ఉత్పత్తి చేసే బైకులు మరియు వాటి విక్రయాలే నిదర్శనం.

మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

క్లాసిక్ మోటార్ సైకిళ్ల ట్రెండ్ గుర్తించిన మహీంద్రా అండ్ మహీంద్రా పురాతణ బైకుల తయారీ సంస్థ జావా మరియు యెజ్ది బ్రాండ్ పేరును పూర్తిగా కొనుగోలు చేసింది. ఇప్పుడు యెజ్ది పేరుతో క్లాసిక్ స్టైల్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసి రాయల్ ఎన్ఫీల్డ్‌కు షాక్ ఇస్తూనే, క్లాసిక్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడానికి మహీంద్రా ప్రయత్నాలు చేస్తోంది.

మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

ఈ క్రమంలో yezdi.com వెబ్‌సైట్‌ను మహీంద్రా ప్రారంభించింది. మహీంద్రాలోని ఉప బ్రాండ్ యెజ్ది పేరు మీదుగా బైకులను ఉత్పత్తి చేయనున్నట్లు వెబ్‌సైట్ ప్రారంభించిన అనంతరం మహీంద్రా మేనేజింగ్ డైరక్టర్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ ద్వారా పంచుకున్నారు. ఇదే సందర్భంలో తాము యెజ్ది బ్రాండ్‌కు యజమానులమని తెలియజేశాడు.

మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

జావా కంపెనీని కొనుగోలు చేసినప్పుడు యెజ్ది బ్రాండ్ పేరుతో మరో రెండేళ్లలో జావా మోటార్ సైకిళ్లను ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెడతామని మహీంద్రా వెల్లడించింది. యెజ్ది పేరుకు మళ్లీ ప్రాణం పోస్తూ కొత్త మోటార్ సైకిళ్లను 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదిక మీద ప్రదర్శించనుంది.

మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

1960, 70, 80, మరియు 90 ల కాలంలో యువత మనస్సు దోచుకున్న జావా యెజ్ది మోటార్ సైకిల్ గురించి చూస్, ఆఫ్ రోడ్ మరియు ఆన్ రోడ్ సామర్థ్యాలు ఉన్న ఈ బైకులో 2-స్ట్రోక్ ఇంజన్ రెండు ఎగ్జాస్ట్ పైపులతో లభించేది. "ఫరెవర్ బైక్, ఫరెవర్ వ్యాల్యూ" అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన యెజ్ది బైకులు ఇండియన్ రోడ్లను పాలించాయి.

మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

జావా బ్రాండ్ పేరు క్రిందనే క్లాసిక్ లెజండ్స్ మోటార్ సైకిళ్లను ఉత్పత్తి చేసి, విక్రయించుకునే హక్కులను మహీంద్రా సొంతం చేసుకుంది. భవిష్యత్తులో క్లాసిక్ లెజండ్ బైకులతో పాటు మరికొన్ని కొత్త మోడళ్లను పాత మోటార్ సైకిళ్ల డిజైన్ రూపొందించి మహీంద్రా పేరుతో కాకుండా జావా బ్రాండ్‌తో విక్రయించనున్నట్లు మహీంద్రా గత ఏడాది ఓ ప్రకటనలో వెల్లడించింది.

మార్కెట్లోకి జావా యెజ్ది బైకులు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

వాహన పరిశ్రమలో దాదాపు అన్ని రంగాల్లో మహీంద్రా కలదు, టూ వీలర్ల విభాగంలో విభిన్నమైన ఉత్పత్తులను అందించినప్పటికీ ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇకాన్ మోటార్ సైకిళ్ల కంపెనీ జావా ను కొనుగోలు చేయడంతో రాయల్ ఎన్ఫీల్డ్ తరహా సక్సెస్ కోసం అదే బ్రాండ్ పేరుతో అధునాతన క్లాసిక్ బైకులను ఉత్పత్తి చేయడానికి సిద్దమవుతోంది.

తాజా ఆటోమొబైల్ న్యూస్ కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఇక్కడ తెలుసుకోండి....

English summary
Read In Telugu: Mahindha Launches New Yezdi Bikes With Current Modification Soon
Story first published: Tuesday, July 25, 2017, 12:41 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark