ఇండియా కోసం ఎలక్ట్రిక్ స్కూటర్ అభివృద్ది చేస్తున్న మహీంద్రా

Written By:

భారత వాహన తయారీ దిగ్గజం మహీంద్రా, ఇండియన్స్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తోంది. మహీంద్రా టూ వీలర్స్ ఇదివరకే అభివృద్ది చేసిన గస్టో స్కూటర్ ఆధారంగా సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను డెవలప్ చేస్తోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తున్నట్లు తాజాగా అందిన నివేదిక ద్వారా తెలిసింది. సరికొత్త ఫ్లాట్‌ఫామ్ ఆధారంగా నూతన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను నిర్మిస్తున్నట్లు తెలిసింది.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్

మహీంద్రా గ్రూపు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా తమ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను సందర్శించినపుడు, "సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంట్‌ను అభివృద్ది చేస్తున్నట్లు" ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇదే మహీంద్రా రీసెర్చ్ సెంటర్ జావా బ్రాండ్ మీద కూడా పనిచేస్తోంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్

అక్టోబరు 2016 లో కుదుర్చుకున్న ప్యూజో మోటార్‌సైకిల్స్(PMTC), క్లాసిక్ లెజెండ్స్ మరియు మహీంద్రా టూ వీలర్స్(MTWL) తో జరిగిన ఒప్పందాన్ని పునర్నిర్మిస్తున్నట్లు తెలిపారు.

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రాజెక్టును గస్టో స్కూటర్ ఆధారంగా, MTWL తో జరిగిన ద్విచక్ర వాహన వ్యాపార ఒప్పంద భాగస్వామ్యంలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది మీద దృష్టిసారించడం మరియు పలు కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్లను అభివృద్ది చేస్తున్న తరుణంలో మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్ల మీద ఫోకస్ పెట్టింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్

బెంగళూరు ఆధారిత అథర్ ఎనర్జీ భారత దేశపు తొలి స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అభివృద్ది చేస్తోంది. ఎస్340 స్కూటర్‌ డిసెంబర్ 2017 నుండి లేదా జనవరి 2018 నుండి ప్రొడక్షన్ స్టార్ట్ చేయనున్నట్లు తెలిసింది. ఇదే సంస్థలో హీరో మోటోకార్ప్ భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్

బజాజ్ ఆటో ఈ మధ్యనే తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా అర్బనైట్ బ్రాండ్ పేరును స్టార్ట్ చేసింది. ఇది బ్యాటరీ ఆధారంతో నడిచే టూ వీలర్లను తయారు చేయనుంది.పూనే ఆధారిత టార్క్ అనే సంస్థ టి6ఎక్స్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను అభివృద్ది చేసింది. టీవీఎస్ కూడా రహస్యంగా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిసింది.

మహీంద్రా ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2030 నాటికి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే అనుమతించే లక్ష్యంతో ఉంది. దీనికి అనుగుణంగా ఫోర్ వీలర్లు మరియు టూ వీలర్లు అనే తేడా లేకుండా అన్ని సంస్థలు ఎలక్ట్రిక్ పవర్‌తో నడిచే వాహనాలను అభివృద్ది చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ సంస్థలో పోటీ తీవ్రమవుతోంది.

English summary
Read In Telugu: Mahindra Working On Electric Scooter For India
Story first published: Thursday, September 28, 2017, 19:09 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark