హెల్మెట్ లేని వారికి అక్కడి పోలీసుల కొత్త రూల్

Written By:

మోటార్ సైకిల్ రైడర్ మరియు తోటి ప్రయాణికుడు ఇద్దరూ తప్పనిసరిగా శిరస్త్రాణం ధరించాలనే నియమం దేశ వ్యాప్తంగా అమల్లో ఉంది. నిజానికి వ్యక్తిగత ఆసక్తితో అందరూ హెల్మెట్ ధరించాలి. కాని ఇందుకు చాలా మంది భిన్నంగా వ్యహరించి చిన్న చిన్న ప్రమాదాలకే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎలాగైనా మోటార్ సైకిళ్ల రైడర్లు మరియు వాటి తోటి ప్రయాణికులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించే విధంగా మార్పు తెచ్చేందుకు మైసూరు ట్రాఫిక్ పోలీసులు ఓ కొత్త నియమాన్ని అమలు చేస్తున్నారు... అదేంటో చూద్దాం రండి...

మైసూర్ ట్రాఫిక్ పోలీసులలో పరిధిలో ఓ కొత్త రూల్ అమల్లో ఉంది. అది ఏమిటంటే... బైకు మీద వెళ్తున్నపుడు రైడర్ మరియు కో రైడర్ ఇద్దరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. అలా ధరించకుండా పోలీసుల కంట పడితే మోటార్ సైకిల్ ను సీజ్ చేస్తారు.

మునుపయితే శిరస్త్రాణం ధరించనందుకు గాను జరిమానా విధించే వారు. అయితే చాలా మంది చేసేది లేక జరిమానా చెల్లించి అక్కడ నుండి జారుకునే వారు. జరిమానా చెల్లించడానికి వెనుకాడేవారు కాదు గానీ. హెల్మెట్ ధరించడానికి మాత్రం అయిష్టం చూపేవారు.

ద్విచక్ర వాహన దారుల ఆటకట్టించే విధంగా, ఏకంగా వారి మోటార్ సైకిళ్లను సీజ్ చేయడానికి సిద్దమైపోయారు పోలీసులు. ఆ తరువాత తమ వద్ద రెండు హెల్మెట్‌లు ఉన్నాయని చూపిస్తూ వారి బైకును విడిపించుకుపోవచ్చు.

మైసూరు ట్రాఫిక్ పోలీసుల తెలిపిన నివేదికల ప్రకారం, రోజుకు సుమారుగా 300 ద్విచక్ర వాహనదారులు మరియు వారి తోటి ప్రయాణికులు హెల్మెట్ రూల్‌ను ఉల్లంఘించినందుకు జరిమానా చెల్లిస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు తెచ్చేందుకే ఈ ప్రయత్నమని పోలీస్ కమీషనర్ ఏఎస్ రావు తెలిపాడు.

ట్రాఫిక్ ఏసిపి కెఎన్ మాదయ్య మాట్లాడుతూ, హెల్మెట్ నియమాన్ని ఉల్లంఘించే వారి బైకులను శాశ్వతంగా కాకుండా తాత్కాలికంగా నిర్బంధిస్తున్నట్లు వివరించాడు.

సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం, ప్రతి వాహనం ఇన్సూరెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇన్సూరెన్స్ లేని వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేస్తున్నట్లు కూడా పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు.

హెల్మెట్ మాత్రమే కాకుండా భద్రతకు సంభందించి రైడింగ్‌లో మొబైల్ ఫోన్ వినియోగించడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దాటడం మరియు గూడ్స్ వాహనాలలో ప్రజలను తరలించడం వంటి వాటిపై కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

English summary
Mysore Police Seize Two Wheeler Riding Without Helmet
Please Wait while comments are loading...

Latest Photos