కాపర్ షైన్ పెయింట్ స్కీమ్‌లో టీవీఎస్ ఎక్స్ఎల్100

Written By:

దక్షిణ భారత దిగ్గజ టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ మోటార్స్ తమ ఎంట్రీ లెవల్ మల్టీ యుటిలి మోపెడ్ టూ వీలర్ ఎక్స్ఎల్100(XL100)ను సరికొత్త కలర్ స్కీములో విడుదల చేసింది.

టీవీఎస్ ఎక్స్ఎల్100

పది లక్షలకు పైగా సంతృప్తి చెందిన టీవీఎస్ ఎక్స్ఎల్100 కస్టమర్లను చేరుకుంది. ఈ తరుణంలో కస్టమర్లకు మరిన్ని కలర్ ఆప్షన్స్ అందించేందుకు సరికొత్త కాపర్ షైన్ కలర్‌ను జోడించింది.

కాపర్ షైన్ కలర్ ఆప్షన్ ఆప్షన్‌తో కలుపుకొని టీవీఎస్ ఎక్స్ఎల్100 టూ వీలర్‌ను ఆకుపచ్చ, ఎరుపు, నీలం, నలుపు, మరియు గ్రే రంగుల్లో ఎంచుకోవచ్చు.

Recommended Video - Watch Now!
[Telugu] TVS Jupiter Classic Launched In India - DriveSpark
టీవీఎస్ ఎక్స్ఎల్100

కలర్ ఆప్షన్‌తో పాటు బిఎస్ ఉద్గార నియమాలను పాటించే 99.7సీసీ కెపాసిటిగల ఫోర్ స్ట్రోక్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అదించింది. 4.1బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి మునుపటి 100సీసీ ఇంజన్‌తో పోల్చుకుంటే సరికొత్త ఇంజన్ 4.3బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100

పల్లె ప్రాంతాల్లో ఎన్నో అవసరాలకు ఉపయోగపడే టీవీఎస్ ఎక్స్ఎల్ మోపెడ్‌ను, హెవీ డ్యూటీ కోసం అభివృద్దిపరిచిన ఇంజన్‌లో టీవీఎస్ ప్రవేశపెట్టింది. మోపెడ్ సెగ్మెంట్లో అత్యున్నత నాణ్యతతో ప్రమాణాలతో లభించే ఏకైక టూ వీలర్ టీవీఎస్ ఎక్స్ఎల్100.

లీటరుకు 67 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ ప్రారంభ ధర రూ. 32,209 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

English summary
Read In Telugu: new tvs xl100 colour specifications features images

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark