ఆంధ్రాలో పరీక్షలకొచ్చిన నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే

Written By:

దక్షిణ భారత టూ వీలర్ల తయారీ సంస్థ టీవీఎస్ తమ తరువాత తరం అపాచే ఆర్‌టిఆర్ 160 మోటార్ సైకిల్‌ను విడుదలకు సిద్దం చేస్తోంది. నెక్ట్స్ జనరేషన్ అపాచే ఆర్‌టిఆర్ 160 బైకును ఇప్పటికే పలుమార్లు రహస్యంగా పరీక్షించగా, తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పరీక్షించింది.

నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

సరికొత్త అపాచే ఆర్‌టిఆర్ 160 బైకును టీవీఎస్ బృందం విశాఖపట్టణంలో రహస్యంగా పరీక్షించగా ఓ ఆటోమొబైల్ మీడియా కంటబడింది. అయితే ఈ సారి, ఈ 160సీసీ ఇంజన్ గల అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బ్యాడ్జి గల బాడీ ప్యానల్స్‌లో ఉంది

నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

సరికొత్త అపాచే ఆర్‌టిఆర్‌లో సింగల్ పీస్ హ్యాండిల్ బార్, రెగ్యులర్ అల్లాయ్ వీల్స్, సింగల్ పీస్ సీట్ మందంగా ఉన్న వెనుక టైరు, అదే విధంగా అపాచే ఆర్‌టిఆర్ 180 మరియు ఆర్‌టిఆర్ 200 4వి మోడళ్లలో ఉన్న వైట్ రిమ్ స్ట్రిప్స్ ఇందులో ఉన్నాయి.

Recommended Video - Watch Now!
TVS Jupiter Classic Launched In India | In Telugu - DriveSpark తెలుగు
నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

ఆపాచే ఆర్‌టిఆర్ 200 4వి డిజైన్ లక్షణాలతో అపాచే ఆర్‌టిఆర్ 160 బైకును టీవీఎస్ అభివృద్ది చేసింది. స్వల్పంగా ఉన్న బాడీ డీకాల్స్, ఫ్యూయల్ ట్యాంక్, డబుల్ బ్యారెల్ ఎగ్జాస్ట్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ మరియు టర్న్ ఇండికేటర్లు వంటివి అచ్చం 200సీసీ బైకులో ఉన్నవాటినే పోలి ఉన్నాయి.

నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

టీవీఎస్ తొలిసారి తమ ఆపాచే ఆర్‌టిఆర్ 160 బైకులో వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్ సిస్టమ్ అందించింది. బ్రేక్ డ్యూటీ కోసం ముందు వైపున సింగల్ డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

సాంకేతికంగా టీవీఎస్ ఆపాచే ఆర్‌టిఆర్ 160 బైకు అదే మునుపటి 160సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్‌తో రానుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ 15.2బిహెచ్‌పి పవర్ మరియు 13.1ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

నెక్ట్స్ జనరేషన్ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ తమ తరువాత తరం అప్‌డేటెడ్ అపాచే ఆర్‌టిఆర్ 160 బైకును లాంచ్ చేయడానికి సిద్దంగా ఉంది. ఆపాచే ఆర్‌టిఆర్ 180 కూడా ఇదే శైలిలో విడుదలవ్వనుంది. సరికొత్త అపాచే ఆర్‌టిఆర్ 160 విపణిలో ఉన్న పల్సర్ ఎన్ఎస్160, సుజుకి జిక్సర్, యమహా ఎఫ్‌జడ్ వి2.0 మరియు హోండా సిబి హార్నెట్ 160ఆర్ లతో గట్టి పోటీని ఎదుర్కోనుంది.

English summary
Read In Telugu: Next-Gen TVS Apache RTR 160 Spotted With RTR 200 4V Badge
Story first published: Wednesday, September 6, 2017, 15:39 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark