భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్: నార్టన్ ఫ్యూచర్‌లో విడుదల చేయనున్న బైకులు

Written By:

నార్టన్ మోటార్‌సైకిల్స్ అధికారికంగా ఇండియన్ టూ వీలర్ల మార్కెట్లోకి ప్రవేశించింది. ఇంగ్లాండుకు చెందిన మరో టూ వీలర్ల తయారీ దిగ్గజం నార్టన్ మోటార్‌సైకిల్స్ దేశీయంగాన్న పూనే ఆధారిత కైనటిక్ గ్రూపుతో చేతులు కలిపింది.

నార్టన్ మోటార్‌సైకిల్స్

కైనటిక్ బ్రాండ్ ఇదివరకే ఎమ్‌వి అగస్టా మరియు ఎస్‌డబ్ల్యూఎమ్ వంటి ద్విచక్ర వాహన తయారీ సంస్థలతో భాగస్వామ్యపు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు నార్టన్ మోటార్‌సైకిల్స్ చేరికతో ఇండియాలో కైనటిక్ గ్రూపు ఆధ్వర్యంలో మొత్తం మూడు సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.

Recommended Video - Watch Now!
[Telugu] Yamaha Launches Dark Night Variants - DriveSpark
భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

దేశీయ మరియు బ్రిటీష్ సంస్థల ఉమ్మడి భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, ఇటీవల ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన 2017 EICMA మోటార్ సైకిల్ షో వేదిక మీద ఇరు సంస్థలు పరస్పర అవగాహన కుదుర్చుకున్నాయి.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

నార్టన్ కంపెనీ తమ మోటార్ సైకిళ్ల తయారీ కోసం మహారాష్ట్రలోని కైనటిక్ ప్రొడక్షన్ ప్లాంటును వినియోగించుకోనుంది. ఇక్కడ తయారయ్యే మోటార్ సైకిళ్లను ఆసియా మార్కెట్‌తో పాటు మలేషియా, మాల్దీవులు, మంగోలియా, కంబోడియా, సింగపూర్, శ్రీలంక, థాయిలాండ్ మరియు వియత్నాం దేశాలకు ఎగుమతి చేయనుంది.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

ప్రస్తుతం ఉన్న మోడళ్లు మరియు ఫ్యూచర్ మోడళ్ల అభివృద్దికి కావలసిన పరిజ్ఞానం మరియు డిజైన్ కోసం ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నార్టన్ మోటార్‌సైకిల్స్ పేర్కొంది.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

నార్టన్ మోటార్‌సైకిల్స్ కమాండ్ సిరీస్ బైకులను 2018 చివరి నాటికి ఇండియా మరియు ఆసియా మార్కెట్ మొత్తం లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. అంతేక కాకుండా మోటోరాయలె మరియు నార్టన్ లిమిటెడ్ ఎడిషన్ బైకులను బ్రిటన్ నుండి దిగుమతి చేసుకుని వచ్చే ఏడాది ప్రారంభం నాటికి విపణిలో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

నార్టన్ మోటార్‌సైకిల్స్‌లో మంచి పాపులారిటీ దక్కించుకున్న కమాండ్ మరియు డామినేటర్ లోని విభిన్న వేరియంట్లను పూర్తి స్థాయిలో ఇండియాలో ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కమాండ్ సిరీస్ బైకుల్లో కమాండ్ 961 స్పోర్ట్, కమాండో 961 కఫే రేసర్ మరియు డామినేటర్ శ్రేణిలో డామినేటర్ స్పోర్ట్ మరియు డామిరేసర్ ఉన్నాయి.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

నార్టన్ డామినేటర్ బైకుల్లో 961సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ డ్రై సంప్ లుబ్రికేషన్ సిస్టమ్ గల ఇంజన్ కలదు. యురో 4 ఉద్గార నియమాలను పాటించే 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ 79బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

నార్టన్ డామినేటర్‌లో ప్రీలోడెడ్ కంప్రెషన్ మరియు రీబౌండ్ గల అడ్జస్టబుల్ 43ఎమ్ఎమ్ అప్ సైడ్ డౌన్ ఓహ్లిన్స్ ఫ్రంట్ ఫోర్క్స్, అధే విధంగా వెనుక వైపున ఓహ్లిన్స్ టిటిఎక్స్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు. రైడర్ హైట్, ప్రీలోడ్ మరియు కంప్రెషన్ వంటి ఫీచర్లు రియర్ షాక్ అబ్జార్వర్‌లో ఉన్నాయి.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

ట్విన్ ప్యార్లల్ ఇంజన్ గల ఈ బైకులో వేగాన్ని అదుపు చేయడానికి ముందు వైపున రెండు 320ఎమ్ఎమ్ బ్రెంబో డిస్క్ బ్రేకులు మరియు వెనుకవైపున డబుల్ పిస్టన్ కాలిపర్ గల 220ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ కలదు.

భారత్‌లోకి నార్టన్ మోటార్‌సైకిల్స్

నార్టన్ మోటార్‌సైకిల్స్ తమ కమాండో బైకుల్లోని చాలా వరకు ప్రధాన విడిభాగాలను డామినేటర్ బైకుల్లో కూడా అందించింది. నార్టన్ మోటార్‌సైకిల్స్ కైనటిక్ ఉమ్మడి భాగస్వామ్యంతో భవిష్యత్తులో ఎన్నో కొత్త మోడళ్ల ఆష్కరణ, అభివృద్ది మరియు తయారీకి శ్రీకారం చుట్టింది.

English summary
Read In Telugu: Norton Motorcycles Arrives In India; Announces Upcoming Products and Future Strategies
Story first published: Thursday, November 16, 2017, 10:46 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark